విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్ వాహనాల (ఈ.వి) ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను ప్రకటించిన - విద్యుత్ మంత్రిత్వ శాఖ


ఈ.వి. ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు ముందస్తుగా సహాయ పడటానికి మరియు ఛార్జింగ్ స్టేషన్లు నిర్వహించే వారు / యజమానులు, విద్యుత్ వాహనాల (ఈ.వి) యజమానుల నుండి వసూలు చేయదగిన సరసమైన టారిఫ్ వివరాలు తెలియజేయడానికి ఉపయోగపడే - మార్గదర్శకాలు

ఛార్జింగ్ స్టేషన్‌ ను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడం కోసం, భూమి వినియోగం కోసం రూపొందించిన - ఆదాయ భాగస్వామ్య నమూనా

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (పి.సి.ఎస్) అందుబాటులోకి తీసుకురావడానికి మరియు ఈ.వి. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రారంభించడానికి : నిర్ణీత కాల పరిమితులు

సర్వీస్ ఛార్జీల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాలి

Posted On: 15 JAN 2022 4:06PM by PIB Hyderabad

విద్యుత్ వాహనాల (ఈ.వి) ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం సవరించిన ఏకీకృత మార్గదర్శకాలు, ప్రమాణాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022 జనవరి, 14వ తేదీన ప్రకటించింది.  సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటులో ఉండే, సరసమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థలను నిర్ధారించడం ద్వారా భారతదేశంలో విద్యుత్ వాహనాలను వేగంగా వినియోగంలోకి తేవాలన్నది లక్ష్యం.  మొత్తం ఈ .వి. పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా దేశ ఇంధన భద్రత ప్రోత్సహించడంతో పాటు, ఉద్గార తీవ్రత తగ్గించడాన్ని, ఇది ప్రోత్సహిస్తుంది.

ఈ మార్గదర్శకాలు  ఎ) విద్యుత్ వాహనాల వ్యక్తిగత యజమానులకు బి) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ (పి.సి.ఎస్) లకు సంబంధించిన సమగ్ర నిబంధనలతో సహా సమగ్రంగా ఉంటాయి.  ఒక ముఖ్యమైన దశలో, యజమానులు వారి విద్యుత్ వాహనాలను వారి నివాసం / కార్యాలయాల వద్ద వారి ప్రస్తుత విద్యుత్ కనెక్షన్‌ లను ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు.  పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం అలాగే దీర్ఘకాలిక విద్యుత్ వాహనాలు మరియు / లేదా హెవీ డ్యూటీ విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం మౌలిక సదుపాయాల అవసరాలు వివరించడం జరిగింది.

ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ, లైసెన్స్ అవసరం లేకుండా, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ లను నెలకొల్పుకోవచ్చు.   అయితే, అటువంటి స్టేషన్లు సాంకేతిక, భద్రత మరియు పనితీరు ప్రమాణాలతో పాటు,  విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బి.ఈ.ఈ) మరియు కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సి.ఈ.ఏ) ద్వారా ఎప్పటికప్పుడు నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు, ప్రమాణాలు, ఇతర వివరణ ల క్రింద నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.   పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (పి.సి.ఎస్) ఏర్పాటుకు అవసరమైన సమాచారం సమగ్ర జాబితా కూడా వివరించడం జరిగింది.   సివిల్, విద్యుత్, భద్రతా అవసరాల కోసం "తగిన" మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిబంధనలను కూడా వీటిలో పేర్కొనడం జరిగింది. 

సాంకేతికత ఎక్కువగా అవసరం లేని ఛార్జింగ్ ప్రమాణాలు:  మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అంతర్జాతీయ ఛార్జింగ్ ప్రమాణాలతో పాటు, నూతన భారతీయ ఛార్జింగ్ ప్రమాణాలను కూడా పొందుపరచడం ద్వారా, సాంకేతికత ఎక్కువగా అవసరం లేని ఛార్జింగ్  మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. 

ఆదాయ భాగస్వామ్య విధానం ద్వారా పి.సి.ఎస్. ఏర్పాటు చేసుకోడానికి వీలుగా ప్రోత్సాహక ధరలతో స్థలం:  విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఛార్జింగ్ స్టేషన్లను ఆర్థికంగా లాభదాయకం గా  మార్చే సవాలును పరిష్కరించడానికి,  ఇందుకోసం ఉపయోగించే స్థలం కోసం ఆదాయ భాగస్వామ్య విధానాన్ని రూపొందించడం జరిగింది.  ప్రభుత్వ / పబ్లిక్ సంస్థల వద్ద అందుబాటులో ఉన్న భూమిని  పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం / పబ్లిక్ సంస్థలకు ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన ఒక కిలోవాట్ ఛార్జ్ కి / ఒక రూపాయి చొప్పున (ఛార్జ్ చేయడానికి ఉపయోగించిన) స్థిరమైన ధరను మూడు నెలలకు ఒక సారి చొప్పున అటువంటి పి.సి.ఎస్. వ్యాపారం నుండి భూ యాజమాన్య సంస్థ కు చెల్లించవలసి ఉంటుంది.  ఈ మార్గదర్శకాల కింద ఒక నమూనా ఆదాయ భాగస్వామ్య ఒప్పందం కూడా పొందుపరచడం జరిగింది.  అటువంటి ఆదాయ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రారంభంలో 10 సంవత్సరాల కాలానికి పార్టీలు కుదుర్చుకోవచ్చు.  పబ్లిక్ ల్యాండ్-ఓనర్ ఏజెన్సీ, ఒక ప్రైవేట్ సంస్థ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుచేసుకోడానికి అవసరమైన భూమిని అందించడానికి,  వేలం ప్రాతిపదికన ఒక కిలోవాట్ ఛార్జ్ కి / ఒక రూపాయి చొప్పున ప్రారంభ ధరతో  ఆదాయ భాగస్వామ్య విధానాన్ని అనుసరించవచ్చు.

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ (పి. సి.ఎస్) ఏర్పాటు చేయడానికి అనుసంధానం కోసం కాల పరిమితి :  విద్యుత్ (వినియోగదారుల హక్కులు) ప్రకారం కాల పరిమితులు నిర్దేశించడం జరిగింది.  దీని ప్రకారం, మెట్రో నగరాల్లో ఏడు రోజుల్లోగా,   ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో పదిహేను రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై రోజుల్లోగా, పి.సి.ఎస్. అందుబాటులోకి తీసుకురావాలి.   ఇదే కాల పరిమితిలో, పంపిణీ లైసెన్స్‌ దారులు కొత్త కనెక్షన్‌లను అందించాలి లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్‌ ని సవరించాలి.

ఈ.వి. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా కోసం ధరల పట్టిక :  పబ్లిక్ ఈ.వి. ఛార్జింగ్ స్టేషన్‌ లకు విద్యుత్ సరఫరా కోసం టారిఫ్ ఒక భాగంగానే ఉంటుంది.  2025 మార్చి, 31వ తేదీ వరకు వరకు “సరఫరా కంటే సగటు ధర” మించకూడదు.  అదే టారిఫ్ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్ (బి.సి.ఎస్) లకు కూడా వర్తిస్తుంది. గృహ వినియోగానికి వర్తించే ధరలే ఛార్జింగ్‌ కు కూడా వర్తిస్తాయి. 

సర్వీస్ ఛార్జీల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాలి :  రాయితీ ధరలపై విద్యుత్తు సరఫరా చేస్తున్న కారణంగా,  అదేవిధంగా, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం అనేక సందర్భాల్లో కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్న వాస్తవ పరిస్థితి కారణంగా, అటువంటి ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా వసూలు చేయవలసిన సర్వీసు ఛార్జీల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

అందరికీ అందుబాటులో :  ఏదైనా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ / ఛైన్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్‌ లు ఓపెన్ యాక్సెస్ ద్వారా ఏదైనా ఉత్పత్తి కంపెనీ నుండి విద్యుత్తును పొందవచ్చు. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఈ ప్రయోజనం కోసం ఓపెన్ యాక్సెస్ అందించబడుతుంది.  వారు వర్తించే సర్‌ ఛార్జ్‌ - ప్రస్తుత క్రాస్ సబ్సిడీ స్థాయికి సమానంగా (టారిఫ్ పాలసీ మార్గదర్శకాల ప్రకారం 20 శాతానికి మించకూడదు), ట్రాన్స్‌మిషన్ ఛార్జీలు మరియు వీలింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.  ఈ నిబంధనలో పేర్కొన చార్జీలు తప్ప, మరి ఏ ఇతర సర్‌ఛార్జ్ లేదా ఛార్జీలు విధించబడవు.

పబ్లిక్ ఈ.వి. ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు :  రాష్ట్ర నోడల్ ఏజెన్సీ (ఎస్.ఎన్.ఏ) లతో సంప్రదించి అన్ని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల జాతీయ ఆన్‌ లైన్ డేటాబేస్‌ ను, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బి.ఈ.ఈ) రూపొందించి, నిర్వహిస్తుంది.  దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల డేటాబేస్ కోసం ఒక వెబ్-పోర్టల్ / సాఫ్ట్‌-వేర్ / మొబైల్ యాప్ ను, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రూపొందిస్తుంది.  బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బి.ఈ.ఈ) వద్ద అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 1028 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (పి.సి.ఎస్.లు) ఉన్నాయి.  ఒక మిలియన్ కి పైగా జనాభా ఉన్న 9 ప్రధాన నగరాలైన - ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, కోల్ కతా, సూరత్, పూణే లలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సి.ఎన్.ఏ) గా వ్యవహరిస్తున్న బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బి.ఈ.ఈ),  కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ నగరాల్లో ఇప్పటి వరకు ఛార్జర్ల ఏర్పాటు కోసం సాధారణ (బి.ఏ.యు), ఓ మాదిరి, తీవ్రమైన స్థాయిల్లో వ్యాపారం వారీగా లక్ష్యాలను రూపొందించడం జరిగింది.  విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, ప్రమాణాల క్రింద అవసరాలు, ఈ నగరాల్లో విద్యుత్ వాహనాల (ఈ.వి) వృద్ధి అంచనాలు, ఈ.వి. ఛార్జింగ్ డిమాండ్‌ లో పెరుగుదల మొదలైన వాటి ఆధారంగా ఈ లక్ష్యాలను రూపొందించడం జరిగింది.  ప్రాథమిక అంచనాల ప్రకారం, 2030 నాటికి ఈ నగరాల్లో, బి.ఏ.యు. దృష్టాంతంలో మొత్తం 3263 ఛార్జర్‌ లు;  ఓ మాదిరి దృష్టాంతంలో 23,524 ఛార్జర్‌ లు;  తీవ్రమైన దృష్టాంతంలో 46,397 పీ.సీ.ఎస్‌. లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 

నెట్‌-వర్క్ సేవలు అందించేవారు :  విద్యుత్ వాహనాల యజమానులు ఛార్జింగ్ చేసుకోడానికి సమయాన్ని నమోదు చేసుకోడానికి వీలుగా అధునాతన రిమోట్ / ఆన్‌లైన్ బుకింగ్‌ కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్  కనీసం ఒక ఆన్‌-లైన్ నెట్‌-వర్క్ సర్వీస్-ప్రొవైడర్ (ఎన్.ఎస్.పి) తో ఒప్పందం కుదుర్చుకుని ఉండాలి. అటువంటి ఆన్‌-లైన్ సమాచారంలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కోసం స్థలం, ఎటువంటి ఛార్జర్లు, ఎన్ని ఏర్పాటు చేశారు / అందుబాటులో ఉన్నాయి, సర్వీస్ చార్జీలు వంటి వివరాలు విద్యుత్ వాహన యజమానుల కోసం పొందుపరచవలసి ఉంటుంది. 

పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ప్రదేశం:  విద్యుత్ వాహన యజమానుల ఆందోళనను తగ్గించడానికి వీలుగా, 3 కి.మీ. X 3 కి.మీ. ల పరిధిలో కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగింది.  అదేవిధంగా, రహదారులు /  ఇతర రోడ్లకు ఇరువైపులా ప్రతి 25 కి.మీ. కి ఒక ఛార్జింగ్ స్టేషన్‌ ను ఏర్పాటు చేయాలి.  దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యుత్ వాహనాలు మరియు  / లేదా బస్సులు / ట్రక్కులు మొదలైన హెవీ డ్యూటీ విద్యుత్ వాహనాల కోసం, ప్రతి 100 కి.మీ. లకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ప్రమాణాలతో కనీసం ఒక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి. ప్రధానంగా, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల లోపల / పక్కనే ఉన్న రహదారులు / రోడ్డుకు ఇరువైపులా కనీసం ఒకటి చొప్పున ఉండాలి.

ఈ.వి. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అందుబాటు: ఈ మార్గదర్శకాల ప్రకారం దశల వారీగా మౌలిక సదుపాయాల స్థాపన ఈ కింది విధంగా ఉంటుంది: 

దశ - I (1 నుండి 3 సంవత్సరాలు):   2011 జనాభా లెక్కల ప్రకారం 4 మిలియన్లకు పైగా జనాభా కలిగిన అన్ని మెగా నగరాలు; ఈ మెగా సిటీలకు అనుసంధానమై ఉన్న అన్ని ఎక్స్‌-ప్రెస్‌ రహదారులతో పాటు, ప్రతి మెగా సిటీ తో అనుసంధానమై ఉన్న ముఖ్యమైన రహదారులను కూడా ఇందుకోసం తీసుకోవచ్చు.  ఈ మెగా సిటీలతో పాటు, వీటితో అనుసంధానమైన ఎక్స్‌-ప్రెస్‌ రహదారుల జాబితా సిద్ధం చేయడం జరిగింది. 

దశ - II (3 నుండి 5 సంవత్సరాలు): రాష్ట్ర రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన  ప్రధాన కేంద్రాల వంటి పెద్ద నగరాలను కూడా పంపిణీ మరియు ప్రదర్శన ప్రభావం కోసం చేపట్టవచ్చు.  అదేవిధంగా, వీటిలో ప్రతి ఒక్క మెగా సిటీ తో అనుసంధానమై ఉన్న ముఖ్యమైన రహదారులను కూడా ఇందుకోసం చేపట్టవచ్చు. 

కేంద్ర నోడల్ ఏజెన్సీ:  ఈ.వి. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రారంభించడానికి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బి.ఈ.ఈ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ గా ఉంటుంది.  కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ (సి.ఈ.ఏ) తో సహా అన్ని సంబంధిత ఏజెన్సీ లు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ కి అవసరమైన సహాయాన్ని అందజేస్తాయి.  ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్రం కోసం ఒక నోడల్ ఏజెన్సీ ని నియమిస్తుంది.  అటువంటి ప్రయోజనాల కోసం రాష్ట్ర డిస్కామ్ సాధారణంగా నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తుంది.   అయితే, రాష్ట్ర ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీ గా పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్.బి. లు); పట్టణ / ప్రాంతీయ అభివృద్ధి సాధికార సంస్థల వంటి వాటితో సహా ఏదైనా ఒక  కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ (పి.ఎస్.యు) ను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉంటుంది.

2019 అక్టోబర్ 1వ తేదీన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సవరించిన “విద్యుత్తు వాహనాలకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలూ - మార్గదర్శకాలు, ప్రమాణాలు” మరియు 2020 జూన్, 8వ తేదీన జారీచేసిన తదుపరి సవరణల స్థానంలో, ఈ మార్గదర్శకాలు, ప్రమాణాలు భర్తీ చేస్తాయి.  పూర్తి మార్గదర్శకాలను విద్యుత్ మంత్రిత్వ శాఖ వెబ్‌-సైట్‌ లో చూడవచ్చు. 

"గో ఎలక్ట్రిక్" ప్రచారం:     ఇ-మొబిలిటీ పరివర్తన కోసం భారత ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా,  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో పాటు విద్యుత్ మంత్రిత్వ శాఖ,  భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ; నీతి ఆయోగ్ కలిసి సంయుక్తంగా,  ఇ-మొబిలిటీ ప్రయోజనాలపై సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడానికి;   విద్యుత్ వాహనాలను వినియోగించేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి భవిష్యత్తు లో విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే యజమానులకు తెలియజేయడానికి; ఉత్సుకతను సృష్టించి, దానిని డిమాండ్‌గా మార్చండం కోసం;  విద్యుత్ వాహనాల పై తప్పుడు సమాచారాన్ని తిప్పి కొట్టడానికి; బహుళ వాటాదారులందరినీ ఒకే వేదిక పైకి తీసుకు రావడానికి;  దేశవ్యాప్తంగా "గో ఎలక్ట్రిక్" ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది.  దేశవ్యాప్తంగా, రేడియో జింగిల్స్,  ఈ.వి. కార్నివాల్, హోర్డింగ్‌లు, కరపత్రాలు, విద్యుత్ బిల్లులపై ప్రకటనలతో సహా; రాష్ట్ర నోడల్ ఏజెన్సీ (ఎస్.ఎన్.ఏ) లు దాదాపు 15 రోడ్‌షోలు, 35 వెబినార్లతో పాటు, అనేక ఇతర అవగాహన కార్యక్రమాలను నిర్వహించాయి.

 

*****



(Release ID: 1790275) Visitor Counter : 260