పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అటవీ సర్వే నివేదిక 2021 విడుదల; గత రెండేళ్లలో దేశంలోని మొత్తం అడవులు, చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల పెరుగుదల.


–ప్రాంతాల వారీగా చూస్తే మధ్యప్రదేశ్ దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉంది

–అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదల ఆంధ్రప్రదేశ్లో (647 చదరపు కిలోమీటర్లు) తర్వాత తెలంగాణ (632 చదరపు కిలోమీటర్లు) ఒడిశా (537 చదరపు కిలోమీటర్లు) నమోదైంది.

–మొత్తం భౌగోళిక అటవీ ప్రాంతంలో 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల అటవీ విస్తీర్ణం 33 శాతానికి పైగా ఉంది.

–దేశంలోని అడవులలో మొత్తం కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులు. ఇది 79.4 మిలియన్ల పెరిగినట్టు అంచనా వేయడం జరిగింది.

–దేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్లు, 17 చదరపు కిలోమీటర్లు పెరుగుదలను గమనించడం జరిగింది.

–అడవులను పరిమాణాత్మకంగా సంరక్షించడం మాత్రమే కాకుండా గుణాత్మకంగా వాటిని సుసంపన్నం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది: భూపేందర్ యాదవ్

Posted On: 13 JAN 2022 2:51PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణం, అటవీ  వాతావరణ మార్పుల మంత్రి  భూపేందర్ యాదవ్, ఈ రోజు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) రూపొందించిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021’ని రిలీజ్ చేసారు.  దేశంలోని అడవులను,  చెట్ల వనరులను అంచనా వేయడానికి దీనిని తప్పనిసరి చేశారు. అటవీ పరిశోధనల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోని మొత్తం అడవులు,  చెట్ల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లు అని, ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 24.62 శాతం అని మంత్రి తెలియజేశారు. 2019 అంచనాతో పోలిస్తే, దేశంలోని మొత్తం అడవులు,  చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంది.

ప్రస్తుత అంచనాల ప్రకారం 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అడవులు 33 శాతానికి పైగా భౌగోళిక విస్తీర్ణంలో ఉన్నాయని వెల్లడికావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం పరిరక్షణపై దృష్టి పెట్టడం లేదని, అడవులు పరిమాణాత్మకంగా కానీ గుణాత్మకంగా దానిని సుసంపన్నం చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ఐఎస్ఎఫ్ఆర్ -2021 అటవీ విస్తీర్ణం, చెట్ల కవర్, మడ అడవులు, పెరుగుతున్న  స్టాక్, భారతదేశంలోని అడవులలో కార్బన్ నిల్వలు, అటవీ, అగ్నిమాపక పర్యవేక్షణ, టైగర్ రిజర్వ్ ప్రాంతాలలో అటవీ విస్తీర్ణం వివరాలను సేకరిస్తుంది. ఇందుకోసం ఎస్ఏఆర్ డేటా,  భారతదేశంలోని వాతావరణ మార్పులకు కీలక ప్రాంతాలపై అధ్యయనం చేస్తుంది.

ప్రధాన అన్వేషణలు

దేశంలో  మొత్తం అటవీ  చెట్ల విస్తీర్ణం 80.9 మిలియన్ హెక్టార్లు, ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 24.62 శాతం. 2019 అంచనాతో పోలిస్తే, దేశంలోని మొత్తం అడవులు  చెట్ల విస్తీర్ణంలో 2,261 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంది. ఇందులో అడవుల విస్తీర్ణం 1,540 చదరపు కిలోమీటర్లు, చెట్ల విస్తీర్ణం 721 చదరపు కిలోమీటర్లు.

అటవీ విస్తీర్ణం పెరుగుదల సాధారణ అడవులలో గమనించడం జరిగింది, తరువాత చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. అటవీ విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదల   ఆంధ్రప్రదేశ్ (647 చదరపు కిలోమీటర్లు) తరువాత తెలంగాణ (632 చదరపు కిలోమీటర్లు)  ఒడిశా (537 చదరపు కిలోమీటర్లు) రాష్ట్రాల్లో ఉంది. ప్రాంతాల వారీగా మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది. తర్వాతి స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా  మహారాష్ట్ర ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఉన్న ఎక్కువగా ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు మిజోరం (84.53శాతం), అరుణాచల్ ప్రదేశ్ (79.33శాతం), మేఘాలయ (76.00శాతం), మణిపూర్ (74.34శాతం)  నాగాలాండ్ (73.90శాతం). 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అటవీ విస్తీర్ణంలో ఉన్న భౌగోళిక ప్రాంతంలో 33 శాతానికి పైగా ఉన్నాయి. ఈ రాష్ట్రాలు  కేంద్ర పాలిత ప్రాంతాల్లో లక్షద్వీప్, మిజోరాం, అండమాన్ & నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్  మేఘాలయ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు 75 శాతం కంటే ఎక్కువ అటవీ విస్తీర్ణం కలిగి ఉండగా, 12 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, గోవా, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ  డామన్ & డయ్యూ, అస్సాం, ఒడిశాలో 33 శాతం నుండి 75 శాతం వరకు అడవులు ఉన్నాయి.

దేశంలో మొత్తం మడ విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్లు. 2019 మునుపటి అంచనాతో పోలిస్తే మడ అడవులలో 17 చదరపు కిలోమీటర్ల పెరుగుదలను గమనించడం జరిగింది. మడ అడవుల పెరుగుదలను అత్యధికంగా చూపుతున్న మొదటి మూడు రాష్ట్రాలు ఒడిషా (8 చదరపు కిలోమీటర్లు) తర్వాత మహారాష్ట్ర (4 చదరపు కిలోమీటర్లు)  కర్ణాటక (3 చదరపు కిలోమీటర్లు) ఉన్నాయి . దేశం  అడవులలో మొత్తం కార్బన్ స్టాక్ 7,204 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది  2019 చివరి అంచనాతో పోలిస్తే దేశంలోని కార్బన్ స్టాక్‌లో 79.4 మిలియన్ టన్నుల పెరుగుదల ఉంది. కార్బన్ స్టాక్‌లో వార్షిక పెరుగుదల 39.7 మిలియన్ టన్నులు.

 మెథడాలజీ

డిజిటల్ ఇండియాపై భారత ప్రభుత్వ దృక్పథం  డిజిటల్ డేటా సెట్‌ల ఏకీకరణ ఆవశ్యకతకు అనుగుణంగా, సర్వే ఆఫ్ ఇండియా అందించిన డిజిటల్ ఓపెన్ సిరీస్ టోపో షీట్‌లతో పాటు జిల్లాల స్థాయి వరకు వివిధ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ల వెక్టార్ బౌండరీ లేయర్లను ఎఫ్ఎస్ఐ ఉపయోగించింది. 2011 జనాభా లెక్కల్లో నివేదించిన భౌగోళిక ప్రాంతాలతో సమగ్ర అనుకూలతను నిర్ధారించడానికి ఇలా చేసింది.  మిడ్–-రిజల్యూషన్ శాటిలైట్ డేటాను ఉపయోగించి దేశంలోని అటవీ విస్తీర్ణం  ద్వైవార్షిక అంచనాల తయారీ కోసం భారతీయ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా (రిసోర్స్‌శాట్-ఐఐ) నుండి ఎల్ఐఎస్ఎస్-ఐఐఐ డేటా  వివరణను తీసుకోవడం జరిగింది. ఇది 23.5 మీటర్ల ప్రాదేశిక రిజల్యూషన్‌తో 1:50,000 స్కేల్ ఆఫ్ ఇంటర్‌ప్రెటేషన్‌తో ఉంటుంది. జిల్లా, రాష్ట్ర  జాతీయ స్థాయిలో అటవీ విస్తీర్ణం  అటవీ విస్తీర్ణం మార్పులను పర్యవేక్షించడానికి ఈ విధానాలను వాడుతారు.

 

ఈ సమాచారం వివిధ ప్రపంచ స్థాయి ఇన్వెంటరీల కోసం ఇన్‌పుట్‌లను అందిస్తుంది. జీహెచ్జీ ఇన్వెంటరీ, గ్రోయింగ్ స్టాక్, కార్బన్ స్టాక్, ఫారెస్ట్ రిఫరెన్స్ లెవెల్ (ఎఫ్ఆర్ఎల్) వంటి నివేదికలు  సీబీడీ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్‌మెంట్ (జీఎఫ్ఆర్ఏ) కింద అడవుల ప్రణాళిక  శాస్త్రీయ నిర్వహణ కోసం యూఎన్ఎఫ్సీసీసీ లక్ష్యాలకు అంతర్జాతీయ రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. 2019 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఎన్ఆర్ఎస్సీ నుండి మొత్తం దేశం కోసం శాటిలైట్ డేటా సేకరించడం జరిగింది. శాటిలైట్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ తర్వాత కఠినమైన గ్రౌండ్ ట్రూటింగ్ ఉంటుంది. ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి ఇతర అనుషంగిక మూలాల నుండి సమాచారం, వివరణాత్మక చిత్రం కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రస్తుత అంచనాలో సాధించిన ఖచ్చితత్వ స్థాయి గణనీయంగా ఎక్కువగా ఉంది. అటవీ విస్తీర్ణం వర్గీకరణ  ఖచ్చితత్వం 92.99శాతం అని అంచనా వేయడం జరిగింది. అటవీ,  అటవీయేతర తరగతుల మధ్య వర్గీకరణ  ఖచ్చితత్వం అంతర్జాతీయంగా ఆమోదించబడిన 85శాతం కంటే ఎక్కువ ఉంది. అంతేగాక కఠినమైన క్యూసీ & క్యూఏ  కూడా జరిగింది.

 

ఐఎస్ఎఫ్ఆర్ 2021  ఇతర ముఖ్యమైన లక్షణాలు

 

ప్రస్తుత ఐఎస్ఎఫ్ఆర్ 2021లో, భారతదేశంలోని టైగర్ రిజర్వ్‌లు, కారిడార్లు  సింహాల సంరక్షణ ప్రాంతంలోని అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి సంబంధించిన కొత్త అధ్యాయాన్ని ఎఫ్ఎస్ఐ చేర్చింది.  టైగర్ రిజర్వ్‌లు, కారిడార్లు  సింహాల పరిరక్షణ ప్రాంతంలో అటవీ విస్తీర్ణంలో మార్పు  దశాబ్దపు అంచనా, సంవత్సరాలుగా అమలు చేయబడిన పరిరక్షణ చర్యలు  నిర్వహణ జోక్యాల ప్రభావాన్ని అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది.

 

దశాబ్దాల అంచనా కోసం, ఐఎస్ఎఫ్ఆర్ 2011 (డేటా వ్యవధి 2008 నుండి 2009 వరకు)  ప్రతి టైగర్ రిజర్వ్‌లలో ప్రస్తుత చక్రం (ఐఎస్ఎఫ్ఆర్ 2021, డేటా వ్యవధి 2019–-2020) మధ్య కాలంలో అటవీ విస్తీర్ణంలో మార్పులను విశ్లేషించడం జరిగింది. ఎఫ్ఎస్ఐ  కొత్త కార్యక్రమం కూడా ఒక అధ్యాయం రూపంలో డాక్యుమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 'అబోవ్ గ్రౌండ్ బయోమాస్' అంచనా వేయడం జరిగింది. ఎఫ్ఎస్ఐ, స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ), ఐఎస్ఆర్ఓ, అహ్మదాబాద్ సహకారంతో, సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) డేటా  ఎల్-బ్యాండ్‌ని ఉపయోగించి ఇండియా స్థాయిలో భూమిపైన బయోమాస్ (ఏజీబీ) అంచనా కోసం ప్రత్యేక అధ్యయనాన్ని ప్రారంభించింది. అస్సాం,  ఒడిశా రాష్ట్రాల ఫలితాలు (అలాగే ఏజీబీ మ్యాప్‌లు) ఐఎస్ఎఫ్ఆర్ 2019లో ముందుగా అందించడం జరిగింది. మొత్తం దేశం కోసం ఏజీబీ అంచనాల ( ఏజీబీ మ్యాప్‌లు) కోసం మధ్యంతర ఫలితాలు ఐఎస్ఎఫ్ఆర్ 2021లో కొత్త అధ్యాయం వలె ప్రదర్శిస్తున్నారు. అధ్యయనం పూర్తయిన తర్వాత వివరణాత్మక నివేదిక వస్తుంది.

గోవా క్యాంపస్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బీఐటీఎస్) పిలానీ సహకారంతో ఎఫ్ఎస్ఐ 'భారత అడవుల్లో వాతావరణ మార్పుల ప్రాంతాల మ్యాపింగ్' ఆధారంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. భవిష్యత్తులో మూడు కాలవ్యవధులు అంటే 2030, 2050,  2085 సంవత్సరాల్లో కంప్యూటర్ మోడల్ ఆధారిత ఉష్ణోగ్రత,  వర్షపాతం డేటా ప్రొజెక్షన్‌ని ఉపయోగించి భారతదేశంలోని అటవీ విస్తీర్ణంలో వాతావరణ ప్రాంతాలను వర్గీకరించాలనే లక్ష్యంతో సహకార అధ్యయనం జరిగింది.

ఈ నివేదికలో రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం వారీగా వివిధ పారామితులపై సమాచారం కూడా ఉంది. కొండలు, గిరిజన జిల్లాలు,  ఈశాన్య ప్రాంతం వంటి అటవీ విస్తీర్ణంపై ప్రత్యేక నేపథ్య సమాచారం కూడా నివేదికలో విడిగా ఇవ్వడం జరిగింది. దేశంలో అటవీ  చెట్ల వనరులకు సంబంధించిన విధానం, ప్రణాళిక  స్థిరమైన నిర్వహణకు సంబంధించిన విలువైన సమాచారాన్ని నివేదికలో అందించిన సమాచారం ఇవ్వగలదని భావిస్తున్నారు. పూర్తి నివేదిక క్రింది యూఆర్ఎల్లో అందుబాటులో ఉంది:  

https://fsi.nic.in/forest-report-2021-details

***(Release ID: 1791696) Visitor Counter : 7912