శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రంగురంగుల త్రివర్ణ పతాకాన్ని వెలిగించి- దేశాన్ని అబ్బురపరచిన "బీటింగ్ రిట్రీట్" డ్రోన్ లైట్ షో "స్టార్ట్ అప్స్"ను సత్కరించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సృజనాత్మక స్టార్ట్-అప్ ల ద్వారా ఉదార నిధులు పొందడం కోసం డి ఎస్ టి నియమ నిబంధనలు సరళీకృతం చేస్తున్నట్లు మంత్రి వెల్లడి

స్టార్ట్-అప్ ల పర్యావరణ వ్యవస్థ ప్రోత్సాహానికి త్వరలో సింగిల్ విండో అనుమతులు, త్వరితగతిన ప్రాజెక్టుల ప్రాసెసింగ్, ఇంక్యుబేషన్ కోసం సదుపాయాలు , స్టార్ట్-అప్ ల మ్యాచింగ్ ఫండింగ్ బాధ్యతను సమీక్షించడం వంటి అంశాల నోటిఫై: డాక్టర్ జితేంద్ర సింగ్

సృజనాత్మక స్టార్ట్-అప్ లకు మద్దతు ఇవ్వడానికి పరిశ్రమలతో కలసి సమీకృత విధానంతో ఒక రకమైన రివాల్వింగ్ ఫండ్ ను రూపొందించాలని సీనియర్ అధికారులకు డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశం

Posted On: 02 FEB 2022 6:49PM by PIB Hyderabad

సైన్స్ టెక్నాలజీ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి , పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి , అంతరిక్ష శాఖల సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు "బీటింగ్ రిట్రీట్' డ్రోన్ లైట్ షో "స్టార్ట్ అప్స్"ను సత్కరించారు, జనవరి 29 సాయంత్రం న్యూఢిల్లీ లోని విజయ్ చౌక్ లో రంగురంగుల త్రివర్ణ పతాకాన్ని వెలిగించడం ద్వారా యావత్ దేశాన్ని వారు మంత్రముగ్ధులను చేశారు.

"బోట్ లాబ్" స్టార్ట్-అప్ సహ వ్యవస్థాపకులు, హర్యానాకు చెందిన సరితా అహ్లావత్, మధ్యప్రదేశ్ కు చెందిన తన్మయ్ బంకర్ , బీహార్ కు చెందిన అనుజ్ కుమార్ బర్న్వాల్, వారి ఇతర జట్టు సభ్యులతో పాటు ౩౦ మంది హాజరయ్యారు. వారిని మంత్రి వ్యక్తిగతంగా సత్కరించి సన్మానించారు.

ఈ ప్రాజెక్టును చేపట్టిన ఆరు నెలల్లోనే వారు సాధించిన చారిత్రాత్మక ఘనతను అభినందిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్ -దేశం వారి పట్ల గర్వపడుతోందని, వారిని గౌరవించడం ద్వారా, వాస్తవానికి ఇంత నమ్మశక్యం కాని యువ శాస్త్రీయ మెదడులను కనుగొన్నందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తనను తాను అభినందించు కుంటున్నదని అన్నారు. దేశవ్యాప్తంగా దాగి ఉన్న సామర్థ్యాలను చేరుకోవడానికి , కనుగొనడానికి , తరువాత వారు ఎదగడానికి రాణించడానికి మద్దతు ఇచ్చే  మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని ఇది ఆవిష్కరిస్తున్నదని  ఆయన అన్నారు.

సృజనాత్మక స్టార్ట్-అప్ లకు మద్దతు ఇవ్వడానికి ఒక రకమైన రివాల్వింగ్ ఫండ్ ను రూపొందించడానికి సమీకృత విధానాన్ని అభివృద్ధి చేయడానికి పరిశ్రమలను ఆకర్షించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సీనియర్ అధికారులను ఆదేశించారు. సృజనాత్మక స్టార్ట్-అప్ ల ద్వారా లిబరల్ ఫండింగ్ పొందడం కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్ టి)లో నియమనిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సింగిల్ విండో క్లియరెన్స్, ప్రాజెక్టుల వేగవంతమైన ప్రాసెసింగ్, ఇంక్యుబేషన్ కోసం సౌకర్యాలు , స్టార్ట్-అప్ ల ద్వారా మ్యాచింగ్ నిధుల బాధ్యతను సమీక్షించడం వంటి సమస్యలను త్వరలో దేశంలో స్టార్ట్-అప్ ల పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి నోటిఫై చేయనున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

నిన్న ఆమోదించిన కేంద్ర బడ్జెట్ ను ప్రస్తావిస్తూ, స్టార్ట్-అప్ ల ద్వారా "డ్రోన్ శక్తి"తో సహా డ్రోన్లకు ప్రాధాన్యత ఇవ్వడం , వ్యవసాయ రంగంలో కిసాన్ డ్రోన్లను ఉపయోగించడం భారతదేశాన్ని స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ కు గ్లోబల్ హబ్ గా చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికతను నెరవేర్చడానికి తీసుకున్న చర్యలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

బీటింగ్ రిట్రీట్ వేడుక సందర్భంగా ఒక భారతీయ స్టార్ట్-అప్ -1,000 డ్రోన్లతో ఆకాశాన్ని వెలిగించే అత్యంత చర్చనీయాంశమైన , చాలా ప్రశంస పొందిన  ప్రత్యేక ఘనతను సాధించగలదని బోట్ లాబ్ ప్రపంచానికి నిరూపించిందని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఎస్ టి కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, కార్యదర్శి డాక్టర్ శేఖర్ మాండే, సెక్రటరీ సిఎస్ఐఆర్, డాక్టర్ రాజేష్ గోఖలే , బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్,  సెక్రటరీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ  ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, మాజీ కార్యదర్శి, డి ఎస్ టి, రాజేష్ కుమార్ పాఠక్, టిడిబి కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

బోట్ లాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డాక్టర్ సరితాఅహ్లావత్ , డ్రోన్ షో సారథులు తన్మయ్ బంకర్, సుజిత్ రాణా, మోహిత్ శర్మ, హర్షిత్ బాత్రా, కునాల్ మీనా , మొత్తం ఇంజనీర్ల బృందం బోట్ లాబ్

విజయోత్సవాన్ని జరుపుకోవడానికి పృథ్వీభవన్ వద్ద చేరారు. .

లడఖ్, ఈశాన్య స్టార్ట్-అప్ ల నుంచి వచ్చిన రెండు నిధుల ప్రతిపాదనలను టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డు పరిశీలిస్తోందని మంత్రి తెలియజేశారు. స్టార్ట్-అప్ ల సుస్థిరతకు నిధుల ఉదార లభ్యత ఒక ముందస్తు షరతు అని, ఆ పరిశ్రమ కేంద్ర శాస్త్రీయ విభాగాలతో భాగస్వామ్యం వహించాలని ఆయన అన్నారు.

బోట్ లాబ్ డైనమిక్స్ కు పరిశోధన. అభివృద్ధి కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ (డిఎస్ టి) రూ.కోటి రూపాయల ప్రాథమిక విత్తన నిధిని , తరువాత స్కేల్ అప్ , వాణిజ్యీకరణ కోసం భారతదేశంలో మొట్టమొదటి టెక్నలాజికల్ ప్రాజెక్టు అభివృద్ధి చేయడానికి టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డు రు. 2.5 కోట్ల రూపాయలు ఇచ్చింది.

కార్యదర్శి డిఎస్ టి , చైర్ పర్సన్, టిడిబి మాట్లాడుతూ " రాబోయే సంవత్సరాల్లో స్వదేశీ టెక్నాలజీల వాణిజ్యీకరణను ప్రారంభించడంలో టిడిబి ఒక ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని , ప్రస్తుత నాయకత్వంలో బహుళ రెట్లు పెరుగుతుందని విశ్వసిస్తున్నాను‘‘ అని అన్నారు. స్టార్ట్-అప్ లకు మద్దతు ఇవ్వడంలో టిడిబి కూడా గణనీయమైన పాత్ర పోషిస్తుంది. ,వారు ఎదగడానికి ఆత్మనిర్భర్ భారత్ మిషన్ కు కూడా దోహదపడుతుంది.

టిడిబి కార్యదర్శి రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ, "బోట్లాబ్ డైనమిక్స్ యొక్క ఈ యువ డ్రీమర్ల కలలకు మద్దతు ఇవ్వడం టిడిబి కి గర్వంగా ఉంది, వారి వ్యవస్థాపకులు డాక్టర్ సరితాఅహ్లావత్, శ్రీ తమ్మయ్ బంకర్ ,శ్రీ అనుజ్ కుమార్ బర్న్వాల్ నాయకత్వం లో

1000 డ్రోన్లతో ఆకాశాన్ని వెలిగించి,  ,అద్భుతమైన డ్రోన్ లైట్ షోను ప్రదర్శించడం ద్వారా  భారత్ ను ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన 4వ దేశంగా నిలబెట్టారనీ అన్నారు.

బోట్ లాబ్ సహ వ్యవస్థాపకుడు సరితాఅహ్లావత్ మాట్లాడుతూ, బోట్ లాబ్ మొత్తం స్టార్ట్ అప్ బృందం కీలకమైన సమయంలో ఆర్థిక మద్దతు ఇచ్చినందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం , ఐఐటి ఢిల్లీలకు కృతజ్ఞతలు తెలుపుతోందని చెప్పారు. రిపబ్లిక్ డే రిట్రీట్ వేడుకలో డ్రోన్ షో కలను విజయవంతంగా , భావనాత్మకంగా రూపొందించగలగడానికి  సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లోని వివిధ సంస్థల నుంచి అందిన ఆర్థిక సహాయమే కారణం అని ఆయన చెప్పారు.

 

<><><><><>


(Release ID: 1794925) Visitor Counter : 151


Read this release in: Tamil , English , Urdu , Hindi