హోం మంత్రిత్వ శాఖ
భారత ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచే దూరదృష్టి బడ్జెట్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు నా అభినందనలు: శ్రీ అమిత్ షా
మోదీ ప్రభుత్వపు ఈ బడ్జెట్ భారత్ ను స్వయం సమృద్ధం చేస్తుంది, 100 వ స్వాతంత్ర్య వార్షికోత్సవపు నవభారత పునాదులు నిర్మిస్తుంది
బడ్జెట్ పరిమాణం 39.45 లక్షల కోట్లకు పెంచటమే కోవిడ్ సంక్షోభంలోనూ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు చిహ్నం
ద్రవ్య లోటు లక్ష్యం 6.9% నుంచి 6.4% కు తగ్గించటం పెద్ద సాధన; ప్రధాని మోదీ నాయకత్వాన 4% దిగువకు వస్తుందని నా దృఢ విశ్వాసం
కోవిడ్ అనంతర అవకాశాల వినియోగంతో ప్రధాని మోదీ నాయకత్వాన స్వయం సమృద్ధ భారత్ కోసం రూపొందించిన ఈ బడ్జెట్ భారత్ ను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మార్చగలదు
సహకార రంగంలో ఏఎంటీ రేటు 18.5% నుంచి 15% కు, సర్ చార్జ్ ని 12% నుంచి 7% కు తగ్గించి దశాబ్దాల అన్యాయానికి స్వస్తి చెప్పారు
ఇది సహకార్ సే సమృద్ధి అనే మోదీ ఆకాంక్షను సాధించేలా తోడ్పడుతుంది
జీరో బడ్జెట్ సేద్యం, ప్రకృతి సేద్యం, నదుల అనుసంధానం, ఒక కేంద్రం-ఒక ఉత్పత్తి, రైతుల డ్రోన్ల వలన రైతులకు మేలు జరిగి వ్యవసాయ రంగాన్ని అధునాతనం, స్వయం సమృద్ధం చేయాలన్న ప్రధాని
Posted On:
01 FEB 2022 5:34PM by PIB Hyderabad
భారత ఆర్థిక వ్యవస్థను భారీగా పెంచే దూరదృష్టి బడ్జెట్ అని కేంద్ర హోమ్, సహకార శాఖా మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భారత ఆర్థిక వ్యవస్థను భారీ పరిమాణంలో పెంచగల సత్తా దీనికి ఉందన్నారు. అనేక వరుస ట్వీట్లతో ఆయన బడ్జెట్ ను అభినందనల్లో ముంచెట్టారు. మోదీ ప్రభుత్వం స్వయం సమృద్ధ భారత్ ను సాధించే దిశలో సాగిందని, వందేళ్ల స్వాతంత్ర్య భారత్ ను నవభారతంగా చూడటానికి అవసరమైన పునాదులు ఈ బడ్జెట్ తో పడ్డాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి, ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలియజేశారు.
బడ్జెట్ పరిమాణాన్ని రూ. 39.45 లక్షల కోట్లకు పెంచటం చూస్తుంటే కోవిడ్ సంక్షోభ సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా మూండాడుగు వేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ద్రవ్యలోటు 6.9% నుంచి 6.4% కు తగ్గటం ఒక పెద్ద సాధనగా అభివర్ణిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన ద్రవీఆలోటు 4% లోపుకు వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు.
స్వయం సమృద్ధ భారత్ కోసమ్ రూపుదిద్దుకున్న బడ్జెట్ వలన భారతదేశం ప్రపంచంలో ప్రముఖ ఆర్థిక వ్యవస్థల సరసన నిలబడగలదన్న ధీమా వ్యక్తం చేశారు. కోవిడ సంక్షోభ సమయంలో వచ్చిన అవకాశాలను అనుకూలంగా మాలచుకుంటూ ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో నడిపిస్తున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.
సహకార రంగం మీద విధిస్తూ ఉన్న ప్రత్యామ్నాయ కనీస పన్ను ( ఏఎంటీ) ని 18.5% నుంచి 15 శాతానికి తగ్గించటంతోబాటు సర్ చార్జ్ ని కూడా 12% నుంచి 7% కి తగ్గయివంచినందుకు ప్రధానికి శ్రీ అమిత్ షా ధన్యవాదాలు తెలియజేశారు. దీనివలన దశాబ్దాల తరబడి ఈ రంగం ఎదుర్కుంటూ ఉన్న అసమానత తొలగిపోయి ఇతర రంగాలతో సమానంగా మారిందన్నారు. ఇది మోడీ ఆకాంక్షించిన సహకార్ సే సమృద్ధి సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జీరో బడ్జెట్ సేద్యం, ప్రకృతి సేద్యం, నదుల అనుసంధానం, ఒక కేంద్రం-ఒక ఉత్పత్తి, రైతుల డ్రోన్ల వలన రైతులకు మేలు జరిగి వ్యవసాయ రంగాన్ని అధునాతనం, స్వయం సమృద్ధం చేయాలన్న ప్రధాని ఆశయం నెరవేరుతుందని కేంద్ర హోమ్ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మూలధన పెట్టుబడిని 35% పెంచి రూ.7.5 లక్షల కోట్లు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రాలకిచ్చే మొత్తాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ. 1 లక్ష కోట్లకు పెంచటం సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేయటానికి నిదర్శనమన్నారు.
మొత్తం 1.5 లక్షల పోస్టాఫీసులను బాంకింగ్ రంగంతో అనుసంధానం చేయటం గ్రామీణులకు. వృద్ధులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ 75 జిల్లాల్లో 75 డిజిటల్ బాంకులు ఏర్పాటు చేయటాన్ని కూడా అమిత్ షా అభినందించారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చొరవ అభినందనీయమన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి ఎప్పుడూ ప్రధాని ప్రాధాన్య అంశాలలో ఉంటుందని గుర్తు చేసుకున్నారు. ఇది ప్రధాని దీర్ఘకాల కళను నిజం చేయగలదని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం మీదనే ప్రధాని ప్రత్యేకల దృష్టి సారించారనటానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శన మన్నారు. హర్ ఘర్ జల్ కింద 3.83 కోట్ల ఇళ్ళకు నీరు ఇచ్చేందుకు రూ.60 వేలకోట్లు; పిఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల పేదల ఇళ్ళకు రూ.48 వేల కోట్లు కేటాయించటాన్ని అందుకు ఉదాహరణగా ప్రస్తావించారు.
****
(Release ID: 1794559)
Visitor Counter : 148