అంతరిక్ష విభాగం
కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలిసి గగన్‌యాన్ పురోగతిని, ఇతర భవిష్య అంతరిక్ష మిషన్లను గురించి చర్చించిన ఇస్రో నూతన చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్
Posted On:
25 JAN 2022 4:27PM by PIB Hyderabad
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎస్. సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ & టెక్నాలజీ (ఇండిపెండెంట్ చార్జ్) సహాయ మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జ్), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలిసి గగన్‌యాన్ పరిస్థితితో పాటుగా సమీప భవిష్యత్తులో చేపట్టనున్న ఇతర అంతరిక్ష మిషన్ల గురించి చర్చించారు.
నూతన ఇస్రో అధిపతికి శుభాకాంక్షలు తెలుపుతూ, డాక్టర్ సోమ్‌నాథ్ ప్రతిష్ఠాత్మకమైన అసైన్‌మెంట్‌ను అత్యంత చారిత్రిక సమయంలో స్వీకరిస్తున్నారని, భారతదేశం తొలి మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ సహా పలు చారిత్రిక మిషన్లకు నాయకత్వం వహించేలా విధి అతడిని శీర్వదించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో అంతరిక్ష కార్యక్రమాలకు ప్రత్యేక ప్రోత్సాహం లభించిందని, రోడ్లు, రహదారులు, రైల్వేలు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం సహా వివిధ రంగాల్లో అంతరిక్ష సాంకేతికతను ఇప్పుడు వర్తింపచేశామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో అంతరిక్ష రంగం ద్వారా భారతదేశం అగ్రస్థానానికి ఎదుగుతుందని ఆయన అన్నారు.
గగన్‌యాన్ కార్యక్రమ స్థితి గురించిన వివరాలను మంత్రి ఇస్రోచైర్మన్ వెల్లడిస్తూ, కోవిడ్, ఇతర పరిమితుల కారణంగా టైమ్‌లైన్‌లో ఆలశ్యం జరిగిందని, కాగా ఇప్పుడు అంశాలు అన్నీ పట్టాలు ఎక్కాయని, తొలి మానవరహిత మిషన్‌కు అవసరమైన వ్యవస్థలన్నీ వాస్తవరూపం దాలుస్తున్నాయని వివిరించారు. తొలి మానవరహిత మిషన్ తర్వాత, ప్రయోగించనున్న రెండవ మానవరహిత మిషన్ వ్యోమమిత్ర రోబోట్‌ను తీసుకువెడుతుందని, దాని అనంతరం మానవ మిషన్‌ను ప్రయోగిస్తామని వివరించారు.
భారత వ్యోమగాములు రష్యాలో సాధారణ స్పేస్ ఫ్లైట్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని మంత్రి వెల్లడించారు. గగనయాన్ నిర్ధిష్ట శిక్షణ కోసం బెంగళూరులో ప్రత్యేక తాత్కాలిక వ్యోమగామి శిక్షణా కేంద్రాన్ని కూడా స్థాపించారు.
మానవ మిషన్‌కు సన్నాహాలు, క్రూ ఎస్కేప్ సిస్టం ఫంక్షనింగ్ తక్కువ వాతావరణంలో (10కిమీ కన్నా తక్కువ) పనితీరును విమానంలో ప్రదర్శించాలని ఇస్రో అధిపతి తెలిపారు. సముద్రంలో ప్రభావం చూపిన తర్వాత సిబ్బంది మాడ్యూల్ ప్రయోగ పునరుద్ధరణపైన పని చేస్తున్నారని తెలిపారు.
ఎన్ఎస్ఐఎల్ (న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్) నిధులతో రూపొందించిన, ఉపగ్రహం జిశాట్ -21 ను 2022లో ప్రయోగించిన ఘనత ఇస్రో దక్కించుకుంది. దీనికి ఎన్ఎస్ఐఎల్ భారం వహించి, నిర్వహిస్తుంది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ డిటిహెచ్ (డైరెక్ట్ టు హోం_ అప్తికేషన్ అవసరాలను తీరుస్తుంది.
రానున్న మూడు నెలల్లో చేపట్టనున్న మిషన్లను గురించి సంక్షిప్తంగా ఇస్రో చైర్మన్ ప్రెజెంట్ చేశారు. ఆయన ఫిబ్రవరి 2022లో ప్రయోగించనున్న రీకాట్-1ఎ , పిఎస్ఎల్‌వి సి 5-2, మార్చి 2-22లో ప్రయోగించనున్న ఓషన్‌శాట్ -3, ఐఎన్ఎస్ 2-బి ఆనంద్ పిఎస్ఎల్‌వి సి-53, ఏప్రిల్‌లో ప్రయోగించనున్న ఎస్ఎస్ఎల్‌వి -డి2, మైక్రోశాట్‌లను ప్రస్తావించారు.
***
(Release ID: 1792578)
Visitor Counter : 302