సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సిజిజి), భారత ప్రభుత్వం , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్
మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (ఎన్ ఐ ఆర్ డి అండ్ పిఆర్), హైదరాబాద్ మధ్య అవగాహన ఒప్పందం (ఎమ్ఒయు)
प्रविष्टि तिथि:
18 JAN 2022 2:18PM by PIB Hyderabad
సమ్మిళిత సుపరిపాలనను ప్రోత్సహించడానికి, స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి- నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సిజిజి), భారత ప్రభుత్వం , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయితీ రాజ్ (ఎన్ ఐఆర్ డి & పిఆర్), హైదరాబాద్ మధ్య సోమవారం, 17 జనవరి 22 న అవగాహన ఒప్పందం (ఎంఒయు) పై సంతకాలు జరిగాయి.
అన్ని కార్యక్రమాలు , పథకాలలో మెరుగైన సుపరిపాలన యంత్రాంగాలను ఆచరణలోకి తీసుకురావడానికి ఈ రెండు జాతీయ సంస్థల బలాలను పొందడం ద్వారా విభిన్న సహకార కార్యకలాపాలపై దృష్టి సారించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం.
పంచాయితీ రాజ్ సంస్థలు (ఇనిస్టిట్యూషన్స్) (పిఆర్ఐలు) తో సహా ప్రభుత్వ అన్ని స్థాయిల్లో విజ్ఞాన మార్పిడి, నిర్వాహకులు సామర్థ్య పెంపుదల చేపట్టడానికి రెండు సంస్థలు అంగీకరించాయి.
ఈ ఎమ్ఒయు సుపరిపాలన సూత్రాలను నిజమైన స్ఫూర్తితో అన్వయించడానికి సహాయపడటమే కాకుండా, గ్రామీణ సమాజాలకు ప్రయోజనం చేకూర్చే సేవలను అందించడానికి ఉద్దేశించిన రీతిలో ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత , జవాబుదారీతనం పరంగా వాటి సమర్థవంతమైన అమలుకు కూడా దోహదపడుతుంది. పంచాయితీ స్థాయిలో ఇ-గవర్నెన్స్ ను వినియోగించడం, పంచాయితీ స్థాయిలో సుపరిపాలన నమూనాలను డాక్యుమెంట్ చేయడం, ఫారాలను సరళీకృతం చేయడం , గ్రామీణ పాలన ఉత్తమ విధానాలతో సహా అనేక కీలక పరస్పర ప్రయోజనకర ప్రాంతాలను చర్య తీసుకోదగిన అంశాలుగా గుర్తించారు.
పంచాయతీ స్థాయిలో గ్రామీణ పాలన సూచిక బెంచ్ మార్క్ ను గుర్తించాలని ఎన్ సి జి జి సూచించింది.
అవగాహనా ఒప్పందం పై సంతకాల కార్యక్రమం లో -పరిపాలనా సంస్కరణలు ,ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ (డిఎఆర్ అండ్ పిజి), భారత ప్రభుత్వం, డైరెక్టర్ జనరల్ ,నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సిజిజి) , డాక్టర్ జి నరేంద్ర కుమార్, డైరెక్టర్ జనరల్ (ఎన్ ఐ ఆర్ డిపిఆర్), అధికారుల బృందం - ప్రొఫెసర్ పూనమ్ సింగ్, డాక్టర్ ఎ.పి. సింగ్ ,డాక్టర్.బి ఎస్ బిష్త్ సీనియర్ ఫ్యాకల్టి ఎన్ సిజిజి మరియు శ్రీ శశి భూషణ్, ఎన్ సిజిజి కి చెందిన డాక్టర్ .B ఎస్. బిష్త్ సీనియర్ అధ్యాపకులు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ పార్థ ప్రతిమ్ సాహు, ఎన్ ఐఆర్ డిపిఆర్ నుండి ఫ్యాకల్టి డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
<><><><>
(रिलीज़ आईडी: 1790713)
आगंतुक पटल : 287