సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్య‌స్ఆన్ఎయిర్ రేడియో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల అంత‌ర్జాతీయ ర్యాంకింగ్‌లు ఎఐఆర్‌ను వింటున్న అంత‌ర్జాతీయ యువ‌త‌

Posted On: 18 JAN 2022 3:31PM by PIB Hyderabad

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శ్రోత‌ల‌లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది 18 నుంచి 44 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల‌వారు ఉన్నార‌ని తాజా న్యూస్ఆన్ఎయిర్ రైడియో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల అంత‌ర్జాతీయ ర్యాంకింగ్ తేల్చింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా న్యూస్ఆన్ఎయిర్ యాప్ కు యువ‌త‌లో ఉన్న‌భారీ ప్ర‌జాద‌ర‌ణ‌ను ధృవీక‌రిస్తోంది. 
ఆలిండియా రేడియో  న్యూస్ఆన్ఎయిర్ యాప్ ద్వారా చేసి ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన దేశాల ర్యాంకింగ్ ల‌లో ప‌పువా న్యూగినియాను వెన‌క్కు నెట్టి తొలిసారి స్పెయిన్ అగ్ర ప‌ది లో ప్ర‌వేశించింది.ఇవి ప్ర‌పంచంలోని అగ్ర‌దేశాల  (భార‌త్‌ను మిన‌హాయించి) తాజా ర్యాంకింగ్‌లు. గ‌త రెండు ప‌క్షాలుగా వ‌రుస‌గా రెండ‌వ‌సారి ఫిజి అత్యున్న‌త స్థానంలో కొన‌సాగుతోంది. 
ఆలిండియా రేడియో అంత‌ర్జాతీయంగా (భార‌త్ మిన‌హా) ప్ర‌సారం చేసే కార్య‌క్ర‌మాల్లో ఎఐఆర్ ధ‌ర్మ‌శాల నూత‌నంగా ప్ర‌వేశించ‌గా,  అస్మిత ముంబై, ఎఐఆర్ తెలుగు, ఎఐఆర్ చెన్నై రైన్‌బో స్థానంలో అగ్ర జాబితాలోకి ఎఐఆర్ మంజరీ, ఎఫ్ఎం గోల్డ్ ముంబై తిరిగి ప్ర‌వేశించాయి. 
ఆలిండియా రేడియోకు చెందిన 240 రేడియో సేవ‌ల‌ను  ప్ర‌సార భార‌తి అధికారిక యాప్ అయిన న్యూస్ఎయిర్ఆప్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల‌ను చేస్తున్నాయి. ఈ న్యూస్ఆన్ఎయిర్ యాప్ ద్వారా ఆలిండియా రేడియో ప్ర‌సారం చేసే కార్య‌క్ర‌మాల‌కు కేవ‌లం భార‌త్‌లోనే కాక అంత‌ర్జాతీయంగా, 85 దేశాల‌క‌న్నా ఎక్కువ‌దేశాల‌లో శ్రోత‌లున్నారు. 
భార‌త్ కాకుండా న్యూస్ఆన్ఎయిర్ యాప్ అత్యంత ప‌ర‌జాద‌ర‌ణ క‌లిగిన అగ్ర‌దేశాల‌ను పర్య‌వ‌లోకిద్దాం. మిగిలిన ప్ర‌పంచంలో న్యూస్ఆన్ఎయిర్ ఆప్ ద్వారా ప్ర‌సారం అయ్యే అగ్ర ఆలిండియా రేడియో ప్ర‌సారాల‌ను చూద్దాం. మీరు దీనిని దేశాల వారీగా కూడా చూడ‌వ‌చ్చు. ఈ ర్యాంకింగ్ లు డిసెంబ‌ర్ 16 నుంచి డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు సేక‌రించిన డాటా ఆధారంగా నిర్ణ‌యించిన‌వి. 

***(Release ID: 1790790) Visitor Counter : 59