భారత ఎన్నికల సంఘం

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు 15 మంది ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఎన్నికల సంఘం


ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటం పై వారితో బ్రీఫింగ్ సమావేశం

Posted On: 01 FEB 2022 4:31PM by PIB Hyderabad

గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ శాసనసభల ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు నియమితులైన ప్రత్యేక పరిశీలకులతో భారత ఎన్నికల సంఘం ఈ రోజు బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించింది.డొమైన్ నైపుణ్యం యొక్క దోషరహితమైన , అద్భుతమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్న , ఎన్నికల ప్రక్రియలతో గత అనుభవం ఉన్న పదిహేను మంది మాజీ ప్రభుత్వోద్యోగులు, ప్రస్తుత ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ప్రత్యేక పరిశీలకులుగా నియమితులయ్యారు. ప్రత్యేక పరిశీలకులు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఎన్నికల యంత్రాంగం చేస్తున్న పనులను పర్యవేక్షిస్తారు తనిఖీ చేస్తారు. సి విజిల్, ఓటర్ హెల్ప్ లైన్ మొదలైన వాటి ద్వారా అందుకున్న ఇంటెలిజెన్స్ సమాచారం , ఫిర్యాదుల ఆధారంగా కఠినమైన, సమర్థవంతమైన అమలు చర్యలు తీసుకునేలా చూస్తారు. ఈ అధికారులు మొత్తం ఎన్నికల ప్రక్రియలను స్వేచ్ఛ గా, నిష్పాక్షికంగా ,ఓటరు స్నేహపూర్వ కంగా  నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ కళ్ళు , చెవులుగా వ్యవహరిస్తారు. 

 ప్రత్యేక పరిశీలకులను స్వాగతిస్తూ, సిఇసి శ్రీ సుశీల్ చంద్ర మాట్లాడుతూ, ఎన్నికల సంసిద్ధతను నిష్పాక్షికంగా అంచనా వేయడం, క్లిష్టమైన అంతరాలను గుర్తించడం ,నిష్పాక్షిక, ప్రేరణ రహిత, శాంతియుత ,కోవిడ్ సురక్షిత ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయడమే ప్రత్యేక పరిశీలకులను నియమించే విస్తృత స్ఫూర్తి అని అన్నారు.ప్రతి ఎన్నికలు ఒక 
ప్రత్యేకత , స్వంత లాజిస్టిక్స్ , సవాళ్లను 
కలిగి ఉంటాయని , అయినప్పటికీ అధిక ఓటింగ్ ను ప్రోత్సహించాలని శ్రీ చంద్ర వివ రించారు. ఈ విధంగా ప్రత్యేక పరిశీలకులు అప్రమత్తంగా ఉండాలనీ ,మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతటా నిజ సమయ ప్రాతిపదికన కమిషన్ తో సంప్రదింపులు జరపాలని ఇంకా అవసరమైన ఏవైనా దిద్దుబాటు చర్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.అన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని, ఓటర్లలో తగినంత విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలని,   ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఇబ్బంది, అసౌకర్యం లేని అనుభవాన్ని అందించాలని ఈసిఐ కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి అంగవైకల్యం ఉన్న వ్యక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు.
సీనియర్ సిటిజన్ 80+సంవత్సరాల ఓటర్ల కు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. . పోలింగ్ కేంద్రాలను కోవిడ్ ప్రోటోకాల్ కు అనుగుణంగా ,ఓటరు స్నేహపూర్వకంగా చేశారు.

ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక పరిశీలకులు తమ లోతైన పరిపాలనా అనుభవం, చతురత, అవగాహనతో క్షేత్ర పరిస్థితిని అంచనా వేయడంలో కమిషన్ కు ముఖ్యంగా  వాటాదారులందరి మధ్య కార్యకలాపాల సౌలభ్యం ఏర్పరచాలని ఇంకా ఈసిఐ ప్రామాణిక ఆపరేటింగ్ ప్రక్రియల ఉల్లంఘనలకు నిరోధించడానికి అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనీ
అన్నారు.ఎన్నికల ప్రక్రియలను సజావుగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులు, క్షేత్రస్థాయిలో కేంద్ర పరిశీలకులు ఎన్నికల యంత్రాంగానికి మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ కుమార్ అన్నారు.
ఈ సీనియర్ అధికారుల నిష్పాక్షికత,స్వచ్చత, , విజిబిలిటీ, యాక్సెసబిలిటీ ,అప్రమత్తత కమిషన్ సూచనలను స్ఫూర్తిదాయకంగా అమలు చేసేలా చూస్తుందని శ్రీ కుమార్ అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక పరిశీలకులను ఉద్దేశించి ప్రసంగించిన మరో ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే, రాజకీయ పార్టీల ప్రతినిధులే కాకుండా, అనుభవజ్ఞులైన అధికారుల నుండి ప్రజలకు  కూడా అధిక అంచనాలు ఉంటాయని అన్నారు. విస్తృత కోవిడ్ మార్గదర్శకాలు, కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు ,రాజకీయ పార్టీలు ,అభ్యర్థుల ప్రచారంపై ఇటీవల ఇచ్చిన ఆదేశాలతో సహా ఎస్ డి ఎం ఎ ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడాలని శ్రీ పాండే వారిని కోరారు.అభ్యర్థుల నేర పూర్వాపరాల ప్రచారంపై సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడంలో స్పెషల్ అబ్జర్వర్లు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.ఈవిఎం రవాణా ప్రోటోకాల్స్, ఇటీవల పెరిగిన వ్యయ పరిమితులు , సజావుగా ,శాంతియుత ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే ఏవైనా ప్రయత్నాలను అడ్డు కోవడం లో కూడా అప్రమత్తంగా ఉండాలనీ అన్నారు. 
 
సెక్రటరీ జనరల్ శ్రీ ఉమేష్ సిన్హా ప్రత్యేక పరిశీలకులకు స్వాగతం పలికారు .కమిషన్ సూచనలను వారికి వివరించారు. గతంలో వారి ప్రశంసనీయమైన పాత్రను ఆయన అంగీకరించారు. వారి సహకారం మళ్ళీ కమిషన్ కు చాలా విలువైనదని అన్నారు. 

గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల లో ఈ క్రింది అధికారులు స్పెషల్ జనరల్, పోలీస్ ,వ్యయ పరిశీలకులుగా నియమితులయ్యారు. 

శ్రీ మంజిత్ సింగ్, ఐఎఎస్ (రిటైర్డ్) (ఆర్ జె: 88) ,శ్రీ  సోమేష్ గోయల్, ఐపిఎస్ (రిటైర్డ్)(హెచ్ పి: 84) గోవా కు స్పెషల్ జనరల్ అబ్జర్వర్ ,స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా ఉంటారు. శ్రీ మంజిత్ సింగ్ ఇంతకు ముందు పుదుచ్చేరి ఎన్నికల పుదుచ్చేరి ఎన్నికలతో స్పెషల్ అబ్జర్వర్ గా సంబంధం కలిగి ఉన్నారు ఇంకా చాలా కాలం జనరల్ అబ్జర్వర్ గా కూడా పనిచేశారు. 

శ్రీ ప్రవీర్ కృష్ణ, ఐఎఎస్ (రిటైర్డ్) (ఎంపి: 87), శ్రీ అరుణ్ కుమార్, ఐపిఎస్ (రిటైర్డ్ .) (యుపి:85) రు రాజేష్ తుతేజ, మాజీ ఐఆర్ఎస్ (ఐటి) (1987) మణిపూర్ కు వరుసగా స్పెషల్ జనరల్, స్పెషల్ పోలీస్, స్పెషల్ వ్యయ అబ్జర్వర్ గా ఉంటారు. శ్రీ ప్రవీర్ కృష్ణ ఇంతకు ముందు మణిపూర్ లో జనరల్ అబ్జర్వర్ గా ఉన్నారు.శ్రీ అరుణ్ కుమార్ ఇంతకు ముందు బిఎస్ఎఫ్, సిఆర్ పిఎఫ్ తో ఉన్నారు. 2015 బీహార్ ఎన్నికల్లో సిఎపిఎఫ్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు. శ్రీ రాజేష్ తుతేజ హెచ్ పి , హర్యానాలో డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్స్ గా పనిచేశారు ఇంతకు ముందు పంజాబ్, ఎంపి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలతో సంబంధం కలిగి ఉన్నారు.

పంజాబ్ కు శ్రీ వినోద్ జుత్షి, ఐఎఎస్ (రిటైర్డ్.) (ఆర్ జె: 82), శ్రీ రజనీ కాంత్ మిశ్రా, ఐపిఎస్ (రిటైర్డ్)(యుపి:84) శ్రీమతి హిమాలిని కశ్యప్, మాజీ ఐఆర్ఎస్ (ఐటి) (1985) స్పెషల్ జనరల్ అబ్జర్వర్, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ స్పెషల్ వ్యయ అబ్జర్వర్ గా ఉంటారు.శ్రీ  వినోద్ జుత్షి ఆరు సంవత్సరాలు ఈసిఐలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారు. ఇంతకు ముందు స్పెషల్ అబ్జర్వర్ గా కూడా ఉన్నారు. ఎస్ హెచ్ రజనీ మిశ్రా తన డిజి బిఎస్ఎఫ్ అనుభవంతో ఈసిఐతో సంబంధం కలిగి ఉన్నారు. శ్రీమతి కశ్యప్ కు 2020 లో పదవీ విరమణ వరకు ఆదాయపు పన్ను పోర్ట్ ఫోలియోలలో విస్తృతమైన అనుభవం ఉంది.

ఎస్.హెచ్. రామ్ మోహన్ మిశ్రా ఐఎఎస్, (రిటైర్డ్)(ఎఎమ్: 87), ఎస్.అనిల్ కుమార్ శర్మ, ఐపిఎస్ (రిటైర్డ్ ) (పిబి:84) శ్రీమతి మధు మహాజన్, మాజీ ఐఆర్ఎస్ (ఐటి) (1982) ఉత్తరాఖండ్ కోసం స్పెషల్ జనరల్ అబ్జర్వర్, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మరియు స్పెషల్ వ్యయ అబ్జర్వర్ గా ఉంటారు.శ్రీమతి మహాజన్ ఇంతకు ముందు బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక ,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో కూడా సంబంధం కలిగి ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ఎస్ హెచ్ అనిల్ కుమార్ శర్మ ఎస్ పిఎల్ అబ్జర్వర్ గా ఉన్నారు. ఇంతకు ముందు ఉత్తరాఖండ్ గురించి ఎస్ హెచ్ ఆర్ ఎం మిశ్రాకు విస్తృతమైన అనుభవం ఉంది.

ఎస్.అజయ్ నాయక్, ఐఎఎస్ (రిటైర్డ్.) (బిహెచ్:84) స్పెషల్ జనరల్ అబ్జర్వర్ గా ఉంటారు; ఎస్.దీపక్ మిశ్రా, ఐపిఎస్ (రిటైర్డ్.) (ఎజిఎంయుటి:84) స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ శ్రీ మురళీ కుమార్, మాజీ ఐఆర్ఎస్ (ఐటి) (1983) బి. ఆర్. బాలకృష్ణన్, మాజీ ఐఆర్ఎస్ (ఐటి) (1983) ఉత్తరప్రదేశ్ కు ఇద్దరు ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా ఉంటారు. ఎస్ హెచ్ బాలకృష్ణన్ ఇంతకు ముందు బీహార్, టిఎన్ ,పుదుచ్చేరి ఏఎల్ఈతో సంబంధం కలిగి ఉన్నారు. , అలాగే 2019 లో 89 హుజూర్ నగర్ ఎసికి జరిగిన ఉప ఎన్నికలకు  పని చేశారు. ఎస్ హెచ్ బి మురళీ కుమార్ ఇంతకు ముందు మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఎస్ పిఎల్ వ్యయ పరిశీలకుడిగా ఉన్నారు, అలాగే 8- వెల్లూరు  పిసికి ఉప ఎన్నికలు కూడా చేశారు. అజయ్ నాయక్ ఇంతకు ముందు బీహార్ సిఇఒగా అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు స్పెషల్ అబ్జర్వర్ గా కూడా ఉన్నారు. దీపక్ మిశ్రా కేరళ ఎన్నికలలో కూడా సంబంధం కలిగి ఉన్నారు.

స్పెషల్ అబ్జర్వర్స్ త్వరలో తమకు కేటాయించిన రాష్ట్రాలను సందర్శించి రాష్ట్ర సిఇఒలు ,సంబంధిత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లతో కలసి తమ పనిని ప్రారంభించనున్నారు.
 

****
 



(Release ID: 1794476) Visitor Counter : 188