జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్
రక్షణ కార్యకలాపాలలో ప్రాంతీయ భద్రతా సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకోవడం, డీప్/ డార్క్ వెబ్ నిర్వహణ, డిజిటల్ ఫోరెన్సిక్స్‌పై తొలి కొలొంబో భద్రతా సమావేశంలో వర్చువల్ వర్క్‌షాప్
Posted On:
11 JAN 2022 4:47PM by PIB Hyderabad
రక్షణ కార్యకలాపాలలో ప్రాంతీయ సైబర్ భద్రతా సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకోవడం, డీప్/ డార్క్ వెబ్ నిర్వహణ, డిజిటల్ ఫారెన్సిక్స్ అన్న అంశం పై తొలి కొలొంబో భద్రతా సమావేశంలో దృశ్యమాధ్యమం ద్వారా భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ భద్రతా మండలి సచివాలయం (నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియేట్), గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న జాతీయ ఫోరెన్సక్స్ సైన్స్ యూనివర్సిటీ, కొలొంబో భద్రతా సమావేశ సచివాలయంతో కలిసి 10-11 జనవరి 2022లో రెండు రోజులపాటు నిర్వహించింది.
కొలోంబో భద్రతా సమావేశం (సిఎస్‌సి) సభ్య దేశాల నుంచి ప్రతినిధులు, పరిశీలక దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ వర్క్‌షాప్‌లో శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియా, మారిషస్, సీషెల్స్, బాంగ్లాదేశ్ పాలుపంచుకున్నాయి.
సముద్రతీర భద్రత, పరిరక్షణ, తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రబలడం, అక్రమరవాణా, వ్యవస్థీకృత నేరాలు, సైబర్ భద్రత, కీలక మౌలికసదుపాయాలకు రక్షణ సహా సహకారానికి సంబంధించిన నాలుగు స్తంబాలపై 04 ఆగస్టు 2021న జరిగిన 5వ డిప్యూటీ ఎన్ ఎస్ ఎ స్థాయి కొలొంబో భద్రతా సమావేశంలో సభ్య, పరిశీలక దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. నాలుగవ స్తంభం ప్రారంభ కార్యకలాపంలో భాగమే వర్క్‌షాప్. డీప్ వెబ్, డార్క్ నెట్ దర్యాప్తు - సవాళ్ళు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ ముప్పుపై నిఘా, సైబర్ రంగంలో రక్షణ కార్యకలాపాలు అన్న కీలక అంశాలపై సమావేశం చర్చించింది. చర్చలు సాంకేతిక పురోగతులు, పరిశోధనా సవాళ్ళు, ఈ రంగంలో వైఖరులపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. సైబర్ భద్రతకు ముప్పు అంశాన్ని తాము ఎలా నిర్వహించామనే విషయంపై పాల్గొన్న సభ్యులు తమ అనుభవాలను పంచుకుంటూ, నిర్ధిష్ట సైబర్ భద్రతా సవాళ్ళకు పరిష్కారాలను చర్చించారు.
కొలొంబో భద్రతా సమావేశం కింద సైబర్ భద్రతపై సహకారం కోసం కీలక అంశాలు, ప్రతిపాదనలను (డెలివరబుల్స్) గుర్తించి, ఈ అంశాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు భాగస్వాములు అంగీకరించారు.
***
(Release ID: 1789172)
Visitor Counter : 172