సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూస్ఆన్ఎయిర్ రేడియో లైవ్ స్ట్రీమ్ ఇండియా ర్యాంకింగ్స్


- డిసెంబర్ 2021లో న్యూస్ఆన్ఎయిర్ శ్రోత‌ల సంఖ్య 2 మిలియన్ల‌కు పెరిగింది

నాడు పోస్టు చేయడమైనది: 10 JAN 2022 12:30PM by PIB Hyderabad

రేడియో ప్రపంచంలో మొట్ట‌మొద‌టిసారిగా 'ప్రసార భారతి ఆడియన్స్ రీసెర్చ్ బృందం' శ్రోతల సంఖ్యను సంపూర్ణ సంఖ్యలో లెక్కించడం జరిగింది. న్యూస్ఆన్ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌ శ్రోతల సంఖ్య ఒక నెల వ్యవధిలో 2 మిలియన్లకు పెరిగింది. డిసెంబర్ 2021లో 18 మిలియన్ల మంది శ్రోతలు న్యూస్ఆన్ఎయిర్ యాప్‌ని ట్యూన్ చేశారు, నవంబర్‌లో వారి సంఖ్య 16 మిలియన్లుగా ఉంది.  న్యూస్ఆన్ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌ల నగరాల వారీగా నెలవారీ శ్రోతల లెక్కింపులో పూణే, బెంగళూరు, ఇండోర్, నాగ్‌పూర్‌లలో శ్రోతల సంఖ్య మిలియన్‌లో ఉండగా, పాట్నా, లక్నో మరియు ఢిల్లీ ఎన్‌సీఆర్ మిలియన్‌కు దగ్గరగా ఉంది. న్యూస్ఆన్ఎయిర్ యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లు అత్యంత ప్రజ‌ల ఆదరణ పొందాయి. భారతదేశంలోని అగ్ర నగరాల తాజా ర్యాంకింగ్స్‌లో జైపూర్ టాప్ లిస్ట్ నుండి ఎర్నాకులం స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా పునరాగమనం చేసింది. భారతదేశంలోని అగ్రశ్రేణి ఏఐఆర్  స్ట్రీమ్‌ల ర్యాంకింగ్‌లలో భారీ మార్పులు జ‌రిగాయి. ఎఫ్ఎం రెయిన్‌బో ముంబై మొదటి 10 స్థానాల్లోకి తిరిగి చేరింది. ఏఐఆర్‌ న్యూస్ 24*7 జాబితాలో చోటు ద‌క్క‌కుండా పోయింది.
ఏఐఆర్‌ పూణే 9వ స్థానం నుండి 3వ స్థానానికి ఎగబాకగా, ఏఐఆర్ మలయాళం 3వ ర్యాంక్ నుండి 7వ స్థానానికి దిగజారింది. ఆల్ ఇండియా రేడియో యొక్క 240 కంటే ఎక్కువ రేడియో సేవలు ప్రసార భారతి యొక్క అధికారిక యాప్ న్యూస్ఆన్ ఎయిర్‌
లో ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. న్యూస్ఆన్ఎయిర్  యాప్‌లోని ఈ ఆల్ ఇండియా రేడియో స్ట్రీమ్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ దేశాల్లో శ్రోతలను కలిగి ఉన్నాయి.
'ప్రసార భారతి ఆడియన్స్ రీసెర్చ్ బృందం' లెక్కింపులో న్యూస్ఆన్ఎయిర్  యాప్‌లో ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లు అత్యంత జనాదరణ పొందిన భారతదేశంలోని అగ్ర నగరాలను చూడోచ్చు.  టాప్ 10 నగరాల్లో నెలవారీ శ్రోతల సంఖ్యను కూడా తెలుసుకోవ‌చ్చు  భారతదేశంలో న్యూస్ఆన్ఎయిర్  యాప్‌లో అగ్ర ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమ్‌లు మరియు నగరాల వారీగా వివ‌రాల‌ను కూడా తెలుసుకోవచ్చు. ఈ ర్యాంకుల‌ను డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 31, 2021 వరకు అందుబాటులో ఉన్న స‌మాచారం ఆధారంగా రూపొందించారు. 

 

***

 


(రిలీజ్ ఐడి: 1789076) సందర్శకుల సూచీ సంఖ్య : : 172
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil