ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ.4,500 కోట్లకు పైగా విలువైన నకిలీ ఇన్ వాయిస్ నెట్ వర్క్ ను చేదించిన డిజిజిఐ అధికారులు; ఒకరి అరెస్టు
Posted On:
14 JAN 2022 5:28PM by PIB Hyderabad
ఇటీవల కొన్ని నకిలీ సంస్థలపై డిజిజిఐ కేసు నమోదు చేసింది, అవి వారి ప్రధాన వ్యాపార స్థలంలో లేవు. ఈ నకిలీ సంస్థల వెనుక ఉన్న అసలు వ్యక్తులను జిఎస్టి రిటర్న్ లు దాఖలు చేసిన చిరునామా ఆధారంగా గుర్తించారు.
ఆ తర్వాత ఢిల్లీలోని ఆ సంస్థలో 06.01.2022న సోదాలు జరిపారు. ఈ సోదాల్లో, యజమాని తన సర్వర్లలో 'క్లౌడ్ స్టోరేజీ' సేవలను వివిధ వినియోగదారులకు వారి ఆర్థిక ఖాతాలను నిర్వహించడానికి అందించినట్లు కనుగొన్నారు.
అనుమానాస్పద సర్వర్ లో ఒక దానిని
పరిశీలించగా, కొన్ని సంస్థల వివరాలు టాలీ డేటాలో కనుగొన్నారు. కోల్ కతా కేంద్రంగా ఉన్న ఒక సిండికేట్ ఈ టాలీ డేటా నిర్వహిస్తున్నట్టు యజమాని తెలిపాడు. ఈ వ్యక్తుల చిరునామా వివరాలను ప్రొప్రైటర్ నుంచి తీసుకున్నారు. తరువాత 10.01.2022 న కోల్ కతాలోని వివిధ చోట్ల తనిఖీలు నిర్వహించారు.
Sodala సమయంలో మొబైల్స్ ఫోన్లు, వివిధ చెక్కు పుస్తకాలు, వివిధ సంస్థల స్టాంపులు , సిమ్ కార్డులతో సహా భారీ మొత్తంలో నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యక్తుల ఎలక్ట్రానిక్ పరికరాలు, డాక్యుమెంట్ లు, మొబైల్స్ , ఇ-మెయిల్ విశ్లేషణలో వారు ఢిల్లీలోని సంస్థలో కనుగొన్న సర్వర్ పై డేటాను రిమోట్ గా నిర్వహిస్తున్నారని వెల్లడయింది.
టాలీ డేటా పరిశీలన లో ఈ సిండికేట్ ద్వారా 636 సంస్థలు నిర్వహించబడుతున్నాయని వెల్లడయింది. ఈ సంస్థలలో ఇన్ వాయిస్ లను మాత్రమే జారీ చేశారని , వారికి వ్యతిరేకంగా ఎటువంటి వస్తువులను సరఫరా చేయలేదని సిండికేట్ సూత్రధారి అంగీకరించారు.పన్ను పరిధిలో ఉండే సుమారు 4,521 కోట్ల విలువతో కూడిన ఇన్ వాయిస్ లను వారు జారీ చేశారు. వీటి ఐటిసి ప్రభావం సుమారు 741 కోట్లు.
దర్యాప్తు సందర్భంగా, ఈ సంస్థల ఐటిసి లెడ్జర్ లో అందుబాటులో ఉన్న ఐటిసిని తారుమారు చేయడం ద్వారా రూ.4.52 కోట్ల మేర జిఎస్ టి డిపాజిట్ చేశారు. ఇంకా, ఇప్పటి వరకు సుమారు. ఈ సంస్థల వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.7 కోట్ల ను స్తంభింప చేశారు. మొత్తం కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారిని 13-01-2022 న అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉంది.
****
(Release ID: 1790262)
Visitor Counter : 192