ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మణిపూర్ - త్రిపుర మధ్య మొదటి జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డిఒఎన్ ఇఆర్), సంస్కృతి ,పర్యాటక శాఖ ల మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి


ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణీకుల అనుసంధానం, వాణిజ్యం , పర్యాటక రంగాల భారీ వృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తాయన్న కేంద్ర మంత్రి

మొత్తం రూ.56,553 కోట్ల వ్యయంతో చేపట్టిన 14 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ప్రస్తావించిన కేంద్ర మంత్రి

2014-2015 లో రూ.36,107.56 కోట్ల నుండి 2020-2021 లో రూ.68,020 కోట్లకు గత 7 సంవత్సరాలలో బడ్జెట్ కేటాయింపుల రెట్టింపు ఈశాన్య రాష్ట్రాల పట్ల గౌరవ ప్రధాని ప్రాధాన్యత కు నిదర్శనం: శ్రీ జి కిషన్ రెడ్డి

Posted On: 08 JAN 2022 7:12PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు

మణిపూర్, త్రిపుర , దక్షిణ అస్సాం ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అగర్తలా - జిరిబామ్ - అగర్తలాను కలిపే ప్రత్యేక జన్ శతాబ్ది రైళ్ల ప్రారంభోత్సవం తో నెరవేరింది. ప్రారంభ ప్రత్యేక రైళ్ల కు అగర్తలా , జిరిబామ్ రైల్వే స్టేషన్ల నుండి ఏకకాలంలో జెండా ఊపి ప్రారంభం.

ఈశాన్య రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు గత 7 సంవత్సరాలలో దాదాపు రెట్టింపు అయ్యాయి. 2014-2015 లో రూ. 36,107.56 కోట్లు కాగా, 2020-2021 లో రూ. 68,020 కోట్లకు చేరుకుంది. ఇది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న ప్రాధాన్యత కు నిదర్శనం.

హైవేలు, సమాచార మార్గాలు, రైల్వేలు , ఎయిర్ వేస్ కు ప్రాధాన్యత ఇచ్చే గౌరవ ప్రధాని 'హెచ్ ఐ ఆర్ ఎ' అభివృద్ధి నమూనా దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

అస్సాం మీదుగా మణిపూర్ -త్రిపుర రాష్ట్రాలను కలిపే మొదటి జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ట్నవ్ , ఈశాన్య ప్రాంత అభవృద్ధి,  సాంస్కృతిక, పర్యాటక శాఖల  కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి ఈ రోజు రైల్వే బోర్డు నుండి వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.  మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ నోంగ్తోమ్ బిరేన్ సింగ్ , త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కూడా హాజరయ్యారు.

అగర్తలా - జిరిబామ్ - అగర్తలాను కలిపే ప్రత్యేక జన్ శతాబ్ది రైళ్ల ప్రారంభోత్సవం తో మణిపూర్, త్రిపుర ,దక్షిణ అస్సాం ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరినట్టయింది. ప్రారంభ ప్రత్యేక రైళ్లను అగర్తలా , జిరిబామ్ రైల్వే స్టేషన్ల నుండి ఏకకాలంలో జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ప్రత్యేక రైళ్లు ప్రధాన మైన పట్టణాలకు

కీలక మైన అనుసంధానంగా నిలవడంతో పాటు ప్రయాణీకుల అనుసంధానం, వాణిజ్యం, పర్యాటక రంగాలు వృద్ధి చెందడానికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని సాంస్కృతిక, ప ర్యాటక , డోనెర్ శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తెలిపారు. గౌరవ ప్రధాని నాయకత్వంలో ఈశాన్య ప్రాంతం అభివృద్ధి దిశగా ముఖ్యమైన అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.

‘’ 2014-2015 లో రూ.36,107.56 కోట్ల నుండి ఏడు సంవత్సరాలలో -అంటే 2020-2021 లో రూ.68,020 కోట్లకు బడ్జెట్ కేటాయింపులు దాదాపు రెట్టింపు కావడం ఈశాన్య రాష్ట్రాల పట్ల ప్రధాన మంత్రి ప్రాధాన్యత ను స్పష్టంగా చూపుతోంది" అని కిషన్ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని అభివృద్ధి కార్యక్రమాలు , మౌలిక సదుపాయాల వృద్ధితో, ఈశాన్య ప్రాంతం భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల వృద్ధి ఇంజిన్ గా మారడానికి సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

ఈ ప్రాంతం సహజంగానే సమృద్ధిగా వనరుల ను కలిగివుంది, వ్యవసాయ-ఉద్యానవనం, సేంద్రియ వ్యవసాయం, వస్త్రాలు, పర్యాటకం మొదలైన వివిధ రంగాలలో ఈ అష్టలక్ష్మి రాష్ట్రాలు ప్రపంచ కేంద్రాలుగా మారడానికి తమ స్వంత అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. అన్ని రంగాలలో పురోగతిని సాధించడానికి , అన్ని రంగాలలో నిజమైన సామర్థ్యాన్ని గ్రహించడానికి మంచి కనెక్టివిటీ కీలకమని ఆయన అన్నారు.  హైవేలు, సమాచార మార్గాలు (ఇంటర్నెట్), రైల్వేలు , ఎయిర్ వేస్ కు ప్రాధాన్యత ఇచ్చే గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 'హీరా' అభివృద్ధి నమూనా దిశగా నిరంతర కృషి జరుగుతోందని చెప్పారు.

ఈ కీలకమైన మౌలిక సదుపాయాల అంశాలలో ప్రతి దాని గురించి మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణం గత ఏడు సంవత్సరాలలో రహదారి పొడవులో 25 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. రూ. 85,631 కోట్ల విలువైన రోడ్డు, , రహదారి ప్రాజెక్టులు ప్రస్తుతం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయని,  రాబోయే రెండు సంవత్సరాలకు మరో 80,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. 

 

ఈ ప్రాంతంలోని కఠినమైన కొండ భూభాగంలో కనెక్టివిటీని పెంపొందించడంలో రైల్వే లు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు గాను రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్నావ్ కు శ్రీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం రూ.56,553 కోట్ల వ్యయంతో చేపట్టిన 14 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్యాపిటల్ కనెక్టివిటీ ప్రాజెక్టు దాదాపు అన్ని రంగాలలో అవకాశాల కొత్త తలుపులను తెరుస్తోందని, తదుపరి అభివృద్ధికి పునాది వేస్తోందని వివరించారు. కీలకమైన అగర్తలా-అఖూరా ప్రాజెక్టు గురించి  కూడా మంత్రి ప్రస్తావించారు. 972.5 కోట్ల తో  భారతదేశాన్ని బంగ్లాదేశ్ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం చేయడం అద్భుతమైన ఆర్థిక,  వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందనీ అన్నారు.

ఎయిర్ కనెక్టివిటీ కూడా మునుపెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడిందని మంత్రి తెలిపారు. గౌహతి నేడు దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా మారిందని, రెండు ప్రధాన క్యాపిటల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ఎన్ ఈఆర్ - హోలోంగి-ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్ లో రూ.955.37 కోట్ల వ్యయంతో మంజూరు చేయడం, సిక్కింలోని పాక్యోంగ్ విమానాశ్రయం రూ.553.53 కోట్ల వ్యయంతో మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

కొండ ప్రాంతం, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ ఈశాన్య ప్రాంతంలో డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా వివరించారు. గ్రామ పంచాయితీల కు 4జి మొబైల్ కనెక్టివిటీ , వై-ఫై కనెక్టివిటీని వేగంగా పెంచుతున్నారు. దాదాపు 6,000 గ్రామ పంచాయితీలకు  సేవలు సిద్ధంగా ఉన్నాయి మొత్తం 9461 ఎఫ్ టిటిహెచ్ కనెక్షన్ లు అందించారు. ఈ డిజిటల్ కనెక్షన్ యువత ఆకాంక్షలు నెరవేరుస్తుందని , ఈ ప్రాంతంలో 4 వ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తుందనీ చెప్పారు.

రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైశ్ట్నవ్ మాట్లాడుతూ, రైల్వే ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడంలో రైల్వే మంత్రిత్వశాఖ కు సహకరిస్తున్న భాగ స్వాములందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈశాన్య ప్రాంతానికి ప్రధాన మంత్రి తన హృదయంలో ప్రత్యేక స్థానం ఇచ్చారని, ఈశాన్య ప్రాంతంలో ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయాలని భాగస్వాములందరికీ ప్రధాని ఎల్లప్పుడూ ఉద్బోధిస్తారని ఆయన చెప్పారు.

మంత్రులు ఇద్దరూ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. వారానికి మూడు సార్లు నడిచే నెంబరు. 12097/12098 అగర్తలా –జిరిబం - అగర్తలా జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ సోమవారం, బుధవారం శుక్రవారం నడిచే 10-01-2022 (సోమవారం) ప్రారంభం అవుతుంది. అగర్తలా నుండి 06-00 గంటలకు బయలుదేరి జిరిబామ్ 12-00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణం లో జిరిబామ్ నుండి 16-00 గంటలకు బయలుదేరి అగర్తలాకు 22-00 గంటలకు చేరుతుంది.

ప్రారంభ కార్యక్రమాన్ని మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ నోంగ్తోంబామ్ బిరెన్ సింగ్ వీడియో లింక్ ద్వారా , త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ బిప్లబ్ కుమార్ దేబ్ , డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్, విదేశీ వ్యవహారాల, విద్య శాఖల సహాయ మంత్రి, ప్రతిమా భౌమిక్, సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి, వుంగ్జాజిన్ వాల్టే, రవాణా , జిఎడి, గిరిజన వ్యవహారాల మంత్రి  మణిపూర్ హిల్స్ ప్రభుత్వం; ప్రనాజిత్ సింఘా రాయ్, రవాణా, పర్యాటక, వ్యవసాయం , రైతుల సంక్షేమ శాఖ మంత్రి, త్రిపుర ప్రభుత్వం; ఎంపిలు ఝర్నా దాస్ బైద్య, మహారాజా సనాజావోబా లీషెంబా, ఎం.సి  మేరీ కోమ్, రెబాటి త్రిపుర, కృపనాథ్ మల్లా, డాక్టర్ లోర్హో ఎస్. ప్ఫోజ్;  ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మిమి మజుందార్, రాజ్ కుమార్ ఇమో సింగ్, అషబ్ ఉద్దీన్ కూడా వేర్వేరు ప్రారంభ ప్రదేశాలలో పాల్గొన్నారు.

మణిపూర్ నుండి త్రిపురకు అస్సాంలోని అరుణాచల్ స్టేషన్ (సిల్చార్) ద్వారా మొదటి జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు జిరిబామ్ -అగర్తలా టెర్మినల్ స్టేషన్లు కాకుండా సిల్చార్, బాదర్ పూర్, న్యూ కరీంగంజ్, ధర్మనగర్ , అంబసా వంటి కొన్ని ముఖ్యమైన , చారిత్రాత్మక పట్టణాలను కలుపుతుంది. రైలు ప్రయాణం ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది, 300 కిలోమీటర్ల ప్రయాణ దూరానికి రహదారి ద్వారా 12 గంటలు పడుతుంది అయితే ఈ రైలు ద్వారా 6 గంటలు ఉంటుంది. 

ఈ రైలు సర్వీసు మూడు రాష్ట్రాలతో సహా ఈ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకం , రవాణా రంగానికి ప్రేరణ ఇస్తుంది. ప్రస్తుతం మణిపూర్ - త్రిపుర మధ్య ప్రత్యక్ష రైలు లేదు . అగర్తలా సిల్చార్ మధ్య ఉదయం వేళల్లో ఒక రైలు మాత్రమే నడుస్తోంది. జనశతాబ్ది రైలు ఇప్పుడు విద్యా , వైద్య సౌకర్యాల కోసం త్రిపురకు వెళ్లాల్సి వస్తున్న మణిపూర్ ప్రజలకు ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది.  త్రిపుర ప్రజలు కూడా వాణిజ్యం, పర్యాటకం మొదలైన వాటి కోసం మణిపూర్ ను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.

 

***



(Release ID: 1788675) Visitor Counter : 155