శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కర్ణాటకకు చెందిన గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ 2022 సంవత్సరానికి పద్మశ్రీకి ఎంపికయ్యారు

Posted On: 27 JAN 2022 4:00PM by PIB Hyderabad

కర్నాటకలోని ధార్వాడ్‌కు చెందిన శ్రీ అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్ అనే సీరియల్ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్  (గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్) విభాగంలో 2022 సంవత్సరానికి ప్రకటించిన 107 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో ఒకరు.

 

శ్రీ అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్ ఓ సీరియల్ ఇన్నోవేటర్. అతని ప్రముఖ ఆవిష్కరణలలో చింతపండు గింజలను వేరుచేసే పరికరం, దున్నే బ్లేడ్ తయారీ యంత్రం, విత్తనాలు మరియు ఎరువుల డ్రిల్, వాటర్ హీటింగ్ బాయిలర్, ఆటోమేటిక్‌గా చెరకు నాటే డ్రిల్లర్ మరియు వీల్ టిల్లర్ ఉన్నాయి. అతని ఆవిష్కరణలన్నీ సుస్థిరత, వ్యయ-సమర్థత, పర్యావరణ అనుకూలత మరియు ముఖ్యంగా సామాజిక ఆమోదం సూత్రాలను ప్రదర్శిస్తాయి. వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు మరియు నేల లక్షణాలపై అతనికి ఉన్న లోతైన జ్ఞానం దేశంలోని ఇతర రైతులకు అతనిని స్ఫూర్తిగా మార్చింది.

ఇతని మొదటి ఆవిష్కరణ "A Wa(h!)ter అలారం," ఇది ఉదయం వరకు నిద్రపోయే తన స్వంత స్వభావాన్ని పరిష్కరించడానికి అతను చేసిన ప్రయత్నం. అతను అలారం కీ చివరన ఒక సన్నని తాడును కట్టారు. ఆ విధంగా కీ విప్పినప్పుడు, కీకి కట్టిన తీగకు తగులుతుంది. స్ట్రింగ్ క్రమంగా నీటితో నిండిన బాటిల్‌కు కట్టివేయబడుతుంది. కీ పూర్తిగా విప్పబడినప్పుడు బాటిల్ వంగిపోతుంది దాంతో అందులోని నీరు అతని ముఖం మీద పడుతుంది. అదేవిధంగా ఆయన ఆధునిక వ్యవసాయంతో ఔచిత్యాన్ని కొనసాగిస్తూనే స్థానిక ప్రజలకు వివిధ అవసరాలను తీర్చే వ్యవసాయ-సాంకేతికతలను మరియు పనిముట్లను అభివృద్ధి చేశారు.

 

నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఇండియా మద్దతుతో భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సంస్థ శ్రీ అబ్దుల్ ఖాదర్ నడకత్తిన్‌కు ఎన్‌ఐఎఫ్ 8వ జాతీయ గ్రాస్‌రూట్ ఇన్నోవేషన్ మరియు అత్యుత్తమ సాంప్రదాయం సందర్భంగా 2015లో జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. అప్పటి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీచే నాలెడ్జ్ అవార్డులు పొందారు. ఆ సందర్భంగా ఆయన అవార్డుకు గౌరవ సూచకంగా చెప్పులు లేకుండా నడవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆయన "బేర్‌ఫుట్ సైంటిస్ట్"గా పేరు పొందారు.

 

చింతపండుకు సంబంధించిన అతని ఆవిష్కరణల కారణంగా, ప్రజలు అతన్ని "హునాసే హుచ్చా" అని పిలవడం ప్రారంభించారు. అంటే చింతపండు ఉన్మాది. నీటి కొరత కారణంగా  చింతపండును ఆల్కలీన్ నీటితో పండించడంలో అతను విజయం సాధించారు. అలాగే చెట్టు నుండి చింతపండును పండించే సాంకేతికత మరియు చింతపండు గింజలను వేరు చేయడానికి అత్యంత ఆమోదించబడిన యంత్రం వంటి ప్రయోగాలతో మరింత ఖ్యాతి చెందారు. చింతపిక్కలను వేరు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇది అతనికి ప్రేరణనిచ్చింది. చింతపండుతో విజయాన్ని సాధించిన అనంతరం ఆయన లోతుగా దున్నడం, విత్తనాలు విత్తడం మరియు ఇంధన సమర్థవంతమైన నీటిని వేడి చేసే బాయిలర్ వంటి వ్యవసాయ కార్యకలాపాలకు ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చారు.

 

సాహిత్యం మరియు విద్య, కళలు, సైన్స్,  ఇంజినీరింగ్, వాణిజ్యం, పౌర సేవలు, ప్రజా వ్యవహారాలు, క్రీడలు మరియు వైద్యం వంటి  వివిధ విభాగాలలో అందించబడే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులు గత కొన్ని సంవత్సరాలుగా అట్టడుగు స్థాయిలోఉన్న ఆవిష్కర్తలకు గుర్తింపును ఇస్తున్నాయి. తద్వారా ప్రస్తుత తరాన్ని మరింతగా ఆవిష్కరింపజేయడానికి స్ఫూర్తినిస్తుంది!

 

image.png


 ఎన్‌ఐఎఫ్‌ 8వ జాతీయ గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ మరియు అత్యుత్తమ సాంప్రదాయ నాలెడ్జ్ అవార్డుల సందర్భంగా శ్రీ అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్‌ అప్పటి గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.


 

*****



(Release ID: 1793092) Visitor Counter : 145


Read this release in: Kannada , English , Urdu , Hindi