ప్రధాన మంత్రి కార్యాలయం

త్రిపుర 50వ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి చేసినప్రసంగం


రాష్ట్ర ప్రజల ఐకమత్యాన్ని, సమష్టి ప్రయాసల ను ఆయన ప్రశంసించారు

‘‘జోడు ఇంజన్ ల ప్రభుత్వం అలుపెరుగని కృషి ద్వారా త్రిపుర అవకాశాల గడ్డ గా మారుతున్నది’’

‘‘సంధానం సంబంధి మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారారాష్ట్రం శరవేగం గా ట్రేడ్ కారిడార్ కు హబ్ గా రూపుందుతున్నది’’

Posted On: 21 JAN 2022 1:46PM by PIB Hyderabad

త్రిపుర స్థాపన కు, త్రిపుర అభివృద్ధి కి తోడ్పాటు ను అందించిన ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సుల ను అర్పించారు. మాణిక్య రాజ వంశాని కి చెందిన కాలం నాటి నుంచి రాష్ట్రం యొక్క తోడ్పాటు ను మరియు గౌరవాన్ని ఆయన గుర్తించారు. రాష్ట్ర ప్రజల ఐకమత్యాన్ని మరియు వారి సమష్టి ప్రయాసల ను ఆయన ప్రశంసించారు. ఈ రోజు న త్రిపుర 50వ స్థాపన దినం కావడం తో ఈ సందర్భం లో ఆయన ప్రసంగించారు.

మూడు సంవత్సరాల కాలం లో జరిగిన సార్థక పరివర్తన ను గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, రెండు ఇంజన్ ల ప్రభుత్వం అవిశ్రాంత కృషి ఆధ్వర్యం లో త్రిపుర అవకాశాల గడ్డ గా ఎదుగుతోంది అన్నారు. అభివృద్ధి తాలూకు అనేక పరామితుల లో రాష్ట్రం సాధించిన ఉత్కృష్టమైన ప్రదర్శన ను గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రస్తావిస్తూ, సంధానం సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రం ట్రేడ్ కారిడార్ కు హబ్ గా శర వేగం గా రూపుదిద్దుకొంటోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రహదారులు, రైలు మార్గాలు, వాయు మార్గాలు, ఇంకా ఇన్ లే వాటర్ వేస్ సైతం త్రిపుర ను ప్రపంచం లోని ఇతర ప్రాంతాల తో కలుపుతున్నాయని పేర్కొన్నారు. రెండు ఇంజన్ ల ప్రభుత్వం త్రిపుర యొక్క దీర్ఘకాలిక డిమాండు ను నెరవేర్చింది, బాంగ్లాదేశ్ లోని చట్ గాఁవ్ ఓడరేవు కు అందుబాటు సాధ్యపడింది అని ఆయన అన్నారు. 2020వ సంవత్సరం లో అఖౌరా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ గుండా బాంగ్లాదేశ్ నుంచి ఒకటో కార్గో ను రాష్ట్రం అందుకొందన్నారు. మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయాన్ని ఇటీవల విస్తరించిన సంగతి ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

పేద ప్రజల కు పక్కా ఇళ్ళ ను సమకూర్చే విషయం లో రాష్ట్రం చేసిన మంచి పని ని గురించి, గృహనిర్మాణం లో కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని చురుకు గా ఉపయోగించడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఆరు రాష్ట్రాల లో లైట్ హౌస్ ప్రాజెక్టు (ఎల్ హెచ్ పి) ల పనులు సాగుతున్నాయి మరి ఆ ఆరు రాష్ట్రాల లో త్రిపుర ఒక రాష్ట్రం గా ఉంది అని ఆయన అన్నారు. గడచిన మూడు సంవత్సరాల లో ని పనులు ఒక ఆరంభం మాత్రమే; త్రిపుర యొక్క నిజ సామర్ధ్యాన్ని ఇప్పటికీ ఇంకా వినియోగించుకోవడం మిగిలే ఉంది అని ఆయన అన్నారు. పాలన లో పారదర్శకత్వం మొదలుకొని మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం వరకు చూస్తే అనేక రంగాల లో చేపడుతున్న చర్యలు రాష్ట్రాన్ని రాబోయే దశాబ్దాల కు గాను సన్నద్ధం చేస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అన్ని గ్రామాల లో సౌకర్యాలు మరియు ప్రయోజనాలు సంతృప్త స్థాయి కి చేరడం వంటి ప్రచార ఉద్యమాలు త్రిపుర ప్రజల జీవితాల ను సరళతరం గాను, ఉత్తమం గాను మార్చుతాయి అని ఆయన చెప్పారు.

భారతదేశం స్వాతంత్య్రం తాలూకు 100 సంవత్సరాల ను పూర్తి చేసుకొంటూ ఉంటే, త్రిపుర కూడా స్థాపన తాలూకు 75 సంవత్సరాల ను ముగించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది కొత్త సంకల్పాల కు, కొత్త అవకాశాల కు సంబంధించినటువంటి ఒక మహత్తరమైనటువంటి కాలం’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

***********

DS

 

 

 

 

 



(Release ID: 1791498) Visitor Counter : 125