శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జమ్మూ-కశ్మీర్ లో కోవిడ్ మహమ్మారి సంసిద్ధతను సమీక్షించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 08 JAN 2022 4:50PM by PIB Hyderabad

జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో కరోనా మహమ్మారి సంసిద్ధతను, కేంద్ర సహాయ (స్వతంత్ర హోదా) శస్త్ర, సాంకేతిక శాఖ; సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) భూ విజ్ఞాన శాస్త్ర శాఖ; ప్రధానమంత్రి కార్యాలయం; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు; పింఛన్లు,; అణు విద్యుత్తు; అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ఈరోజు సమీక్షించారు.

జమ్మూ నుండి శ్రీనగర్ వరకు వివిధ జిల్లాలతో పాటు, కశ్మీర్, జమ్మూలోని రెండు డివిజనల్ ప్రధాన కార్యాలయాలు పాల్గొన్న ఈ ఉన్నత స్థాయి ఆన్‌-లైన్ సమావేశంలో, కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ,  ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా మూడో దశ వ్యాప్తికి సంబంధించిన వాస్తవ తాజా సమాచారం కోసం ప్రత్యకంగా ఒక "డ్యాష్‌-బోర్డ్‌" ను ఏర్పాటు చేయాలని సూచించారు.  మూడవ దశ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆయన అనేక ఇతర సూచనలను కూడా జారీ చేశారు.

ఈ సమావేశంలో -  జమ్మూ డివిజనల్ కమీషనర్, డాక్టర్ రాఘవ్ లాంగర్; కశ్మీర్ డివిజనల్ కమీషనర్, పాండు రంగ్ పోల్;  జమ్మూ మేయర్ చంద్రమోహన్ గుప్తా;  శ్రీనగర్ మేయర్  జునైద్ మట్టూ,  ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సలీం రెహ్మాన్,  వివిధ జిల్లాల డి.డి.సి. చైర్మన్లు,  పుర పాలక మండళ్ళ అధిపతులు; జిల్లా అభివృద్ధి కమీషనర్లతో పాటు; ఇతర సంబంధిత అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

కశ్మీర్ డివిజనల్ కమీషనర్, పాండు రంగ్ పోల్, జమ్మూ డివిజనల్ కమీషనర్, డాక్టర్ రాఘవ్ లాంగర్; ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ రెండు డివిజన్లలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కి తెలియజేశారు.  కాశ్మీర్ డివిజన్‌ లో, ఇప్పటివరకు, జీనోమ్-సీక్వెన్సింగ్ కోసం పరీక్షకు పంపిన కేసులలో, ఒక్క కేసు కూడా ఒమిక్రాన్ కేసు గా గుర్తించడం జరగలేదు. కానీ, జమ్మూ డివిజన్‌ లో మూడు కేసులు నమోదయ్యాయి.  కిష్త్వార్ వంటి జిల్లాల్లో కొన్ని సుదూర ప్రాంతాలు మినహా టీకాలు వేసే  ప్రక్రియ దాదాపు పూర్తయింది. 

శ్రీనగర్ డి.సి.,  మొహమ్మద్ ఐజాజ్; రాంబన్ డి.సి. ముస్సరత్ ఇస్లాం కూడా తమ తమ జిల్లాల్లో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలియజేశారు. 

ఎప్పటి కప్పుడు వాస్తవ తాజా సమాచారం కోసం డివిజనల్ కమీషనర్ జమ్మూ మరియు డివిజనల్ కమీషనర్ కశ్మీర్ కార్యాలయాల్లో, కనీసం ఒక్కొక్కటి చొప్పున "డాష్-బోర్డ్‌" ను ఏర్పాటు చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు.  ఇవి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోడంతో పాటు, అనుసరించడానికి అనువైన రోజువారీ సమాచారాన్ని కూడా అందించవచ్చు.  సామాన్యుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు ఒక "హెల్ప్‌-లైన్‌-సర్వీస్" ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.

కొన్ని సందర్భాల్లో, జిల్లా పరిపాలనా విభాగం మరియు ఆరోగ్య శాఖ మధ్య సమాచార ప్రసారంలో జాప్యం జరుగుతోందని గమనించిన డాక్టర్ జితేంద్ర సింగ్, సంబంధిత వారందరితో ఒక "వాట్సాప్-గ్రూప్‌" ను ఏర్పాటు చేయాలని సూచించారు.  ఇప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మన పనితీరు మరియు సేవలు అందించడంలో చాలా మెరుగుదల సాధించవచ్చని ఆయన అన్నారు. 

ప్రస్తుతానికి, మూడవ దశలో కరోనా సోకిన వ్యక్తులు ఎటువంటి ప్రత్యేక రోగ లక్షణాలు లేకుండా, ఫ్లూ వంటి స్వల్ప రోగ లక్షణాలతో ఉన్నారని, 4-5 రోజుల్లో వీరికి  స్థిరంగా తగ్గుతోందని, డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.  అయితే, ఆత్మ సంతృప్తి చెందడానికి ఆస్కారం లేదని, ఎందుకంటే రెండవ దశలో కూడా, తరువాతి వారాల్లో పెరుగుదల కనబడిందని ఆయన గుర్తుచేస్తూ,   అదేవిధంగా, ప్రస్తుతం మనం ఈ వారంలో  ఎదుర్కొంటున్న మహమ్మారి స్వభావం, రాబోయే కొన్ని వారాల గమనాన్ని నిర్ధారిస్తుందని ఆయన చెప్పారు.  

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, 2020 ప్రారంభంలో మొదటి దశ సమయంలో, వివిధ జిల్లాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడానికి, అదేవిధంగా, కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఒక క్రమబద్ధమైన సమన్వయం కోసం ఒక సాధారణ యంత్రాంగం ఉండేదని చెప్పారు.  అవసరమైతే అదే యంత్రాంగాన్ని రూపొందిస్తామని చెప్పారు.  అయితే, అదే సమయంలో పరిపాలనలోని కార్యనిర్వాహకులు మరియు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు,  ఏదైనా సమన్వయం లేదా జోక్యం అవసరమైనప్పుడు,  తన  కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని ఆయన తెలియజేశారు. 

జమ్మూలో రాత్రి పూట కర్ఫ్యూ విధించబడినప్పటికీ, ఢిల్లీ-ఎన్‌.సి.ఆర్. తరహాలో వారాంతపు లాక్‌-డౌన్ విధించడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రికి తెలియజేశారు. 

"జీనోమ్-సీక్వెన్సింగ్" సదుపాయాన్ని వేగవంతం చేయాలనే డిమాండ్ పై, ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ స్పందిస్తూ ఈ దిశగా ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. 

*****



(Release ID: 1788685) Visitor Counter : 155