గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఏవై-యు) కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (యుటిలు)కు కేంద్ర సహాయం

నాడు పోస్టు చేయడమైనది: 03 FEB 2022 5:44PM by PIB Hyderabad

హౌసింగ్‌పై పథకాలు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాఅమలు చేస్తున్నాయి. భూమి, కాలనీల నిర్మాణం రాష్ట్ర పరిథిలో ఉన్న అంశము. అయితే, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 నాటికి 'అందరికీ హౌసింగ్' అనే దృక్పథంతో, అందరికీ ఇళ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ ( పీఎంఏవై-యు) కింద 25.06.2015 నుండి అర్హత కలిగిన కుటుంబాలు/ లబ్ధిదారుల కోసం కేంద్ర సహాయం అందించడం ద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చేపడుతున్న కార్యక్రమాలకు అనుబంధంగా ఉంది.  పీఎంఏవై-యు పథకం కింద లక్ష్యాలు లేవు. డిమాండ్ ఆధారంగా, రాష్ట్రం/యుటి ప్రభుత్వం  పీఎంఏవై-యు కింద ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. రాష్ట్ర స్థాయి మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ (ఎస్ఎల్ఎస్ఎంసి) తగిన ఆమోదం పొందిన తర్వాత మంజూరు కోసం మంత్రిత్వ శాఖకు సమర్పిస్తుంది. 2017లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా చెల్లుబాటు అయ్యే 1.12 కోట్ల ఇళ్ల డిమాండ్‌కు గాను పీఎంఏవై-యు కింద మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 1.14 కోట్లను మంజూరు చేసింది. 

రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల వారీగా గృహాల డిమాండ్ మరియు మంజూరు వివరాలు:

(24.01.2022 తేదీ నాటికి)

క్రమ సంఖ్య .

రాష్ట్రాలు/యుటి 

 డిమాండ్ (సంఖ్య)
 

ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లు (సంఖ్య)

 
 

1

అండమాన్ నికోబర్ దీవులు 

670

602

 

2

ఆంధ్రప్రదేశ్ 

20,50,000

20,40,640

 

3

అరుణాచల్ ప్రదేశ్ 

8,000

9,135

 

4

అస్సాం 

1,40,000

1,68,261

 

5

బీహార్ 

3,75,000

3,64,084

 

6

చండీగఢ్ 

1,000

1,578

 

7

చత్తిస్గఢ్ 

3,00,000

2,99,365

 

8

దాదర్&నాగర్ హవేలీ, డయ్యు డామన్ 

6,023

8,174

 

9

ఢిల్లీ 

79,000

26,051

 

10

గోవా 

4,845

4,155

 

11

గుజరాత్ 

7,65,000

8,56,967

 

12

హర్యానా 

1,50,000

1,55,682

 

13

హిమాచల్ ప్రదేశ్ 

13,000

12,681

 

14

జమ్మూ కాశ్మీర్ 

79,331

48,711

 

15

ఝార్ఖండ్ 

2,20,000

2,34,778

 

16

కర్నాటక 

7,00,000

6,93,531

 

17

కేరళ 

1,30,000

1,39,837

 

18

లడఖ్ 

1,926

1,373

 

19

లక్షద్వీప్ 

-

-

 

20

మధ్యప్రదేశ్ 

8,50,000

8,64,720

 

21

మహారాష్ట్ర 

13,50,000

13,51,614

 

22

మణిపూర్ 

55,000

56,094

 

23

మేఘాలయ 

6,000

5,333

 

24

మిజోరాం 

40,000

39,872

 

25

నాగాలాండ్ 

35,000

32,331

 

26

ఒడిశా 

1,80,000

2,05,989

 

27

పుదుచ్చేరి 

15,650

16,455

 

28

పంజాబ్ 

1,15,000

1,10,857

 

29

రాజస్థాన్ 

2,20,000

2,19,503

 

30

సిక్కిం 

1,500

637

 

31

తమిళ నాడు 

7,15,000

7,19,790

 

32

తెలంగాణ 

2,25,000

2,33,072

 

33

త్రిపుర 

92,000

91,777

 

34

ఉత్తరప్రదేశ్ 

17,00,000

17,34,109

 

35

ఉత్తరాఖండ్ 

50,000

61,882

 

36

పశ్చిమ బెంగాల్ 

5,50,000

5,56,647

 

మొత్తం 

1,12,23,945

1,14,02,341^

 

^ సిఎల్ఎస్ఎస్ కింద లబ్ధిదారుల కోసం 36,054 ఇళ్లకు ఇటీవల విడుదల చేసిన సబ్సిడీని కలిపి 

రాష్ట్రాలు/యుటిలు ప్రతిపాదించిన మరియు సక్రమంగా ఆమోదించిన విధంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు గృహాలను అందించడానికి అన్ని ప్రాజెక్ట్ ప్రతిపాదనలను మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. తదుపరి ఆమోదం కోసం మంత్రిత్వ శాఖ వద్ద తాజా డిమాండ్ ఏదీ పెండింగ్‌లో లేదు. మిషన్ కాలం వరకు రాష్ట్రాలు/యుటిల నుండి స్వీకరించిన ప్రతిపాదనలను మంజూరు చేయడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది.

హౌసింగ్ & అర్బన్ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 1795292) సందర్శకుల సూచీ సంఖ్య : : 135
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Manipuri