ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

SPMCIL నిర్వహణలో కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్, బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌లో ఒక్కొక్క కొత్త బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్‌ల ఏర్పాటు.

నాడు పోస్టు చేయడమైనది: 28 JAN 2022 5:47PM by PIB Hyderabad

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) తన ఆధునీకరణ కార్యక్రమాల కింద కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్ బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌లో ఒక్కొక్కటి కొత్త బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్‌లను ఏర్పాటు చేసింది.

27 జనవరి, 2022న, CNP నాసిక్‌లో కొత్త బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్ ప్రారంభోత్సవం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి & ఆర్థిక సలహాదారుఐన శ్రీమతి. మీరా స్వరూప్, బ్యాంక్ నోట్ ప్రెస్‌లో కొత్త బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్ కోసం, దేవాస్ ప్రారంభోత్సవం శ్రీ  శశాంక్ సక్సేనా, సీనియర్ ఆర్థిక సలహాదారు, ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, పార్లమెంటు సభ్యుడు   సమక్షంలో చేశారు. వర్చువల్ మోడ్ ద్వారా ఈ కార్యక్రమంలో నాసిక్ నియోజకవర్గం నుండి హేమంత్ తుకారాం గాడ్సే; శ్రీమతి తృప్తి పాత్ర ఘోష్, ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, SPMCIL; శ్రీ ఎస్.కె. సిన్హా, డైరెక్టర్ (HR), SPMCIL; శ్రీ. వినయ్ కుమార్ సింగ్, CVO, SPMCIL; శ్రీ. రాజేష్ బన్సాల్, చీఫ్ జనరల్ మేనేజర్, BNP దేవాస్ మరియు శ్రీ. బోలెవర్ బాబు, చీఫ్ జనరల్ మేనేజర్, CNP నాసిక్ పాల్గొన్నారు .

 

***


(రిలీజ్ ఐడి: 1793471) సందర్శకుల సూచీ సంఖ్య : : 186
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil