మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పరీక్షా పే చర్చ 2022లో విస్తృతంగా పాల్గొనాలని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు

Posted On: 13 JAN 2022 6:23PM by PIB Hyderabad

"పరీక్ష పే చర్చ 2022" -5వ ఎడిషన్‌లో పాల్గొని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా మార్గదర్శకత్వం వహించే అవకాశాన్ని పొందవలసిందిగా కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆహ్వానించారు.

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ. జీవితాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవ‌డానికి ప‌రీక్షల నుండి ఉత్పన్నమయ్యే ఒత్తిడిని చర్చించి, అధిగమించడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విదేశాల నుండి కూడా ఆయనతో సంభాషించే విశిష్టమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ - పరీక్షా పే చర్చా అనే కార్యక్రమాన్ని రూపొందించారు. పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఈవెంట్ విజయవంతంగా నిర్వహిస్తుంది.

ఈ ప్రోగ్రామ్ ఫార్మాట్ 2021లో వలె ఆన్‌లైన్ మోడ్‌లో ఉండాలని ప్రతిపాదించారు. ఆన్‌లైన్ సృజనాత్మక రచనల పోటీని https://innovateindia.mygov.in/ppc-2022/లో 28 డిసెంబర్ నుండి 20 జనవరి 2022 వరకు వివిధ అంశాలపై నిర్వహించ తలపెట్టారు   ఎంపికైన విజేతలు అడిగే ప్రశ్నలు పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రదర్శితమౌతాయి.

9 నుండి 12 తరగతుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు  తల్లిదండ్రులను ఆన్‌లైన్ పోటీ ద్వారా ఎంపిక చేస్తారు.

https://innovateindia.mygov.in/ppc-2022/లో రిజిస్ట్రేషన్‌లు 28 డిసెంబర్ 2021 నుండి 20 జనవరి 2022 వరకు దిగువ జాబితా చేయబడిన థీమ్‌లపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు

 విద్యార్థుల కోసం థీమ్‌లు:

COVID-19 సమయంలో పరీక్ష ఒత్తిడి నిర్వహణ వ్యూహాలు

ఆజాదీ కా అమృత్ మహోస్తావ్

స్వావలంబన భారత్  కోసం స్వయం-సంవృద్ది  పాఠశాల

క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా తరగతి గదులలో డిజిటల్ సహకారం

పర్యావరణ పరిరక్షణ వాతావరణ మార్పు కాపాడడం

 ఉపాధ్యాయుల కోసం థీమ్‌లు:

a. నయా భారత్ కోసం జాతీయ విద్యా విధానం (NEP).

COVID-19 మహమ్మారి: అవకాశాలు-సవాళ్లు

 తల్లిదండ్రుల కోసం థీమ్‌లు:

బేటీ పఢావో, దేశ్ బఢావో

లోకల్ టు గ్లోబల్ - వోకల్ ఫర్ లోకల్

లెర్నింగ్ కోసం జీవితకాల విద్యార్థుల ఆరాటం

MyGov లో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2050 మంది పాల్గొనేవారికి డైరెక్టర్, NCERT నుండి ప్రశంసా పత్రం తో పాటు ప్రధాన మంత్రి వ్రాసిన హిందీ మరియు ఆంగ్ల భాషలలో పరీక్షా వారియర్స్ పుస్తకం తో కూడిన ప్రత్యేక పరీక్షా పే చర్చా కిట్‌ను అందజేస్తారు. దేశం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

***



(Release ID: 1790078) Visitor Counter : 134