ఉక్కు మంత్రిత్వ శాఖ
ఎన్ఎండిసి ముడి ఇనుము గనుల సందర్శన సందర్భంగా 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ఉద్యోగులకు ఉద్బోధించిన కేంద్ర ఉక్కు మంత్రి
Posted On:
08 JAN 2022 4:44PM by PIB Hyderabad
కర్నాటక, దొనిమలైలోని ఎన్ఎండిసి ముడి ఇనుము గనిలో 7.0 ఎంటిపిఎ స్క్రీనింగ్, బెనిఫికేషన్ ప్లాంట్‌కు (ఖనిజాన్ని శుద్ధి చేసే)కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్ నేడు శంకుస్థాపన చేశారు.
దొనిమలై, కుమారస్వామి ముడి ఇనుము గనుల కార్యకలాపాలను, ఎన్ఎండిసి పెల్లెట్ ప్లాంట్ కార్యకలాపాలను తన పర్యటన సందర్భంగా ఉక్కుమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతదేశంలో అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారు అయిన ఎన్ఎండిసి, దేశపు మౌలికసదుపాయాల అవసరాన్ని స్థిరంగా నెరవేర్చిందని పేర్కొన్నారు. భారతదేశం ఇనుము, ఉక్కు శక్తిగా మారడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో, స్టీల్ విజన్ 2030ని సాధించడాన్ని సమీపిస్తున్న సమయంలో ఎన్ఎండిసి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల అమలును నిశితంగా పర్యవేక్షిస్తూ, వాటిని ప్రాధన్యతను ఇచ్చి పూర్తి చేసి ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా, ఎన్ఎండిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, హరిత భారతం దిశగా పయనించడం సామూహిక బాధ్యత అని ఉక్కు మంత్రి నొక్కి చెప్పారు. తమ అన్ని గని కాంప్లెక్సులకు 5 స్టార్ రేటింగ్‌లను సాధించినందుకు ఎన్ఎండిసిని అభినందిస్తూ, మైనింగ్ రంగం పర్యావరణంపై తన ప్రభావం పట్ల అత్యంత చైతన్యవంతంగా ఉండాలని శ్రీరామ చంద్ర ప్రసాద్ సింగ్ చెప్పారు. నిలకడైన గనుల తవ్వక పద్ధతులు, పరిరక్షణ చొరవలు ప్రస్తుతం మనకు అవసరం. పర్యావరణ అనుకూల గనుల తవ్వక పద్ధతులకు ఎన్ఎండిసి కట్టుబడి ఉండటం గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు.
ప్రస్తుతం దొనమలై గని నుంచి ఎన్ఎండిసి 7.0 ఎంటిపిఎ ముడి ఇనుమును ఎన్ ఎండిసి ఉత్పత్తి చేస్తోందని, దానిని ఎస్‌పి-1 శుద్ధి చేస్తోందన్న విషయం గమనార్హం. కుమారస్వామి ముడి ఇనుము గనికి 7.0 ఎంటిపిఎ సామర్ధ్యం కలిగి ఉండగా, భవిష్యత్తులో దానిని 10.0 ఎంటిపిఎ కి పెంచనున్నారు. కుమారస్వామి ముడి ఇనుము గని నుంచి ఉత్పత్తి అయ్యే ముడి ఇనుమును శుద్ధి చేసేందుకు, 7.0 ఎంటిపిఎ సామర్ధ్యం కలిగిన ఎస్‌పి-2 స్క్రీనింగ్ ప్లాంట్ పురోగమనంలో ఉంది. భవిష్యత్తులో దాని సామర్ధ్యాన్ని 10.0ఎంటిపిఎకు పెంచే ఏర్పాటు ఇందులో పొందుపరిచారు. దొనమలై, కెఐఒఎం రెండింటి నుంచీ ఉత్పత్తి అయ్యే ముడి ఇనుమును శుద్ధి చేసేందుకు ఎస్‌పి-2లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కంపెనీ గనులకు మంత్రిని ఆహ్వానిస్తూ, సిఎండి దేబ్, ఈ ఏడాది ఎన్ఎండిసి అద్భుతమైన పని తీరును పంచుకున్నారు. దాని విస్తరణ ప్రణాళికలను, మూలధన వ్యయ వివరాలను, ఒడిషా, ఘార్ఖండ్‌లలో రిజర్వేషన్ మార్గంలో గనులను కేటాయించడం అన్నది 2030 నాటికి ఎన్ఎండిసి 100 ఎంటిల ముడి ఇనుము కంపెనీగా అవతరించేందుకు తోడ్పడుతుందని చెప్పారు.
***
(Release ID: 1788672)
Visitor Counter : 163