భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ముఠాగా ఏర్పడినందుకు సముద్రరవాణా కంపెనీలకు జరిమానా విధించిన సిసిఐ
Posted On:
24 JAN 2022 7:03PM by PIB Hyderabad
ఆటోమొబైల్ మూల పరికరాల ఉత్పత్తిదారులు (ఒఇఎం)లకు వివిధ మార్గాలలో సముద్ర మోటార్ వాహనాల రవాణా సేవలను అందించేందుకు కైషా (ఎన్ వైకె లరైన్) కవాసాకి కిసెన్ కైషా లిమిటెడ్ (కె. లైన్) మిట్సుయ్ ఒ.ఎస్. కె లైన్స లిమిటెడ్ (ఎంఒఎల్) నిస్సాన్ మోటార్ కార్ కారియర్ కంపెనీ (ఎన్ఎంసిసి) ముఠాగా ఏర్పడ్డాయి. ఈ నాలుగు కంపెనీలలో ఎన్‌వైకె లైన్, ఎంఒఎల్, ఎన్ఎంసిసి కంపెనీలు సిసిఐ ఎదుట తక్కువ జరిమానా కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
అందుబాటులో ఉన్న సాక్ష్యాధారల మూల్యాకనం ప్రకారం, ఎన్‌వైకె లైన్, కె- లైన్, ఎంఒఎల్, ఎన్ఎంసిసిలు రెస్పెక్టర్ రూల్ అమలు లక్ష్యంతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడైంది. దీని ప్రకారం, ఒకరితో ఒకరు పోటీని నివారించడమే కాక, క్యారియర్ వ్యాపారాన్ని రక్షించడం ప్రధాన లక్ష్యాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు, సరుకు రవాణా ధరలు సహా వాణిజ్యపరంగా సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు కంపెనీలు బహుళ, ద్వైపాక్షిక చర్చలు / సమావేశాలు, ఇమెయిళ్ళు ఇచ్చిపుచ్చుకున్నట్టు అందుబాటులో ఉన్న ఆధారాల మూల్యాంకనం వెల్లడిస్తోంది. కొన్ని ఒఇఎంలు ధరలు తగ్గించమని కోరినప్పటికీ దానిని నిర్లక్ష్యం చేయడం ద్వారా మార్కెట్ లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు లేదా ధరలు పెంచడం లేదా నిర్వహణ లక్ష్యంతో వ్యవహరించారు.
సాక్ష్యాధారాల సంచిత మూల్యాంకనానికి అనుగుణంగా, నాలుగు వ్యతిరేక పక్షాలు - ఎన్‌వైకె లైన్, ఎంఒఎల్, ఎన్ఎంసిసి లు 2009 నుంచి 2012 వరకు ముఠాగా ఏర్పడడం సహా పోటీ వ్యతిరేక ఒప్పందాలను నిషేధించే కాంపిటీ చట్టం 2002లోని సెక్షన్ 3 నిబంధనలను ఉల్లింఘించినట్టు నేరారోపణ జరిగింది. అంతేకాకుండా, ఎన్‌వైకె నుంచి 14మంది వ్యక్తులు, కె-లైన్ నుంచి పదిమంది, ఎంఒఎల్ నుంచి 6గురు వ్యక్తులు, ఎన్ఎంసిసికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ తమ కంపెనీల కోసం పోటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు చట్టంలోని సెక్షన్ 48 ప్రకారం బాధ్యతను ఉల్లంఘించారు.
మూడుకంపెనీలు తక్కువ జరిమానా కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎన్ వైకె లైన్, దానికి సంబంధించిన వ్యక్తులకు 100% జరిమానాను తగ్గించగా, ఎంఒఎల్ తత్సంబంధిత వ్యక్తులక 50%, ఎన్ఎంసిసి తత్సంబధిత వ్యక్తులకు 30% జరిమానాను కమిషన్ తగ్గించింది. ఇందుకు అనుగుణంగా, కెలైన్, ఎంఒఎల్, ఎన్ఎంసిలను వరుసగా భారతీయ కరెన్సీలో రూ. 24.23 కోట్లను, 10.12 కోట్లను, 28.69 కోట్లను చెల్లించవలసిందిగా కమిషన్ ఆదేశించింది. దీనితో పాటుగా, సీజ్ అండ్ డెసిస్ట్ ఉత్తర్వులను జారీ చేసింది.
***
(Release ID: 1792299)
Visitor Counter : 222