ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన ఆర్థిక సలహాదారుగా డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ నియామకం

प्रविष्टि तिथि: 28 JAN 2022 6:16PM by PIB Hyderabad
ప్రధాన ఆర్థిక సలహాదారుగా డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు.

image.png

 
ఈ నియామకానికి ముందు, డాక్టర్ నాగేశ్వరన్ రచయిత, బోధకుడు మరియు సలహాదారుగా పనిచేశారు.వీరు భారతదేశంలో , సింగపూర్‌లోని అనేక వ్యాపార విద్యాసంస్థలలో , మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో బోధించారు   వీరి రచనలు విస్తృత ప్రచురణ పొందాయి..
 
డాక్టర్ నాగేశ్వరన్ IFMR గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు డీన్‌గా, క్రియా యూనివర్సిటీలో విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ గా నియామకం పొందారు.  2019 నుంచి 2021 వరకు భారత ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైమ్ మెంబర్‌గా కూడా ఉన్నారు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా, అమ్హెర్స్ట్‌లోని మసాచుసెట్స్ యూనివర్సిటీ  నుంచి డాక్టరల్ డిగ్రీని కలిగి ఉన్నారు.
 
****

(रिलीज़ आईडी: 1793472) आगंतुक पटल : 303
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Tamil