ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ PMFME పథకం(మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ -ప్రధాన మంత్రి అధికారికీకరణ) కింద ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌ల పథకం కింద ఆరు బ్రాండ్ లు ప్రారంభం.


అమృత్ ఫల్, కోరి గోల్డ్, కాశ్మీరీ మంత్ర, మధు మంత్ర, సోమదన, హోల్ వీట్ కుకీస్- డిల్లీ బేక్స్ పథకం కింద ప్రారంభం.

Posted On: 05 JAN 2022 5:13PM by PIB Hyderabad
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ పశుపతి కుమార్ పరాస్ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్  NAFED - నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్  సీనియర్ అధికారులు ఈరోజు న్యూఢిల్లీలోని పంచశీల భవన్‌లో ప్రధాన మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఫార్మలైజేషన్ పథకం కింద,   (ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌) ఆరు బ్రాండ్‌లను ప్రారంభించారు.

 

 

ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ PMFME పథకం  బ్రాండింగ్ మార్కెటింగ్ కాంపోనెంట్ కింద ఎంపిక చేసిన 10 బ్రాండ్ల  లను అభివృద్ధి చేయడానికి NAFEDతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. వీటిలో అమృత్ ఫాల్, కోరి గోల్డ్, కాశ్మీరీ మంత్ర, మధు మంత్ర, సోమదన, మరియు హోల్ వీట్ కుకీస్ ఆఫ్ డిల్లీ బేక్స్ అనే ఆరు బ్రాండ్‌లు ఈరోజు ప్రారంభమయ్యాయి.

 

 ఉసిరి రసం కోసం బ్రాండ్ అమృత్ ఫల్ ప్రత్యేకంగా హర్యానాలోని గురుగ్రామ్ లో  ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌ కాన్సెప్ట్ కింద అభివృద్ధి చేశారు.ఈ  ఉత్పత్తిలో స్వచ్ఛమైన ఉసిరి రసం ఉంటుంది.  ఆరోగ్య ప్రయోజనాల కోసం జోడించిన నిమ్మకాయతో సహజమైన ప్రత్యేకమైన రుచితో  అమృత్ ఫల్ లభ్యం. 500 మి.లీ. బాటిల్  ధర రూ.120/-.

కోరి గోల్డ్ బ్రాండ్ కొత్తిమీర పొడి కోసం అభివృద్ధి చేశారు, ఇది రాజస్థాన్‌లోని కోటాలో గుర్తింపు పొందిన  ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌  ఉత్పత్తి, ప్రత్యేకమైన రుచిని కలిగి ప్రాంతీయ ప్రత్యేకతను అందిస్తుంది. 100గ్రా ప్యాక్   ధర రూ.34/-.

బ్రాండ్ కాశ్మీరీ మంత్ర  జమ్మూ  కాశ్మీర్‌లోని కుల్గామ్ నుండి సుగంధ ద్రవ్యాల సారాన్ని బయటప్రపంచానికి  తీసుకువచ్చింది. కాశ్మీరీ లాల్ మిర్చ్ ఉత్పత్తి జమ్మూ  కాశ్మీర్ లో పండే  సుగంధ ద్రవ్యాల సాగు నుంచి ఎంపిక చేసిన మిరప తో  ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌ భాగం కింద అభివృద్ధి చేశారు. ఉత్పత్తి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.  100గ్రా ప్యాక్ ధర రూ.75/-.

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ తేనె కోసం ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌ కాన్సెప్ట్ కింద బ్రాండ్ మధు మంత్ర అభివృద్ధి చేయబడింది. మల్టీఫ్లోరా తేనెను ఫ్రీ-రేంజ్ తేనెటీగలు సేకరించాయి. 500గ్రా గాజు సీసా పోటీ ధర రూ.185/-.

హోల్ వీట్ కుకీలు, బ్రాండ్ డిల్లీ బేక్స్ కింద అభివృద్ధి చేసిన  రెండవ ఉత్పత్తి.  ఢిల్లీ బేక్స్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌ కాన్సెప్ట్ క్రింద అభివృద్ధి చేశారు. NAFED ప్రకారం, హోల్ వీట్ కుక్కీ ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి, ఎందుకంటే ఇది గోధుమలు, చక్కెరకు బదులుగా బెల్లం, ఇంకా  వనస్పతికి బదులుగా వెన్నను కలిగి ఉంటుంది. 380 గ్రాముల ప్యాక్  ధర రూ.175/-.
బ్రాండ్ సోమదానా మహారాష్ట్రలోని థానే నుండి ఒక జిల్లా ఒక ఉత్పత్తి బ్రాండ్‌ కాన్సెప్ట్ కింద అభివృద్ధి చేసిన  రాగుల పిండి. ఇది ఒక గ్లూటెన్ రహిత ప్రత్యేక ఉత్పత్తి , ఇనుము, ఫైబర్,  కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. 500 గ్రాముల ప్యాక్ ధర రూ.60/-.

NAFED ప్రకారం, వినియోగదారుల ప్రయోజనం కోసం, అన్ని ఈ ఉత్పత్తులు ప్రత్యేకమైన ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌లో ఇవి తేమ సూర్యరశ్మి చొరబడకుండా ఉంచుతాయి, తద్వారా ఉత్పత్తి సుదీర్ఘ  కాలం పాటు తాజాగా ఉంటుంది.

ప్రతి ఉత్పత్తి NAFED మార్కెటింగ్ నైపుణ్యం విస్తృతమైన సమాచారం  వారసత్వంతో పాటు ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, సరఫరా లాజిస్టిక్స్‌లో దాని సామర్థ్యాలు  అనుభవం ఆధారంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, ప్రతి బ్రాండ్‌కు సంబంధిత మార్కెట్‌లలో బ్రాండ్ కమ్యూనికేషన్‌లో పెరిగిన పెట్టుబడులు, విలువ గొలుసు అంతటా డిజిటలైజేషన్‌పై బలమైన మద్దతు లభిస్తుంది.

 

 

PMFME పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (MFPEలు)ని అధికారికీకరించడానికి, అప్‌గ్రేడ్ చేయడానికి బలోపేతం చేయడానికి  ప్రభుత్వం ప్రయత్నాలను  ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మనిర్భర్ భారత్‌ సాకారానికి  అనుకూలంగా NAFED నుండి ఈ బ్రాండ్‌ల మార్కెటింగ్ హక్కులను పొందడానికి MFPలు ముందుకు రావాలని   ప్రోత్సహించాలని కోరారు.

అన్ని ఉత్పత్తులు NAFED బజార్‌లు, ఈ -కామర్స్ ప్లాట్ ఫాంలు భారతదేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.

PMFME పథకం గురించి:

ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రారంభించిన, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్ (PMFME)  అనేది కేంద్ర ప్రాయోజిత పథకం, ఇది ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలోని అసంఘటిత విభాగంలో ఇప్పటికే ఉన్న వ్యక్తిగత సూక్ష్మ సంస్థల పోటీతత్వాన్ని పెంపొందించడం, అధికారికీకరణను ప్రోత్సహించడం  ఈ రంగానికి చెందిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్వయం సహాయక బృందాలు ఉత్పత్తిదారుల సహకార సంస్థలకు మద్దతునిస్తుంది. 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలంలో రూ.10,000 కోట్లు, ప్రస్తుతం ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్‌ల అప్-గ్రేడేషన్ కోసం ఆర్థిక, సాంకేతిక మరియు వ్యాపార మద్దతును అందించడానికి రూ.2,00,000 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు నేరుగా సహాయం చేయడానికి ఈ పథకం ఉద్దేశించబడింది. .

మరిన్ని వివరాల కోసం, సందర్శించండి: www.pmfme.mofpi.gov.in

*****



(Release ID: 1787832) Visitor Counter : 295