జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్ కింద రాజస్థాన్ కు 6,872 కోట్ల రూపాయల విలువ చేసే మంచి నీటి సరఫరా పథకాలు మంజూరు 3,213 గ్రామాల్లో 6.56 గృహాలకు ప్రయోజనం కలిగించనున్న పథకాలు
Posted On:
06 JAN 2022 4:02PM by PIB Hyderabad
జల్ జీవన్ మిషన్ కింద రాజస్థాన్ రాష్ట్రానికి 6,872.28 కోట్ల రూపాయల విలువ చేసే మంచి నీటి సరఫరా పథకాలు మంజూరు అయ్యాయి. పథకాలను ఆమోదించేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన శాంక్షనింగ్ కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. కమిటీ సమావేశం 2022 జనవరి 5న జరిగింది. ఈ పథకాల కింద 27 జిల్లాల్లో ఉన్న 3,213గ్రామాలలో నివసిస్తున్న 6.56 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచి నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తారు. వీటిలో అయిదు పథకాలు భారీ ప్రాజెక్టులుగా పలు గ్రామాల్లో అమలు అవుతాయి. మిగిలిన ప్రాజెక్టుల పరిధి ఒక గ్రామానికి మాత్రమే పరిమితమవుతుంది.
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా రక్షిత మంచినీరు సరఫరా చేసి, మంచి నీరు కోసం మహిళలు ఎక్కువ దూరం నడవకుండా చూడాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయ సాధన కోసం జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతోంది. ఈ మిషన్ అమలు కోసం 2021-22 లో రాజస్థాన్ రాష్ట్రానికి కేంద్ర గ్రాంటుగా 2,345.08 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయి. జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఈ ఏడాది కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రాష్ట్రానికి 10,180.50 కోట్ల రూపాయలను కేటాయించారు. గత ఏడాది జరిగిన కేటాయింపులతో పోల్చి చూస్తే ఈ ఏడాది కేటాయింపులు నాలుగు రెట్లు పెరిగాయి. 2024 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్క గృహానికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చూసేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
రాజస్థాన్ రాష్ట్రంలో 2018 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ప్రారంభమయ్యింది. మిషన్ ప్రారంభం అయిన సమయానికి రాష్ట్రంలో 11.74 లక్షల గ్రామీణ గృహాలు (1157%) మాత్రమే కుళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి, అనంతరం విధించిన లాక్ డౌన్ సమస్యలను అధిగమించి రాష్ట్రంలో గడచిన 28 నెలల్లో రాష్ట్రంలో 10.5 లక్షల గృహాలకు (10.3%) కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1.01 గృహాల్లో 22.23 లక్షల గృహాలు (21.92%) కుళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. 2021-22 లో 30 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్ ఇవ్వాలని రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
నాణ్యతతో రాజీ పడకుండా పథకాలను సకాలంలో వేగంగా పూర్తి చేయాలని సమావేశంలో జల్ జీవన్ మిషన్ జాతీయ బృందం రాష్ట్ర అధికారులకు సూచించింది. పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ లో కీలక అంశంగా గుర్తించిన నీటి నాణ్యత అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర బృందం కోరింది.
విద్యార్థులకు రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. అన్ని విద్యా కేంద్రాలలో త్రాగడానికి, మధ్యాహ్న భోజనం వండడానికి, చేతులు కడుక్కోవడానికి మరియు మరుగుదొడ్లలో ఉపయోగించడానికి నీరు సరఫరా చేయాలని జల్ జీవన్ మిషన్ నిర్ణయించింది. దీనిలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రంలో 58,363 పాఠశాలలు (67%), 28,959 అంగన్వాడీ కేంద్రాలు (54%) కుళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. 2,885 పాఠశాలలు, 418 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది. మిగిలిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సాధ్యమైన త్వరగా కుళాయి ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర బృందం సూచించింది.
జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రంలో నీటి నాణ్యత-ప్రభావిత ఆవాసాలు, ఆకాంక్ష జిల్లాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న గ్రామాలు, ఆదర్శ గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరి సహకారం, విశ్వాసం, ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రయోజనాలు అర్హులైన వారందిరికి మిషన్ ప్రయోజనాలు అందేలా చర్యలు అమలు చేస్తున్నారు. దేశ ప్రజలందరికి కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో మిషన్ అమలవుతోంది. మిషన్ అమలులో నీటి నాణ్యత, పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికోసం ప్రతి గ్రామంలో అయిదుగురు మహిళలకు శిక్షణ ఇచ్చి, నీటి నాణ్యత పరీక్షించేందుకు నీటి వనరుల లభ్యత, సరఫరా కేంద్రాల వద్ద కిట్లను ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లో 3,474 గ్రామాలకు చెందిన 16,806 మంది మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.
2019లో మిషన్ ప్రారంభంలో దేశంలోని మొత్తం 19.2 కోట్ల గ్రామీణ కుటుంబాలలో 3.23 కోట్ల (17%) కుటుంబాలు మాత్రమే కుళాయి నీటి సరఫరా సౌకర్యం కలిగి ఉన్నాయి. గత 28 నెలల్లో కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్‌డౌన్‌ల రూపంలో అంతరాయాలు ఎదురైనప్పటికీ జల్ జీవన్ మిషన్ వేగంగా అమలు చేయబడింది.ప్రస్తుతం 5.53 కోట్ల గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 8.77 కోట్ల (45.57%) గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్ ఉంది.
గోవా, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అయిన అండమాన్ నికోబార్ దీవుల పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ల గ్రామీణ ప్రాంతాల్లో 100% గృహ కుళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 87 జిల్లాల్లోని 1.30 లక్షలకు పైగా గ్రామాలలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
***
(Release ID: 1788176)
Visitor Counter : 150