పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పైలెట్ల కొరతను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు
Posted On:
03 FEB 2022 5:28PM by PIB Hyderabad
దేశంలో పైలెట్ల కొరతను పరిష్కరించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో దిగువన పేర్కొన్న అంశాలు ఉన్నాయిః
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) సరళీకృత ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టిఒ) విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్ రాయల్టీ (ఎఫ్‌టిఒలు ఎఎఐకి చెల్లించే రెవిన్యూ వాటా)ను రద్దు చేయడమే కాక భూమి కిరాయిని చెప్పుకోదగినంతగా హేతుబద్ధం చేశారు.
ఐదు విమానాశ్రయాలు) బెళగావి (కర్ణాటక) లో రెండు, జల్గాంవ్ (మహారాష్ట్ర)లో రెండు, కలబురగి (కర్ణాటక)లో రెండు, ఖజురాహో (మధ్యప్రదేశ్)లో రెండు, లీలాబారీ (అస్సాం)లో ఒకటితో కలిపి మొత్తం తొమ్మిది ఎఫ్‌టిఒలను ఏర్పాటు చేసేందుకు 31 మే 2021న, 29 అక్టోబర్ 2021న ఎఎఐ కేటాయింపు లేఖలను జారీ చేసింది.
డిజిసిఎ విమాన నిర్వహణ ఇంజినీర్లు (ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ -ఎఎంఇ) ఫ్లైయింగ్ క్రూ (ఎఫ్‌సి) అభ్యర్ధులకు ఆన్‌లైన్ -ఆన్ డిమాండ్ పరీక్ష (ఒఎల్ఒడిఇ)ని డిజిసిఎ ప్రవేశపెట్టింది. అందుబాటులో ఉన్న పరీక్ష స్లాట్లను బట్టి అభ్యర్ధులు తేదీని, సమయాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇది అందిస్తుంది.
ఎఫ్‌టిఒలలో వైమానిక కార్యకలాపాలకు ఉత్తర్వులిచ్చే హక్కుతో ఫ్లైయింగ్ ఇనస్ట్రక్టర్లను సాధికారం చేసేందుకు డిజిసిఎ తన నిబంధనలను సవరించింది. కాగా, దీనిని చీఫ్ ఫ్లైయింగ్ ఇనస్ట్రక్టర్ (సిఎఫ్ఐ), లేదా డిప్యూటీ సిఎఫ్ఐలకు మాత్రమే పరిమితం చేసింది.
భారత దేశంలోని అమేథీలో (ఉత్తర్‌ప్రదేశ్) అతిపెద్ద ఫ్లైయింగ్ అకాడమీ - ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ (ఐజిఆర్‌యుఎ)కి గోండియా (మహారాష్ట్ర), కలబురగి (కర్ణాటక)లో పైలెట్ శిక్షణను ఇచ్చేందుకు అనుమతించారు. తద్వారా తన ఫ్లైయింగ్ అవర్స్‌ను, విమాన వినియోగాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. సాధారణంగా, శీతాకాలంలో దృష్టిగోచరత తక్కువగా ఉన్నందున తీవ్రంగా ఇవి ప్రభావితం అవుతాయి.
ఐజిఆర్‌యుఎ వారాంతాలు, అన్ని శలవల్లో కార్యకలాపాలను ప్రారంభించింది. కేవలం 2021వ సంవత్సరంలో 19,019 ఫ్లైయింగ్ అవర్స్‌ను పూర్తి చేసింది. ఇది కోవిడ్ ముందస్తు ఏడాది 2019లోని 15,137 గంటలతో పోలిస్తే 25% ఎక్కువ.
భారతీయ ఎఫ్‌టిఒలు 2021లో ఉత్పత్తి చేసిన సిపిఎల్ హోల్డర్ల సంఖ్య 504గా ఉంది. ఇది కోవిడ్ ముందస్తు ఏడాది 2019లో భారతీయ ఎఫ్‌టిఒలు తయారు చేసిన 430 సిపిఎల్‌తో పోలిస్తే అధికం.
ఈ సమాచారాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్). వి.కె. సింగ్ (రిటైర్డ్) నేడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1795271)
Visitor Counter : 130