రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సెలా సొరంగం ప్రాజెక్ట్‌లో తవ్వకాలను ముగించేలా చివరి పేలుడును నిర్వహించిన బీఆర్ఓ

Posted On: 22 JAN 2022 2:53PM by PIB Hyderabad

980 మీటర్ల పొడవైన సెలా టన్నెల్ (టన్నెల్ 1) ప్రాజెక్టులో చివ‌రి  చివరి పేలుడును నిర్వ‌హించారు.  న్యూఢిల్లీ నుండి ఈ-వేడుక ద్వారా  డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ (డీజీబీఆర్) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి జనవరి 22, 2022వ తేదీని ఈ కార్య‌క్ర‌మాన్ని  నిర్వహించారు. ఇది  సెల టన్నెల్ ప్రాజెక్ట్‌లో తవ్వకం పనుల ముగింపును సూచిస్తుంది. ప్రతికూల వాతావరణం మరియు భారీ హిమపాతం మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఈ ఘనతను సాధించింది. సెలా టన్నెల్ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లాలో ఉంది. ఈ సోరంగం ప‌నులు పూర్తయిన తర్వాత తవాంగ్‌కు అన్ని వాతావరణ ప‌రిస్థితుల‌లో కనెక్టివిటీని ఇది అందిస్తుంది. ఇది జీవ‌న రేఖ‌గా కూడా నిలుస్తుంది. ప్రాజెక్ట్ టన్నెల్-1ని కలిగి ఉంది, ఇది 980 మీటర్ల పొడవైన సింగిల్ ట్యూబ్ టన్నెల్ మరియు టన్నెల్ 2, ఇది 1555 మీటర్ల పొడవు గల ట్విన్ ట్యూబ్ టన్నెల్.టన్నెల్ 2లో ట్రాఫిక్ కోసం రెండులేన్‌ల  ట్యూబ్ మరియు అత్యవసర పరిస్థితుల కోసం ఒక ఎస్కేప్ ట్యూబ్ ఉన్నాయి. 13,000 అడుగుల ఎత్తులో నిర్మించబడిన అతి పొడవైన సొరంగాలలో ఇది కూడా ఒకటి. ప్రాజెక్ట్‌లో టన్నెల్ 1కి ఏడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం కూడా ఉంది, ఇది బీసీటీ రోడ్ నుండి బయలుదేరుతుంది మరియు టన్నెల్ 1 నుండి టన్నెల్ 2కి అనుసంధానించే 1.3 కిలోమీటర్ల లింక్ రోడ్డు కూడా ఉంది. సెలా టన్నెల్ ప్రాజెక్ట్ ప‌నుల‌కు  2019లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. జనవరి 15, 2021న, డీజీబీఆర్‌ ద్వారా మొదటి పేలుడు జ‌రిపారు. ఆ తర్వాత టన్నెల్ 1 తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత, అక్టోబర్ 14, 2021న, రక్షణ‌ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 1,555 మీటర్ల టన్నెల్ 2 యొక్క అద్భుతమైన పేలుడు నిర్వ‌హించారు. ఇండియా గేట్ నుండి ఈ-వేడుక ద్వారా, టన్నెల్ 2పై తవ్వకం ముగింపునకు గుర్తుగా దీనిని నిర్వహించారు.

 

***



(Release ID: 1791865) Visitor Counter : 160