శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మాట్లాడుతూ వెల్లడించిన 'బీటింగ్ ది రిట్రీట్ వేడుక వివరాలు.
“టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ మద్దతుతో ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొగ్గతొడిగిన బాట్‌లాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి 29న 'బీటింగ్ ది రిట్రీట్ వేడుక'లో 1000 డ్రోన్స్ తో లైట్ షో నిర్వహణ.
చైనా, రష్యా, ఇంగ్లండుల తర్వాత 1000 డ్రోన్‌లతో ఇంత పెద్ద ఎత్తున ప్రదర్శనను నిర్వహిస్తున్న 4వ దేశంగా భారత్ అవతరించనుంది: మంత్రి
10 నిమిషాల నిడివి గల ఈ డ్రోన్ షో చీకటి ఆకాశంలో అనేక సృజనాత్మక దృశ్యాలను నిర్మించడం ద్వారా గత డెబ్భై ఐదేళ్ళ ప్రభుత్వ విజయాలను ప్రదర్శిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
21 JAN 2022 3:32PM by PIB Hyderabad
“టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ మద్దతుతో ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మొగ్గతొడిగిన బాట్‌లాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జనవరి 29న 'బీటింగ్ ది రిట్రీట్ వేడుక'లో 1000 డ్రోన్స్ తో లైట్ షో నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డ్రోన్ టెక్నాలజీ కష్టతరమైన ప్రాంతాలకు వ్యాక్సిన్‌లను పంపిణీ చేయడం నుంచి బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో రాజ్‌పథ్‌లో వెలుగులు నింపడం వరకు చాలా పురోగతి సాధించింది అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, బాట్లాబ్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని పురస్కరించుకుని ‘డ్రోన్ షో’ అనే కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. డ్రోన్ ప్రదర్శన 10 నిమిషాల నిడివితో ఉంటుందని, చీకటి ఆకాశంలో అనేక సృజనాత్మక నిర్మాణాల ద్వారా 75ఏళ్ల ప్రభుత్వ విజయాలను ప్రదర్శిస్తుందని ఆయన చెప్పారు.
ప్రాజెక్ట్ దేశీయంగా అభివృద్ధి అయ్యింది, హార్డ్ వేర్‌లు ఫ్లైట్ కంట్రోలర్ (డ్రోన్ లోని ఎగరడానికి నియంత్రణకు కారకమైన ప్రధాన సాంకేతిక పనిముట్టు ) వంటి సాఫ్ట్ వేర్‌లతో సహా అన్ని అవసరమైన భాగాలను అభివృద్ధి చేస్తుంది; ఖచ్చితమైన GPS; మోటార్ కంట్రోలర్; గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ (GCS) అల్గోరిథంలు మొదలైనవి ఇందులో గొప్ప పనితనంతో అమరాయి.
సెక్రటరీ, శాస్త్ర సాంకేతిక సంస్థ , డాక్టర్ S. చంద్రశేఖర్ మాట్లాడుతూ, స్టార్టప్‌ల వ్యవస్థను ప్రోత్సహించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకునే ప్రత్యేక సందర్భంలో జనవరి 16వ తేదీని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య సంవత్సరాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం 'స్టార్ట్-అప్ ఇండియా' దేశంలో స్టార్టప్ ఉద్యమానికి మద్దతునిస్తూ 6వ సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
"3D కొరియోగ్రాఫ్డ్ డ్రోన్ లైట్ షోల కోసం 500-1000 డ్రోన్‌లతో కూడిన “రీకాన్ఫిగరబుల్ స్వార్మింగ్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్" ప్రాజెక్ట్ కోసం Botlab Dynamics Private Limited ఆర్థికంగా సహకరించిందని ఆయన చెప్పారు.
TDB భారతీయ పారిశ్రామిక సంస్థలకు, ఇతర ఏజెన్సీలకు ఆర్థిక సహాయం అందించడానికి, స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి వాణిజ్యపరమైన అనువర్తనానికి ప్రయత్నించడానికి లేదా విస్తృత దేశీయ అనువర్తనాలకు దిగుమతి చేసుకున్న సాంకేతికతలను స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైన ఆదేశంతో ఏర్పాటు చేశారు.
IP & TAFS, కార్యదర్శి, సాంకేతిక అభివృద్ధి బోర్డు అధికారి ఐన శ్రీ రాజేష్ కుమార్ పాఠక్, “బోట్‌లాబ్ అటువంటి ప్రత్యేకమైన స్టార్టప్‌లలో ఒకటి, ఇది డ్రోన్ తయారీ రంగాన్ని కొత్త స్థాయిలకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ అమృత్ మహోత్సవ్ ప్రత్యేక సందర్భానికి ప్రత్యేకమైన సహకారాన్ని అందించే అటువంటి కంపెనీకి మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం అన్నారు
భారతదేశంలో స్టార్ట్-అప్ వ్యవస్థలకు కొత్త అవకాశాలు దృశ్యమాన్యతను తీసుకురావడంలో TDB ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దేశ ఆర్థిక, వైజ్ఞానిక సాంకేతిక వృద్ధిలో స్టార్టప్‌లకు ముఖ్యమైన పాత్ర ఉందని సాంకేతిక అభివృద్ధి సంస్థ విశ్వసిస్తోంది.” అని చెప్పారు.
***
(Release ID: 1791692)
Visitor Counter : 285