సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఒర్ జాతీయ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ సే స్వర్ణిమ్ భారత్ కే ఒర్‌లో భాగంగా బ్రహ్మకుమారీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు భారతదేశం యొక్క గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు అద్భుతమైన గతాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శిస్తాయి: శ్రీ జి కిషన్ రెడ్డి

ఆజాదీ కా అమృత్ మహోత్సవం మన దేశానికి రాబోయే 25 సంవత్సరాలకు దిశానిర్దేశం చేస్తుందని నేను నమ్ముతున్నాను మరియు ఐడియా 2047 గురించి మన ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో అన్ని సామాజిక సంస్థలు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మరియు మేధావులు కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను: శ్రీ జి కిషన్ రెడ్డి

Posted On: 20 JAN 2022 4:46PM by PIB Hyderabad

 

కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి జనవరి 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఒర్ జాతీయ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేశారు.

image.png


ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, కేంద్ర కార్మిక మరియు పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్, కేంద్ర సాంస్కృతిక మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర వ్యవసాయ మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, రాజస్థాన్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ గులాబ్ చంద్ కటారియాతో పాటు బ్రహ్మ కుమారీస్ సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ఆజాది కా అమృత్ మహొత్సవ్‌ సే స్వర్ణిమ్ భారత్ కే ఒర్ కింద బ్రహ్మ కుమారీస్ భాగస్వామ్యంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు అంకితం చేసిన ఏడాది పొడవునా కార్యక్రమాలను ఆవిష్కరించింది. మరియు ప్రపంచవ్యాప్తంగా 30 కంటే ఎక్కువ ప్రచారాలు మరియు 15000 పైగా కార్యక్రమాలను కలిగి ఉంది.

సంస్థ చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి కొనియాడారు. " బ్రహ్మ కుమారి సంస్థ గత 88 సంవత్సరాలలో 140 దేశాలలో మతం, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక రంగంలో ప్రశంసనీయమైన కృషి చేసింది. వారు కోట్లాది ప్రజలకు శాంతి మరియు ఆధ్యాత్మికత మార్గాన్ని చూపించారు. అలాగే ప్రజలకు మరియు దేశానికి సేవ చేయని రంగం సమాజంలో లేదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ సే స్వర్ణిమ్ భారత్ కే ఒర్‌ కింద బ్రహ్మకుమారీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వేదికపై భారతదేశానికి చెందిన గొప్ప సంస్కృతి, వారసత్వం మరియు అద్భుతమైన గతాన్ని ప్రదర్శిస్తాయి. "శ్రీ నరేంద్ర మోదీ జీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నాయకత్వంలో భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు అద్భుతమైన నాగరికతను ప్రపంచానికి తీసుకెళ్లడం మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తున్నారని" ఆయన అన్నారు.

కేంద్ర, రాష్ట్ర మరియు అంతర్జాతీయ స్థాయిలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద విభిన్న పోటీలు మరియు కార్యక్రమాలను నిర్వహించడంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పాత్రను కూడా శ్రీ జి కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. "ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఉత్సవాలలో ఒకటి మరియు భారత ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు మరియు వివిధ సంస్థలు, పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు ఒకచోట చేరి, ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. ఈ మహోత్సవం స్వాతంత్ర్య ఉద్యమం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వేలాది మంది విప్లవకారుల త్యాగాలను కూడా గుర్తిస్తుంది అని తెలిపారు.


image.png


" ఈరోజు శ్రీ నరేంద్ర మోదీ సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నారు మరియు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతోంది" అని ఆయన అన్నారు. తోటి భారతీయులలో దేశభక్తిని పెంపొందించడానికి మరియు జాతీయ గౌరవాన్ని మేల్కొల్పడానికి అన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవా సంస్థలు కలిసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర మంత్రి కోరారు. "ప్రధాన మంత్రి దార్శనికత ఐడియా-2047 సాకారం చేయడంలో మరియు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయడంలో సహకరించాలని దేశంలోని ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మరియు మేధావులతో పాటు అన్ని ఇతర సామాజిక సంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆయన అన్నారు.

 

****



(Release ID: 1791334) Visitor Counter : 302