యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఒక భాగాన్ని తెలుసుకునేందుకు ప్ర‌తి భార‌తీయుడు జాతీయ యుద్ధ స్మారాకాన్ని సంద‌ర్శించాలిః అన్షు మాలిక్‌

నాడు పోస్టు చేయడమైనది: 24 JAN 2022 1:33PM by PIB Hyderabad

 ప్ర‌పంచ చాంపియ‌న్ షిప్‌లో ర‌జ‌తాన్ని సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ‌గా త‌న పేరును చ‌రిత్ర పుస్త‌కాల‌లో న‌మోదు చేసుకున్న రెజ్ల‌ర్ అంశు మాలిక్, న్యూఢిల్లీలోని నేష‌నల్ వార్ మెమోరియ‌ల్‌ను సంద‌ర్శించారు. 

 


వృత్తాక‌రంలో రూపొందించిన జాతీయ స్మారక‌ చిహ్నంలో 20 ఏళ్ళ  భార‌తీయ రెజ్ల‌ర్ ప‌ర్య‌టించారు. రాతి స్తంభానికి దారి తీసే వృత్తాక‌ర ప్ర‌దేశానికి దారి తీసే ర్యాంప్‌లు క‌లిగిన ఈ ప్ర‌దేశానికి ఆమె వెళ్ళారు. ఈ రాతి స్తంభం దిగువ‌న భార‌త స్వాతంత్ర సాయుధ పోరాటంలో త‌మ ప్రాణాల‌ను అర్పించిన సైనికులంద‌రి స్మార‌కార్ధం శాశ్వత జ్వాల అమ‌ర్‌చ‌క్ర జ్వ‌లిస్తూ ఉంటుంది.  
అత్యంత జాతీయ ప్రాముఖ్య‌త క‌లిగిన ఈ స్మార‌క చిహ్నాన్ని సంద‌ర్శించడం ద్వారా మ‌న దేశ ఘ‌న‌మైన యుద్ధ చ‌రిత్ర గురించి ఎంతో జ్ఞానాన్ని అందిస్తుంద‌ని తెలుసుకున్నాను. త్యాగ చ‌క్ర ఇటుక‌ల‌పై ప్రాణాల‌ర్పించిన 26,500 మంది సైనికుల పేర్ల చెక్క‌డం అన్న‌ది జాతి ర‌క్ష‌ణ గోడ‌లో ప్ర‌తి సైనికుడు బ‌ల‌మైన ఇటుక‌గా ప‌ని చేశాడ‌నే భావ‌న‌కు లోన‌య్యాన‌ని అన్షు అన్నారు. 

 


.అమ‌ర్ చ‌క్ర‌లోని శాశ్వ‌త జ్వాల‌లా, అమ‌ర‌వీరులు వారి సాహ‌స కృత్యం ప్ర‌తి భార‌తీయుడి గుండెలో శాశ్వ‌తంగా ముద్ర‌వేసుకుంటుంద‌ని, ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. 
ఇదిలా ఉండ‌గా, డోగ్రా రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్ ప‌వ‌న్ కుమార్‌కు అన్షు నివాళులు అర్పించారు. అత‌డు కూడా ఆమె స్వంత ఊరు అయిన హ‌ర్యానాకు చెందినవాడు, జాతీయ యుద్ధ స్మార‌కాన్ని సంద‌ర్శించ‌డం గొప్ప అనుభ‌వం. భార‌తీయ చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన ఘ‌ట‌న‌ల‌కు సాక్షి అయిన స్మార‌క చిహ్నాన్ని ప్ర‌తి భార‌తీయుడు సంద‌ర్శించాలి.  


ఎవ‌రైనా సాధార‌ణ పౌరుడు లేదా ప్ర‌ముఖ వ్య‌క్తి దేశ యుద్ధ చ‌రిత్ర ప‌ట్ల ఆస‌క్తి చూపి, ఈ ప్ర‌దేశాన్ని సంద‌ర్శిస్తే, సాయుధ ద‌ళాల‌కు చెందినందుకు ప్ర‌తి సైనికుడు గౌర‌వ‌భావానికి లోను కావ‌డ‌మే కాక ప్రోత్స‌హాన్ని పొందుతాడు అని స్మార‌క స్థ‌లంలో కొన్ని ప్ర‌దేశాల గురించి అర్థం చేసుకునేందుకు అథ్లీట్‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేసిన ఆర్మీ అధికారి ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. 

***


(రిలీజ్ ఐడి: 1792261) సందర్శకుల సూచీ సంఖ్య : : 175
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada