సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

2022 గణతంత్ర దినోత్సవం వేడుకల కోసం రాజ్‌పథ్‌లో కళా కుంభ్' ప్రత్యేక కార్యక్రమంగా కింద రూపొందించిన అతిపెద్ద, అద్భుత కళాఖండాల ప్రదర్శన

Posted On: 20 JAN 2022 5:49PM by PIB Hyderabad

'కళా కుంభ్' కార్యక్రమం లో ప్రదర్శనకోసం రూపొందించిన భారీ , అద్భుతమైన స్క్రోల్‌లు/ కళాఖండాలు  ఇప్పుడు 2022 రిపబ్లిక్ డే వేడుకల కోసం రాజ్‌పథ్‌లో నెలకొల్పారు. ఈ కళాఖండాలు రాజ్‌పథ్‌కు ఇరువైపులా అలంకరించబడి, విస్మయంగా  కనువిందు చేస్తాయి. సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ ఈరోజు రాజ్‌పథ్‌ని సందర్శించి ఈ ప్రదర్శనను పరిశీలించారు.

ఈ దృశ్య మాలిక దేశంలోని విభిన్న భౌగోళిక స్థానాల నుంచి వివిధ రకాల కళలతో జాతీయాభిమానాన్ని , శ్రేష్ఠతను వ్యక్తీకరించే సాధనంగా కళల సామర్థ్యాన్ని విశ్లేషిస్తాయి. ఒడిశా , చండీగఢ్‌లలో ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఏర్పాటుచేసిన  ప్రత్యేక వర్క్ షాప్‌లలో 'కళా కుంభ్'లో పాల్గొన్న ఐదు వందల మందికి పైగా కళాకారులు వీటిని శ్రద్ధగా  ఉత్సాహంగా చిత్రించారు.

మీడియా ప్రతినిధులతో శ్రీ గోవింద్ మోహన్   మాట్లాడుతూ  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటున్న ఈ సందర్భంలో, 750 మీటర్ల పొడవు గల స్క్రోల్స్‌ ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ , రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్దగా అభివర్ణించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్థానిక కళాకారులు ఈ  అద్భుత  స్క్రోల్స్ చిత్రించారు , ఎక్కువగా స్వాతంత్ర్య పోరాటంలో వెలుగుచూడని  వీరుల పరాక్రమ కథలను  ఇవి చిత్రీకరిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ కళాకారుల వైవిధ్యమైన కళారూపాలు “ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్” నిజమైన స్ఫూర్తితో ఒకే వేదికపై ఉన్న  స్క్రోల్స్‌లోనూ  ప్రతిబింబిస్తున్నాయని కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ వివరించారు. గణతంత్ర దినోత్సవం తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ కళాఖండాలను  తీసుకెళ్లి ప్రదర్శనకు ఉంచుతామని గోవింద్ మోహన్ తెలిపారు.

image.png

image.png

image.png

image.png

image.png

image.png

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి  అనుగుణంగా, ఈ వర్క్ షాప్‌లలో సహకార సమిష్టి పని ఫలితం సాకారమైంది. డిసెంబర్ 11 నుంచి 17 వరకు ఒడిశాలో, న్యూఢిల్లీ కి చెందిన నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , సిలికాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలతో కలిసి పని చేసింది. 25 డిసెంబర్ 2021 నుంచి 2 జనవరి 2022 వరకు చండీగఢ్‌లో చిత్కారా విశ్వవిద్యాలయంతో కలిసి సహకారం అందించడం  వల్ల  ఈ కళాఖండాలు తయారయ్యాయి.

కళా కుంభ్- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భిన్నత్వంలో ఏకత్వం సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది, అలాగే 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం, ప్రజలు, సంస్కృతి , మన విజయాల అద్భుతమైన చరిత్రను  స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

భారతదేశంలోని దేశీయ కళల నుంచి పొందిన సహకారంతో పాటు   భారత రాజ్యాంగంలోని సృజనాత్మక సందర్భాల నుంచి కూడా ప్రేరణ పొంది నందలాల్ బోస్, అతని బృందం ఈ కళాత్మక అంశాలను చిత్రించింది.

ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నిజమైన అర్థం   ఈకార్యక్రమంలో కనిపించింది, ఇక్కడ మన దేశ సాంస్కృతిక  వైవిధ్యం ప్రస్ఫుటమైంది, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వెలుగులోకి రాని వీరుల వీరోచిత జీవితాలను , పోరాటాలను ఈ కళాఖండాలు కళ్ళకు కట్టాయి.

 

****



(Release ID: 1791328) Visitor Counter : 199