హోం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ప్రతి కేంద్ర సాయుధ పోలీసు దళంలోని చివరి 10 మంది సిబ్బందికి ఆయుష్మాన్ సిఎపిఎఫ్ కార్డులను పంపిణీ చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్


ప్రధాన మంత్రి జ న్ ఆరోగ్య యోజ న / ఆయుష్మాన్ భార త్ యోజన ను 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

కేంద్ర పారా మిలటరీ దళాల సిబ్బంది, వారి కుటుంబాలకు 23 జనవరి 2021న గువాహతీ (అస్సాం)లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి చారిత్రక సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

జవానులు వారి కుటుంబాల ఆరోగ్యం, సంక్షేమాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మోదీ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశనం లో సిఎపిఎఫ్ జవాన్లందరి సంక్షేమం దిశగా నిబద్ధతతో నిరంతరం కృషి చేస్తున్న కేంద్రప్రభుత్వం

సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత, ఉగ్రవాద పోరు , నక్సలిజం, తిరుగుబాటు అణచివేత , రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, ఇంకా ఎన్నికల సమయంలో సేవలందిస్తున్న కేంద్ర సాయుధ పోలీసు దళాలు

Posted On: 05 JAN 2022 4:24PM by PIB Hyderabad

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ రోజు న్యూఢిల్లీ లో ప్ర తి కేంద్ర సాయుధ పోలీసు దళంలోని చివరి 10 మంది సిబ్బందికి ఆయుష్మాన్ సిఎ పి ఎఫ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాల డైరెక్టర్ జనరల్స్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, సాయుధ పోలీసు దళాల సిబ్బంది పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజ న / ఆయుష్మాన్ భార త్ యోజ న ను 2018 సెప్టెంబర్ 23న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారనీ, ఆ తరువాత కేంద్ర పారా మిలటరీ ద ళాల సిబ్బంది, వారి కుటుంబాలందరికీ ఈ ప థ కాన్ని 2021

 

జనవరి 23న శ్రీ అమిత్ షా నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 125వ జయంతి చారిత్రక సందర్భంగా గ్రూప్ సెంట ర్ , సిఆర్ పిఎఫ్ , గువహాటి (అస్సాం) లో ప్రారంభించారనీ తెలిపారు. ఈ పథకం కింద ఆయుష్మాన్ సిఎ పి ఎఫ్ కార్డులను రికార్డు సమయంలో 35 లక్షల మంది సిఎపిఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు పంపిణీ చేశారు.

 

ఆయుష్మాన్ కార్డుల పంపిణీని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా 2021 నవంబర్ 2న ప్రారంభించారని, 2021 డిసెంబర్ 31 నాటికి దాదాపు అన్ని కార్డులను దళాల సిబ్బందికి, వారి కుటుంబాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర హోం శాఖ శాఖ సహాయ మంత్రి తెలిపారు.

మన జవాన్లు, వారి కుటుంబాల ఆరోగ్యం, సంక్షేమానికి  మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత, ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదం, రాష్ట్రాలు, ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యతో వ్యవహరించడంలో కేంద్ర సాయుధ పోలీసు దళాల సేవలను ఆయన ప్రశంసించారు.

 

ఇంతకు ముందు, ఫోర్స్ ఆసుపత్రులు లేదా ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు లేదా సిజిహెచ్ఎస్ ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో మాత్రమే వైద్య సంప్రదింపులు , పరీక్షలు అందుబాటులో ఉన్నాయని,  కానీ ఇప్పుడు ఈ పథకం కింద, సుమారు 24,000 ఆయుష్మాన్ భారత్ పిఎం-జెఎవై  ఎంప్యానెల్ ఆసుపత్రులలో నగదు రహిత ప్రాతిపదికన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఇంకా ఈ పథకంలో అయ్యే ఖర్చుపై పరిమితి లేదనీ శ్రీ నిత్యానంద రాయ్ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వివిధ దళాల సిబ్బంది కి చికిత్స పొందడం ఇప్పుడు చాలా సులభం అవుతుందని, మన సాయుధ పోలీసు దళాల సిబ్బంది , వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వంతమైన, దీర్ఘాయుష్షు దిశ గా ఈ పథకం ఒక మైలురాయిగా నిరూపితం కాగలదని శ్రీ రాయ్ అన్నారు.

 

సిజిహెచ్ ఎస్ లేదా ఆయుష్మాన్ భారత్ పిఎం-జెఎవై కింద ఉన్న అన్ని ఆసుపత్రుల్లో సిఎ పిఎఫ్ సిబ్బంది , వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు నగదు రహిత, ఇన్ పేషెంట్ , అవుట్ పేషెంట్ ఆరోగ్య స్ ఈ వలను, సదుపాయాలను పొందవచ్చని శ్రీ నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఆయుష్మాన్ సిఎపిఎఫ్ యొక్క ఆల్ ఇండియా రోల్ అవుట్ ను 31 మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ పథకం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ,ఆరోగ్య - కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ,నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్ హెచ్ ఎ) ల ఉమ్మడి చొరవ.

 

సిఎపిఎఫ్ లబ్ధిదారులకు ఎన్ హెచ్ ఎ అంతరాయం లేని సేవలను అందిస్తుంది.  ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబరు 14588, ఆన్ లైన్ ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ ,మోసం గుర్తింపు, నిరోధించడానికి కఠినమైన నియంత్రణతో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గనిర్దేశంలో కేంద్ర ప్రభుత్వం సిఎపిఎఫ్ జవాన్ల అభ్యున్నతికి అది వారి ఆరోగ్యం అయినా, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం , లేదా గృహ నిర్మాణం అయినా కేంద్ర

ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, శ్రీ నిత్యానంద రాయ్ తెలిపారు.

 

ఈ భారీ ఆరోగ్య పథకం కింద తమ విభాగాల్లోలబ్ధిదారులకు 'ఆయుష్మాన్ సిఎపిఎఫ్ కార్డు'ను నిర్ణీత కాలవ్యవధిలో నిజాయితీ, సమగ్రతతో అందించిన కేంద్ర పారామిలటరీ దళాల డైరెక్టర్ జనరల్స్ అందరినీ  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అభినందించారు. అత్యంత సవాలుతో కూడిన ఈ పనిని పూర్తి చేయడంలో వారు కీలక మద్దతును అందించారని అన్నారు.

***



(Release ID: 1787825) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi , Tamil