భారత ఎన్నికల సంఘం

అన్ని భౌతిక ర్యాలీలు, రోడ్‌షోల‌పై 22 జ‌న‌వ‌రి 2022 వ‌ర‌కు నిషేధాన్ని పొడిగించిన భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్‌


గ‌రిష్టంగా 300 మంది వ్య‌క్తుల‌తో లేదా హాల్ సామ‌ర్ధ్యంలో 50% లేదా ఎస్‌డిఎంఎ నిర్దేశించిన ప‌రిమితుల మేర‌కు రాజ‌కీయ పార్టీలు ఇన్‌డోర్ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు స‌డ‌లింపును మంజూరు చేసిన ఇసిఐ

ఎంసిసి నిబంధ‌న‌లు, కోవిడ్ విస్తృత మార్గ‌ద‌ర్శ‌కాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని రాజ‌కీయ పార్టీల‌ను ఆదేశించిన ఇసిఐ

ఎంసిసి, కోవిడ్‌కి సంబంధించిన అన్ని ఆదేశాల‌కు క‌ట్టుబ‌డి ఉండేలా చూడాల‌ని రాష్ట్ర‌/ జిల్లా అధికారుల‌ను నిర్దేశించిన ఇసిఐ

Posted On: 15 JAN 2022 6:09PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌, గోవా, మ‌ణిపూర్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌కార్య‌ద‌ర్శులు, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులతో  పాటు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న రాష్ట్రాల ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారుల‌తో వేర్వేరుగా శ‌నివారం దృశ్య‌మాధ్య‌మం ద్వారా భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌మావేశాలు నిర్వ‌హించింది. 
ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌నున్న ఐదు రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టితో కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌స్తుత ప‌రిస్థితి, అంచ‌నా వేసిన స‌ర‌ళుల‌పై సంబంధిత రాష్ట్ర‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు, భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు శ్రీ రాజీవ్ కుమార్‌, శ్రీ అనూప్ చంద్ర పాండే, సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్‌తో క‌లిసి  ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శ్రీ సుశీల్ చంద్ర స‌మ‌గ్ర స‌మీక్ష చేశారు. వాక్సినేష‌న్  స్థితిగ‌తులు,  ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్స్‌, పోలింగ్ సిబ్బందిలో అర్హులైన వ్య‌క్తుల‌కు  1,2వ‌, బూస్ట‌ర్ డోస్‌ను వేగ‌వంతంగా పూర్తి చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను కూడా స‌మీక్షించారు. 
దీనితోపాటుగా, క‌మిష‌న్ ఎస్‌డిఎంఎ నిర్బంధాలు, మ‌హ‌మ్మారి కాలంలో వ్య‌క్తులు గుమిగూడ‌డాన్ని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించే విధంగా నిర్ధిష్ట రాష్ట్రాల నిబంధ‌న‌ల‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడా క‌మిష‌న్ చ‌ర్చించింది. 
ఇప్పుడు, ఈ స‌మావేశాల‌లో అందుకున్న ఇన్‌పుట్ల‌ను,  ప్ర‌స్తుత ప‌రిస్థితిని, వాస్త‌వాల‌ను, స్థితిగ‌తుల‌ను ప‌రిగ‌ణించిన త‌ర్వాత‌, క‌మిష‌న్ దిగువ‌న పేర్కొన్న విధంగా ఆదేశాలు జారీ చేసింది.

జ‌న‌వ‌రి 22, 2022 వ‌ర‌కు రోడ్ షోలు, పాద‌యాత్ర‌ల‌ను, సైకిల్/  బైక్‌/  వాహ‌నాల ర్యాలీల‌కు కానీ, ఊరేగింపుల‌కు కానీ అనుమ‌తిలేదు.
త‌ద‌నంత‌రం క‌మిష‌న్ ప‌రిస్థితిని స‌మీక్షించి, అందుకు అనుద‌గుణంగా త‌దుప‌రి ఆదేశాల‌ను జారీ చేస్తుంది. 
రాజ‌కీయ పార్టీలు లేదా అభ్య‌ర్ధులు (సంభావిత‌) లేదా ఎన్నిక‌ల‌తో సంబంధం క‌లిగిన గ్రూపు కానీ భౌతిక ర్యాలీల‌ను 22 జ‌న‌వ‌రి 2022 వ‌ర‌కు అనుమ‌తి లేదు.
అయితే,  గ‌రిష్టంగా 300 మంది వ్య‌క్తులు లేదా హాల్ సామ‌ర్ధ్యంలో 50% లేదా ఎస్‌డిఎంఎ నిర్దేశించిన ప‌రిమితుల‌కు లోబ‌డి ఇన్‌డోర్ స‌మావేశాల‌ను నిర్వ‌హించేందుకు రాజ‌కీయ పార్టీల‌కు క‌మిష‌న్ స‌డ‌లింపును ఇచ్చింది. 
ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్వ‌హించే కార్య‌క‌లాపాల సంద‌ర్భంగా ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి, కోవిడ్‌కు త‌గిన ప్ర‌వ‌ర్త‌న‌, మార్గ‌ద‌ర్శ‌కాల‌కు రాజ‌కీయ పార్టీలు త‌ప్ప‌నిస‌రిగా క‌ట్టుబ‌డాలి. 
జ‌న‌వ‌రి 8, 2022న జారీ చేసిన ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం స‌వరించిన విస్తృత మార్గ‌ద‌ర్శ‌కాలు, 2022లో పొందుప‌రిచిన ఇత‌ర ప‌రిమితులు అన్నీ కొన‌సాగుతాయి. 
సంబంధిత అన్ని రాష్ట్ర‌/  జిల్లా అధికారులు ఈ నిర్దేశాల‌ను సంపూర్ణంగా పాటించేలా చూడాలి. 

***



(Release ID: 1790211) Visitor Counter : 133