సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మానసిక వికలాంగ పిల్లలు కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు : డాక్టర్ జితేంద్ర సింగ్‌

Posted On: 30 JAN 2022 7:57PM by PIB Hyderabad

మానసిక వైకల్యం కలిగి ఉన్నమరణించిన ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌ పిల్లలు కుటుంబ పెన్షన్‌ పొందేందుకు అర్హులని కేంద్ర శాస్ర్త సాంకేతిక, భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, ప్రజా ఫిర్యాదులు, అంతరిక్ష, అణుశక్తి శాఖ సహాయ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మానవతా దృక్పధంతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్తిగా తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఈ రోజు స్పష్టం చేశారు. 

కొన్ని బ్యాంకులు మానసిక వైకల్యం కలిగి ఉన్నమరణించిన ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్‌ పిల్లలు వారు నామినేట్ చేసిన వ్యక్తులకు కుటుంబ పెన్షన్ చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయని పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ దృష్టికి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కొన్ని బ్యాంకులు పెన్షనర్ లేదా అతని/ ఆమె నామినేట్ చేసిన వారికి పెన్షన్ ఇవ్వకుండా చట్ట ప్రకారం జారీ చేసిన  గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ అందించాలని పట్టుబడుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవన సౌలభ్యం కోసం సుపరిపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం కుటుంబ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా  మానసిక వైకల్యంతో బాధపడుతున్న లేదా తల్లిదండ్రులను కోల్పోయిన మానసిక వికలాంగ పిల్లలకు  కోర్టు జారీ చేసే  గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తో సంబంధం లేకుండా కుటుంబ పెన్షన్ పొందేందుకు వీలు కల్పించామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఈ నేపథ్యంలో పెన్షన్ పొందేందుకు  కోర్టు జారీ చేసిన   గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ కోసం బ్యాంకులు పట్టుబట్టడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది సెంట్రల్ సివిల్ సర్వీస్ (పెన్షన్) నిబంధనలు, 2021 కు విరుద్ధమని అన్నారు. 

సెంట్రల్ సివిల్ సర్వీస్ (పెన్షన్) నిబంధనలు, 2021 కు అనుగుణంగా కుటుంబ పెన్షన్ చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని పెన్షన్లు పంపిణీ చేస్తున్న అన్ని బ్యాంకుల సీఎండీ లకు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ కోసం పట్టుపట్టకుండా మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగి/పెన్షనర్/కుటుంబ పెన్షనర్ నామినేట్ చేసే వ్యక్తుల ద్వారా పెన్షన్ చెల్లించాలని ఆదేశిస్తూ సిపిపిసి/ పెన్షన్ చెల్లిస్తున్న శాఖలను ఆదేశించాలని సీఎండీ లకు రాసిన లేఖలో మంత్రి శాఖ సూచించింది. 

పెన్షన్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఇటీవల కాలంలో పెన్షన్ల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. విడాకులు పొందిన ఆడపిల్లలకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, ఎక్కువ వయసు కలిగిన పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు మొబైల్ యాప్ ద్వారా ఫేస్ రెకగ్నిషన్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడంఎలక్ట్రానిక్ పెన్షన్ పే ఆర్డర్పెన్షన్ పంపిణీలో తపాలా శాఖ సహకారం తీసుకోవడం లాంటి చర్యలను పెన్షన్ల శాఖ తీసుకుంది. 

***



(Release ID: 1793759) Visitor Counter : 840


Read this release in: English , Urdu , Marathi , Hindi