మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
అంగన్ వాడీ సర్వీసులు
Posted On:
02 FEB 2022 5:03PM by PIB Hyderabad
అంగన్ వాడీ సర్వీసుల కింద ఆరు రకాలైన సేవలు అందుబాటులో ఉన్నాయి. అవి (i) అనుబంధ పోషకాహారం; (ii) ప్రీ స్కూల్ స్థాయి అనియత విద్య; (iii) పోషకాహారం & ఆరోగ్య విద్య; (iv) టీకాల కార్యక్రమం; (v) ఆరోగ్య పరీక్షలు; (vi) రిఫరల్ సర్వీసులు. దేశవ్యాప్తంగా పని చేస్తున్న అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అర్హులైన వారందరికీ అంటే 0-6 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలలు, గర్భిణులు, బాలింతలకు ఈ సేవలు అందుతున్నాయి. ఈ సేవల్లో టీకా కార్యక్రమం, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య సంబంధిత రిఫరల్ సర్వీసుల వంటివి ఎన్ హెచ్ఆర్ఎం, ప్రభుత్వ ఆరోగ్య మౌలిక వసతుల ద్వారా అందిస్తున్నారు.
గత మూడు సంవత్సరాల కాలంలోను, వర్తమాన సంవత్సరంలోను లబ్ధిదారుల వివరాలు ఈ దిగువ పట్టికలో ఉన్నాయి.
Financial Year
|
Children
(below six years)
|
Pregnant Women & Lactating mothers
|
TOTAL
|
2018-19
|
70374122
|
17186549
|
87560671
|
2019-20
|
68630173
|
16874975
|
85505148
|
2020-21
|
67509696
|
15673127
|
83182823
|
2021-22*
|
73691025
|
16925928
|
90616953
|
(*30.06.2021 నాటికి)
ఎన్ఎఫ్ హెచ్ఎస్-5 (2019-21) నివేదిక ప్రకారం 5 సంవత్సరాల లోపు బాలల్లో పోషకాహార సూచికలు ఎన్ఎఫ్ హెచ్ఎస్-4 (2015-16)తో పోల్చితే మెరుగుపడ్డాయి. కుంగుబాటు 38.4 శాతం నుంచి 35.5 శాతానికి, వృధా 21.0 శాతం నుచి 19.3 శాతానికి, తక్కువ బరువు సమస్య 35.8 శాతం నుంచి 32.1 శాతానికి తగ్గాయి.
అంగన్ వాడీ కేంద్రాల్లో (ఎడబ్ల్యుసిలు) మౌలిక వసతుల అభివృద్ధికి సౌకర్యాల మెరుగుదలకు పలు చర్యలు తీసుకున్నారు.
(i) అంగన్ వాడీ సర్వీసులను (ఐసిడిఎస్ పథకం) కూడా భాగస్వామ్యంగా చేసుకుంటూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద దేశ వ్యాప్తంగా 4 లక్షల ఎడబ్ల్యుసి భవనాల నిర్మాణానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ; గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సవరించిన ఉమ్మడి మార్గదర్శకాలు జారీ చేశాయి.
(ii) స్వచ్ఛ కార్యాచరణ ప్రణాళిక కింద ఒక్కో ఎడబ్ల్యుసికి మంచినీటి వసతికి రూ.10,000/-; ఒక్కో ఎడబ్ల్యుసికి మరుగుదొడ్డి సదుపాయం కల్పనకు రూ.12,000/- కేటాయించారు.
(iii) వాటర్ ఫిల్టర్లు, ఫర్నిచర్, ఇతర పరికరాల కొనుగోలుకు కూడా గ్రాంట్లు మంజూరు చేయడం జరిగింది.
(iv) సమర్థవంతంగా సేవలందించడానికి అంగన్ వాడీ పని వారందరికీ స్మార్ట్ ఫోన్లు అందించారు.
(v) నాణ్యత భరోసా; వివిధ విధులు నిర్వహించేవారికి పాత్రలు, బాధ్యతల నిర్దేశం; సేకరణ విధానాలు; ఆయుష్ కాన్సెప్ట్ ల అమలు; డేటా మేనేజ్మెంట్; పారదర్శకత కోసం పోషణ్ ట్రాకర్ ద్వారా పర్యవేక్షణ; అనుబంధ పోషకాహారం అందించడంలో బాధ్యతల నిర్దేశం వంటి అంశాలతో కూడిన సవరించిన మార్గదర్శకాలను 13.01.2022 రోజున జారీ చేశారు.
బుధవారం రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ సమాచారం అందించారు.
****
(Release ID: 1794993)
Visitor Counter : 87