వ్యవసాయ మంత్రిత్వ శాఖ

తేనెటీగ‌ల పెంప‌కం రంగంపై జ‌రిగిన‌ జాతీయ స‌ద‌స్సు .


జాతీయ తేనెటీగ‌ల పెంప‌కం, హ‌నీ మిష‌న్ (ఎన్ బి హెచ్ ఎం) దేశంలోని అన్ని ప్రాంతాల‌లో తేనె ప‌రీక్షా కేంద్రాల నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.

ఎన్ ఎ ఎఫ్ ఇ డి తేనెటీగ‌ల పెంప‌కం, తేనె ప్రాసెసింగ్‌కు సంబంధించి 65 ఎఫ్ పి ఓ ల‌ను ఏర్పాటు చేస్తోంది,.

Posted On: 25 JAN 2022 4:15PM by PIB Hyderabad

జాతీయ తేనెటీగ‌ల బోర్డు (ఎన్ బిబి) తేనెటీగ‌ల పెంప‌కంపై ఒక జాతీయ స‌ద‌స్సును నిర్వ‌హించింది. దీనిని జాతీయ వ్య‌వ‌సాయ స‌హ‌కార మార్కెటింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( నాఫెడ్‌), గిరిజ‌న స‌హ‌కార మార్కెటింగ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ట్రైఫెడ్ ), నేష‌న‌ల్ డైరీ డ‌వ‌ల‌ప్‌మెంట్ బోర్డ్ ( ఎన్ డిడిబి) ల స‌హ‌కారంతో 24.01.2022 న ఈ జాతీయ స‌ద‌స్సును నిర్వ‌హించింది. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగం , రాష్ట్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాలు, కేంద్ర వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌  నుంచి , ఈ రంగానికి చెందిన ఇత‌ర భాగ‌స్వాములు సుమారు 600 మందికి పైగా ఈ స‌ద‌స్సులో పాల్గొన్నారు..
  ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగావ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన‌  డాక్ట‌ర్ అభిలాష్ లిఖి,  కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన జాతీయ స్థాయిలో తేనెటీగ‌ల పెంప‌కం , తేనె మిష‌న్ (ఎన్‌బిహెచ్ ఎం) గురించి మాట్లాడారు. ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో తేనెటీగ‌ల పెంప‌కం అభివృద్ధికి ప్రారంభించింది. ఎన్ బిహెచ్ ఎం , దేశంలో స్వీట్ రెవ‌ల్యూష‌న్ ను సాధించేందుకు పెద్ద ముంద‌డుగు కానుంది.

తేనె ఉత్ప‌త్తికి సంబంధించి మౌలిక స‌దుపాయాల విష‌యంలో ఏవైనా స‌రిచేయ‌వ‌లసిన అంశాలు ఉంటే ఎన్ బి హెచ్ ఎం వాటిని పూర్తి చేసేందుకు స‌హ‌క‌రిస్తుంద‌ని శ్రీ లిఖి తెలిపారు. అలాగే తేనె క‌ల్తీ స‌మ‌స్య‌ను ఎదుర్కొనేందుకు స‌న్న‌కారు తేనె ఉత్ప‌త్తిదారుల‌ను నిర్ధిష్ట‌విధానంలో అనుసంధానం చేసేందుకుకూడా ఇది తోడ్ప‌డుతుంది. తేనె, తేనెకు సంబంధించిన ఇత‌ర ఉత్ప‌త్తులైన బీ పోలెన్‌, బీ వాక్స్‌, బీ వీన‌మ్‌, ప్రొపొలిస్ వంటి వాటికి సంబంధించిన స‌మాచారానికి ఎన్ బి హెచ్ ఎం , మ‌ధుక్రాంతి పేరుతో ఒక పోర్ట‌ల్ ను ఏర్పాటు చేసింది. అలాగే దేశ‌వ్యాప్తంగా తేనె ప‌రీక్షా కేంద్రాల‌ను అనుసంధానం చేయాల‌న్న‌ది ఎన్ బి హెచ్ ఎం ల‌క్ష్యం. ఇందుకోసం తేనెటీగ‌ల పెంప‌కం దారుల  100 ఎఫ్‌పి ఓలు ఒక సెంట‌ర్ గా ఉండేట్టు చూస్తారు. తేనె రంగంలో మెరుగైన సుస్థిర‌త కోసం  తెనె త‌యారీ సొసైటీ, స‌హ‌కార, సంస్థ‌ల‌ను చేర్చ‌డం గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు.

హార్టిక‌ల్చ‌ర్ అద‌న‌పు క‌మిష‌న‌ర్ , ఎక్సిక్యుటివ్ డైర‌క్ట‌ర్ ఎన్ బిబి  డాక్ట‌ర్ ఎన్‌.కె. పాట్లే దేశ‌వ్యాప్తంగా ఎన్ బిహెచ్ ఎం ప‌థ‌కాన్ని స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డం గురించి మాట్లాడారు. అలాగే తేనెటీగ‌ల పెంప‌కం దారుల‌కు, ఈ రంగంతో ముడిప‌డిన వారికి  వాస్త‌వ ప్ర‌యోజ‌నాలు అందేలా చూడాల‌ని అన్నారు. డిటిఒ తేనెటీగ‌ల పెంప‌కం దారుల ఆదాయాన్ని పెంపొందిస్తుంద‌ని, తేనె ఉత్పత్తితోపాటు తేనె కు సంబంధించిన ఇత‌ర ఉత్ప‌త్తులైన రాయ‌ల్ జెల్లి, బీ పోలెన్‌, బీ వాక్స్‌, బీ వీన‌మ్ , ప్రొపొలిస్ వంటి వాటిని కూడా ఉత్ప‌త్తి చేయాల‌న్నారు.

ఎఐసిఆర్‌పి  ఆన్ హ నీ బీ, పొలినేట‌ర్ ,ఐసిఎఆర్ ,న్యూఢిల్లీ కో ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ బాల్ రాజ్ సింగ్ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం దేశంలో 25 ఎఐసిఆర్‌పి కేంద్రాలు ఉన్నాయ‌ని, ఇవి తేనెటీగ‌ల పెంపకం, పాలినేష‌న్ ప‌రిశోధ‌న‌లో నిమ‌గ్న‌మై ఉన్నాయ‌ని అన్నారు. ఐసిఎఆర్ పాలినేట‌ర్ గార్డెన్ ల‌ను దేశ‌వ్యాప్తంగా ఎఐసిఆర్‌పి కేంద్రాల ద్వారా రూపొందించ‌నుంది..ఇలాంటి తొలి పాలినేట‌ర్ గార్డెన్ ని ఉత్త‌రాఖండ్ లోని పంత్‌న‌గ‌ర్ లోగ‌ల గోవింద్ వ‌ల్ల‌భ్ పంత్ యూనివ‌ర్సిటీ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ టెక్నాల‌జీలో ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
హార్టిక‌ల్చ‌ర్  డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ అర్జున్ సింగ్ జైనీ హ‌ర్యానాలో మ‌ధుక్రాంతి పోర్ట‌ల్ అమ‌లు  , స్థాయి, వ్యూహం గురించి మాట్లాడారు. హ‌ర్యానాలో మ‌ధుక్రాంతి పోర్ట‌ల్ లో 816 మంది తేనెటీగ‌ల పెంప‌కం దారులు, 1,29,652 తేనెటీగ‌ల కాల‌నీలు రిజిస్ట‌ర్ చేయించుకున్న‌ట్టు తెలిపారు.

నాఫెడ్ అద‌న‌పు మేనేజింగ్ డైర‌క్ట‌ర్ పంక‌జ్ ప్రసాద్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ ఉన్ని కృష్ణ‌న్ లు నాఫెడ్ 65 క్ల‌స్ట‌ర్లు, ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ ఆర్గ‌నైజేష‌న్స్ (ఎఫ్‌పిఒ) ల‌ను తేనె టీగ‌ల పెంప‌కం దారులు , తేనె ఉత్ప‌త్తిదారుల కోసం ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ 65 ఎఫ్ పిఒలు దేశ వాయ‌వ్య ప్రాంతం నుంచి ఈశాన్య ప్రాంతం వ‌ర‌కు అనుసంధానం చేసే హ‌నీ కారిడార్ లో భాగంగా ఉంటాయి. జాతీయ తేనెటీగల పెంపకం ,తేనె మిషన్ కింద అవసరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పించేందుకు తేనె ఉత్పత్తికి సంబంధించిన ఈ 65 ఎఫ్‌.పి.ఒ లను తీసుకురావాలని నాఫెడ్‌ లక్ష్యంగా పెట్టుకుంది..
ఆర్గానిక్  అండ్ స్పెషాలిటీ (ISAP) హెడ్ శ్రీ ఆశిష్ తివారీ, మాట్లాడుతూ నాఫెడ్ ద్వారా  ఇప్పటికే 5  ఎఫ్.పి.ఒలు ఏర్పాటయ్యాయని/రిజిస్టర్ అయ్యాయ‌ని తెలిపారు.

 ఎన్ డిడిబి కి చెందిన శ్రీ అభిజిత్ భట్టాచార్య ప్ర‌సంగిస్తూ,   డెయిరీ కోఆపరేటివ్‌ల త‌ర‌హాలో  పాల యూనియ‌న్‌లు, పాల స‌హ‌కార సంఘాల వ‌ద్ద  అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల త‌ర‌హాలో ప్రయోజనాలను పొందడానికి  తేనె ఉత్ప‌త్తి రంగంలో హనీ FPOలను సృష్టించే విధానాన్ని ఎన్ డిడిబి కలిగి ఉందని పేర్కొన్నారు.

ట్రైఫెడ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీమ‌తి సీమా భ‌ట్న‌గ‌ర్ మాట్లాడుతూ, ట్రైఫెడ్ దేశంలోని గిరిజ‌న ప్రాంతాల‌లో తేనెటీగ‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హించే కార్య‌క్ర‌మంలో నిమ‌గ్న‌మై ఉంద‌ని అన్నారు. అలాగే అట‌వీ ప్రాంతం నుంచి తేనెను సేక‌రించి దానిని 2020-21 సంవ‌త్స‌రంలో వివిధ దేశాల‌కు రూ 115 ల‌క్ష‌ల మేర‌కు ఎగుమ‌తి చేసిన‌ట్టు తెలిపారు.

ఈ స‌ద‌స్సులో పాల్గొన్న‌వారికి, తేనెటీగల పెంపకందారులకు మధుక్రాంతి పోర్టల్‌లో నమోదుకు సంబంధించిన సంక్షిప్త ప్రక్రియను ఇండియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శ్రీ జై ప్రకాష్ తెలియ‌జేశారు. మధుక్రాంతి పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల  తేనెటీగల కాలనీల వలసల సమయంలో బీమాను పొందేందుకు తేనెటీగల పెంపకందారులకు ఇది సహాయపడుతుంది. ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగా , స‌ద‌స్సులో పాల్గొన్న వారు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు.

***

 



(Release ID: 1793013) Visitor Counter : 171