కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నవంబర్ 2020 పేరోల్ డేటా : 2021 నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో కొత్తగా 13.95 లక్షల నికర చందాదారులు చేరారు
Posted On:
20 JAN 2022 5:11PM by PIB Hyderabad
ఈపీఎఫ్‌ఓలో 2022నవంబర్ నెలలో 13.95 లక్షల మంది కొత్తగా చందాదారులుగా చేరారు. 2021 నవంబర్ నెల తాత్కాలిక పేరోల్ వివరాలను ఈ రోజు విడుదల చేశారు. 2021 అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన ఖాతాదారుల సంఖ్యతో పోల్చి చూస్తే 2021 నవంబర్ నెలలో వీరి సంఖ్య 2.85 లక్షల వరకు పెరిగింది. ఈపీఎఫ్‌ఓలో చేరిన వారి సంఖ్యలో 25.65% వృద్ధి కనిపించింది. 2020 నవంబర్ నెలతో పోల్చి చూస్తే 2021 నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో 3.84 లక్షల మంది ఎక్కువగా చేరారు. 2020 నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో 10.11 లక్షల మంది చందాదారులుగా చేరారు. 2021 నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో కొత్తగా 13.95 లక్షల నికర చందాదారులు చేరారు. 2020 నవంబర్ నెలతో పోల్చి చూస్తే 2021 నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో కొత్తగా 3.84 లక్షల నికర చందాదారులు కొత్తగా చేరారు.
కొత్తగా ఈపీఎఫ్‌ఓలో చేరిన 13.95 లక్షల నికర చందాదారులలో 8.28 లక్షల మంది తొలిసారిగా ఈపీఎఫ్‌ఓ సామజిక భద్రత పరిధిలోకి వచ్చారు. సుమారు 5.67 లక్షల మంది సభ్యులు నిష్క్రమించి తిరిగి ఈపీఎఫ్‌ఓలో చేరారు. ఈపీఎఫ్ మరియు ఎంపీ,1952 చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల్లో చందాదారులు ఉద్యోగాలు మారడంతో ఇది జరిగింది. చందాదారులు ఈపీఎఫ్‌ఓలో తుది పరిష్కారంగా నిధులను తీసుకోకుండా తమ సభ్యత్వాన్ని కొనసాగిస్తూ తమ పిఎఫ్ ఖాతాలను వాటిలో ఉన్న మొత్తాలను ఇదివరకటి పిఎఫ్ ఖాతా నుంచి ప్రస్తుత పిఎఫ్ ఖాతాకు మళ్ళించు కొనేందుకు ఆసక్తి కనబరిచారు.
వయస్సుల వారీగా విశ్లేషణ చేస్తే నవంబర్ 2021 లో 22-25 వయస్సు గలవారు అత్యధికంగా ఈపీఎఫ్‌ఓలో చేరారు. ఈపీఎఫ్‌ఓలో చేరిన ఈ వయస్సు వారి సంఖ్య 3.64 లక్షలుగా ఉంది. నవంబర్ 2022 లో 22-25 వయస్సు చందాదారుల సంఖ్యలో అత్యధికంగా 2.72 లక్షల నికర పెరుగుదలను నమోదు చేసింది. దీని తరువాత 18-21 వయస్సు గల 2.81 లక్షల మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు. 18-25 వయస్సు గల సభ్యులను ఉపాధి రంగంలో కొత్తగా చేరిన వారిగా పరిగణించవచ్చు. 18-25 వయస్సు గల సభ్యుల సంఖ్య మొత్తం సభ్యుల సంఖ్య లో 46.20%గా ఉంది. విద్యాపరమైన అర్హతలు కలిగి ఉండే ఈ సభ్యులు పురోభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జాతీయ పేరోల్ గణాంకాల వివరాలను పరిశీలిస్తే మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సంస్థల్లో ఎక్కువ మంది ఈపీఎఫ్‌ఓలో చేరారు. ఈ రాష్ట్రాలు నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్యలో ముందున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి ఈపీఎఫ్‌ఓలో 8.46 లక్షల మంది చేరారు. మొత్తం నికర పేరోల్ చేరికలో అన్ని వయస్సుల్లో కలిపి వీరి సంఖ్య 60.60% గా ఉంది.
2020 నవంబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్యను లింగాల వారీగా విశ్లేషిస్తే కొత్త నమోదులో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021 నవంబర్ నెలలో 2.95 లక్షల మంది మహిళలు చేరారు. 2021 అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో 2.36 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2021 అక్టోబర్ నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్యతో పోల్చి చూస్తే నవంబర్ చేరిన చందాదారుల సంఖ్య 24.97% వరకు పెరిగింది.
పరిశ్రమల వారీగా విశ్లేషణ జరిపినప్పుడు ‘నిపుణుల సేవలు’ (ఇందులో ప్రధానంగా మానవ వనరుల ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థలు మరియు చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారు) రంగంలో ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ రంగంలో ఉపాధి పొందుతూ ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్య మొత్తం చందాదారుల్లో 41. 48% వరకు ఉంది. భవన నిర్మాణ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, పాఠశాలలు, రెస్టారెంట్లు, సిమెంట్ తదితర రంగాల నుంచి కూడా ఈపీఎఫ్‌ఓలో చేరిన చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఈపీఎఫ్‌ఓ పేరోల్ వివరాలు తాత్కాలిక ప్రాతిపదికన రూపొందించడం జరుగుతుంది. ఉద్యోగుల రికార్డులను ఎప్పటికప్పుడు నవీనీకరణ చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియలో పేరోల్ వివరాలు మారుతుంటాయి. 2018 మే నెల నుంచి పేరోల్ వివరాలను ఈపీఎఫ్‌ఓ 2017 నవంబర్ నుంచి ఈ వివరాలను విడుదల చేయడం జరుగుతోంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో తన చందాదారులకు ఈపీఎఫ్‌ఓ తగిన సహాయ సహకారాలు అందించి వారికి అండగా నిలిచింది. సార్వత్రిక కవరేజీని విస్తరించడం మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన చందాదారులకు నిరంతరాయంగా సేవలను అందించడం లక్ష్యంగా ఈపీఎఫ్‌ఓ పనిచేస్తోంది. సామజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్న ఈపీఎఫ్‌ఓ ట్విట్టర్, వాట్స్ ఆప్, ఫేస్ బుక్ ల ద్వారా తన చందాదారులకు అందుబాటులోకి వస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తోంది.
***
(Release ID: 1791329)
Visitor Counter : 254