సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎన్ఎస్ఐసీ విజ‌య‌గాథ‌- ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ తన కలలను సాకారం చేసుకోవ‌డంలో స‌హ‌క‌రించిన సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ స్కీమ్ (ఎస్‌పీఆర్ఎస్‌)

Posted On: 24 JAN 2022 4:55PM by PIB Hyderabad

 

               

శ్రీ దేవాశిష్ ప్రమోద్ కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందినవారు. ఎన్ఎస్ఐసీ యొక్క ఎంఎస్ఎంఈ యొక్క సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌పీఆర్ఎస్‌) ద్వారా అతను తాను ఫిల్మ్ మేకర్ కావాలనే త‌న కలను సాధించడానికి మరింత దగ్గరయ్యాడు.
అతను #Noidaexpo లో పాల్గొన్నాడు, అక్కడ అతను ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ అందిస్తున్నయొక్క పథకాల వివ‌రాల‌ను గురించి తెలుసుకున్నాడు. ఎంఎస్ఎంఈ కింద ట్రస్ట్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంస్థను నమోదు చేసుకున్నాడు. దీంతో
దేవాశిష్ వ్యవస్థాపక ప్రయాణంలో మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించింది. “#NSIC యొక్క సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్ పథకం గురించి నేను తెలుసుకోవ‌డం జ‌రిగింది.  నేడు రోజు ఈ పథకం కారణంగా నా సంస్థ టెండర్లు దాఖలు చేయగుతోంది. నేను టి-సిరీస్, జీ మ్యూజిక్‌తో కలిసి పని చేయగలుగుతున్నాను." వ్యవస్థాపకత యొక్క పరిధి విస్తృతమైనది, అది తయారీ, సేవ లేదా రిటైల్ రంగ‌మైనా అవ‌కాశం ఉంటుంది. ఎవరైనా కలలు కంటూ అంకితభావంతో కృషి చేస్తే అది సాకారం అవుతుంది.
                                       

*****


(Release ID: 1792289) Visitor Counter : 125


Read this release in: English , Urdu , Hindi , Tamil