హోం మంత్రిత్వ శాఖ
డిసెంబర్ 26వ తేదీని "వీర్ బాల్ దివాస్"గా జరుపుకోవాలని నిర్ణయించిన - భారత ప్రభుత్వం
प्रविष्टि तिथि:
09 JAN 2022 8:47PM by PIB Hyderabad
10వ సిక్కు గురు గోవింద్ సింగ్ జీ కుమారులైన 9 సంవత్సరాల సాహిబ్ జాదా జోరావర్ సింగ్ మరియు 6 సంవత్సరాల సాహిబ్ జాదా ఫతే సింగ్ అతిచిన్న వయసులో సిక్కుమతం యొక్క గొప్పతనం, గౌరవాలను కాపాడటానికి 1705 డిసెంబర్ 26వ తేదీన చేసిన అత్యున్నత, అసమానమైన త్యాగానికి గౌరవ సూచకంగా డిసెంబర్ 26వ తేదీని "వీర్ బాల్ దివస్"గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" జరుపుకుంటున్న నేపథ్యంలో, న్యాయం కోసం అన్వేషణలో సాహిబ్ జాదా జోరావర్ సింగ్ మరియు సాహిబ్ జాదా ఫతే సింగ్ ప్రదర్శించిన గొప్ప పరాక్రమానికీ, అత్యున్నత త్యాగాన్నీ స్మరించుకుంటూ, భారత దేశం మరియు ప్రజలు కృతజ్ఞత తో సమర్పిస్తున్న వందనం మరియు నివాళి.
*****
(रिलीज़ आईडी: 1788854)
आगंतुक पटल : 222