సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ రోజు బైక్ యాత్రను ప్రారంభించిన శ్రీమతి మీనాక్షి లేఖి

Posted On: 13 JAN 2022 3:48PM by PIB Hyderabad

సాంస్కృతిక మరియు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి. మీనాక్షి ఈరోజు న్యూ ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బైక్ ఎక్స్‌పెడిషన్‌ను ప్రారంభించారు. భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని ప్రోత్సహించడానికి పని చేసే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు అమేజింగ్ నమస్తే ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

image.png
ఈ సందర్భంగా శ్రీమతి మీనాక్షి లేఖి మాట్లాడుతూ.. " ఈశాన్యం అనేది ప్రదర్శించాల్సిన ఆంశం.. ప్రజలంతా ఒక్కటిగా ఉంటే భిన్నత్వంలో ఏకత్వం వెల్లివిరుస్తుంది. ఈ దేశంలో రాజ్యాంగం ద్వారా రక్షించబడిన 166 విభిన్న తెగలు మరియు సంప్రదాయాలతో ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి. ఒకే ప్రజలు, ఒకే దేశం, వైవిధ్యాన్ని జరుపుకుంటామని శ్రీమతి లేఖి తెలిపారు. “ఆజాదీ  కా అమృత్ మహోత్సవ్ దేశంలోని మంచిని మరియు మన ప్రజలు ఆరాధించేవన్నీ జరుపుకోవడానికి ఒక సందర్భం. ఈ వేడుకలన్నింటికీ ప్రపంచ గుర్తింపు కావాలి” అని సహాయ మంత్రి తెలిపారు.

 

image.png

ఆగ్నేయాసియాకు ఈశాన్యం గేట్ వే అని దీనిపై కృషి చేయాల్సి ఉందని శ్రీమతి లేఖి అన్నారు. వీటన్నింటిని ఒకచోట చేర్చినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరియు ఈ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తున్న 75 మంది బైకర్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

image.png0b528e5e-8463-47e2-a923-37f6e459bedc.png
 
నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్ (ఎన్‌ఈడబ్లు) ఎక్స్‌పెడిషన్’ ఏప్రిల్ 8-16, 2022 మధ్య ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు గుర్తుగా షెడ్యూల్ చేయబడింది. ఈ సాహసయాత్రలో పాల్గొనే 75 మంది బైకర్లు దేశం నలుమూలల నుండి ఎంపిక చేయబడి 6 గ్రూపులను ఎంపిక చేశారు.ఈశాన్య ప్రాంతంలో సుమారు 9000 కి.మీ. సాగే ఈ యాత్ర ముఖ్యంగా దృష్టి సారించి పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క దేఖో అప్నా దేశ్ చొరవను కూడా ప్రోత్సహిస్తుంది. రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతపై దృష్టి సారించే సందేశాన్ని కూడా రైడర్స్ తీసుకువెళతారు.

"లుక్ ఈస్ట్" విధానాన్ని "యాక్ట్ ఈస్ట్" విధానంగా మార్చడానికి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేతలతో కూడిన ఎజెండాకు సూచన. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు ప్రాజెక్టులు, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి ఆర్థిక కార్యకలాపాల గురించి ఇతర అభివృద్ధికి సంబంధించిన ఆంశాల గురించి మాట్లాడుతున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన చాలా మంది యువకులు నేడు క్రీడలు, వ్యవస్థాపకత, సామాజిక సంస్థ మొదలైనవాటిలో దేశవ్యాప్తంగా ఇతరులకు రోల్ మోడల్‌గా ఉన్నారు.


 

*******



(Release ID: 1789837) Visitor Counter : 100