వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీరదోస, గెర్కిన్‌ల ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో భారతదేశం


2021 ఏప్రిల్-అక్టోబర్ వరకు 114 అమెరికా డాల్లర్ల విలువ చేసే గెర్కిన్‌లను ఎగుమతి చేసిన భారత్ . 2020-21 లో 200 మిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే గెర్కిన్‌ల ఎగుమతి

Posted On: 23 JAN 2022 9:45AM by PIB Hyderabad

ప్రపంచంలో గెర్కిన్‌లను అత్యధికంగా ఎగుమతి చేసిన దేశంగా భారత్‌ అవతరించింది. భారతదేశం ఏప్రిల్-అక్టోబర్ (2020-21) కాలంలో  114  మిలియన్ల అమెరికా విలువ చేసే  1,23,846 మెట్రిక్ టన్నుల  కీరదోస, గెర్కిన్‌లను భారతదేశం ఎగుమతి చేసింది. కీరదోస తో చేసే ఆవకాయని ప్రపంచ దేశాల్లో గెర్కిన్‌ లేదా కార్నికాన్స్ అని పిలుస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో  శుద్ధి చేసిన వ్యవసాయ ఉత్పత్తులుగా  పరిగణించే కీరదోస, గెర్కిన్‌ లు  భారతదేశం నుంచి ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 200 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు ఉంటుంది. 

2020-21లో భారతదేశం నుంచి 2,23,515 మెట్రిక్ టన్నుల కీరదోస, గెర్కిన్‌ ఎగుమతి అయ్యాయి. వీటి విలువ 223 మిలియన్ అమెరికన్ డాలర్లకు మించి ఉంది. 

వాణిజ్య శాఖవాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ నుంచి అందిన ఆదేశాల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచ మార్కెట్లో ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ లలో  ఆహార భద్రతా ప్రమాణాలను కల్పించేందుకు కార్యక్రమాలను రూపొందించి అమలు చేసింది.

భారతదేశం నుంచి రెండు పద్ధతుల్లో  గెర్కిన్‌ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మొదటి పద్దతిలో  కీరదోస మరియు  గెర్కిన్‌లను సిద్ధం చేసి వాటిని వెనిగర్ లేదా ఎసిటిక్ యాసిడ్ లో భద్రపరిచి ఎగుమతి చేయడం జరుగుతుంది. రెండో పద్దతిలో సాధారణ రీతిలో కీరదోస మరియు  గెర్కిన్‌లను సిద్ధంచేసి ఎగుమతి చేస్తున్నారు. 

భారతదేశంలో 1990 ప్రాంతంలో గెర్కిన్‌ సాగు కర్ణాటక లో ప్రారంభమయ్యింది. ఆ తరువాత పొరుగున ఉన్న తమిళనాడు, ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఇది విస్తరించింది. ప్రపంచంలో పండుతున్న  గెర్కిన్‌లో దాదాపు 15% ఉత్పత్తి భారతదేశంలోనే జరుగుతోంది.

ప్రస్తుతం గెర్కిన్‌ 20 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఉత్తర అమెరికాఐరోపా, ఓషియానిక్ దేశాలు అయిన అమెరికా ఫ్రాన్స్జర్మనీఆస్ట్రేలియాస్పెయిన్దక్షిణ కొరియాకెనడాజపాన్బెల్జియంరష్యాచైనాశ్రీలంక , ఇజ్రాయెల్ వంటి దేశాలకు  గెర్కిన్‌ ఎక్కువగా ఎగుమతి అవుతోంది. 

గెర్కిన్‌ సాగుతో దేశ ఎగుమతులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. భారతదేశంలో కాంట్రాక్టు పద్ధతిలో దాదాపు 65,000 ఎకరాల భూమిలో 90,000 మంది చిన్న, సన్నకారు రైతులు సాగు చేస్తున్నారు. 

తినడానికి సిద్ధంగా ఉండే విధంగా ప్రాసెస్ చేసిన గెర్కిన్‌లను పారిశ్రామిక ముడి పదార్దాలుగా పాత్రలలో పెద్దమొత్తంలో ఎగుమతిచేస్తున్నారు. గెర్కిన్‌ మార్కెట్ లో 

పెద్దమొత్తంలో ఉత్పత్తి ఇప్పటికీ గెర్కిన్ మార్కెట్‌లో అధిక శాతంలో ఉంది. భారతదేశంలో సుమారు 51 ప్రధాన కంపెనీలు డ్రమ్స్ మరియు రెడీ-టు-ఈట్ కన్స్యూమర్ ప్యాక్‌లలో గెర్కిన్‌లను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి.

పెద్దమొత్తంలో ఉత్పత్తి అవుతున్న గెర్కిన్ మార్కెట్‌  అధిక శాతం కలిగి ఉంది. భారతదేశంలో సుమారు 51 ప్రధాన కంపెనీలు డ్రమ్ములు  మరియు రెడీ-టు-ఈట్ కన్స్యూమర్ ప్యాక్‌లలో గెర్కిన్‌లను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయి.

ప్రాసెస్ చేసిన కాయగూరల ఎగుమతులను ఎక్కువ చేయడంలో ఎంపెడా కీలక పాత్ర పోషిస్తోంది. గెర్కిన్‌ దిగుబడి, నాణ్యతను  పెంచి, ప్రాసెసింగ్ యూనిట్లలో భద్రత ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎంపెడా అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. 

ఎకరం భూమిలో రైతు నాలుగు మెట్రిక్ టన్నుల గెర్కిన్‌ ను పండిస్తున్నారు. 80 వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోగా రైతుకి 40 వేల రూపాయల ఆదాయం సరాసరిన వస్తోంది. 90 రోజుల్లో గెర్కిన్‌ పంట చేతికి వస్తుంది. ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన ప్రాసెసింగ్ ప్లాంటులు విదేశీ కొనుగోలు దారుల అవసరాల మేరకు ఉత్పతులను సిద్ధం చేస్తున్నాయి. 

గెర్కిన్‌ ఉత్పత్తిదారులు, ఎగుమతి సంస్థలు ఐఎస్ఓ, బిఆర్సీ, ఐఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎస్సీ 22000 మరియు హెచ్ఏసీసీపి సర్టిఫికెట్ లేదా అన్ని అవసరమైన సర్టిఫికెట్లు కలిగి ఉన్నాయి. దాదాపు అన్ని సంస్థల్లో సోషల్ ఆడిట్ అమలులో ఉంది. దీంతో ఉద్యోగులకు చట్టపరంగా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. 

ఎగుమతుల విలువను ఎక్కువ చేయాలనే లక్ష్యంతో గెర్కిన్‌ లను విలువ ఆధారిత ఉత్పత్తులు గా అభివృద్ధి చేసే అంశాన్ని  ఎంపెడా పరిశీలిస్తోంది. 

 .

భారతదేశం నుంచి జరిగిన కీర దోసకాయ / గెర్కిన్ ఎగుమతులు (యూఎస్  మిలియన్ టన్నుల్లో )

 

 

 

2020-21

2021-22 (ఏప్రిల్-నవంబర్)

హెచ్ ఎస్ ఎన్  కోడ్

ఉత్పత్తులు

యూఎస్ మిలియన్

యూఎస్ మిలియన్

20011000

 వెనిగర్/ఎసిటిక్ యాసిడ్‌లోభద్రపరిచిన  కీరదోసకాయ/గెర్కిన్‌లు

138

72

07114000

 తాత్కాలిక విధానంలో  భద్రపరిచిన  కీరదోసకాయ/గెర్కిన్‌లు

85

42

 

 

 

 

 

మొత్తం

223

114

మూలం: DGCIS

 

****


(Release ID: 1792015) Visitor Counter : 332