ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్, బోర్దుమ్సా మహిళా స్వయం సహాయక బృందాల విజయగాథ
Posted On:
04 JAN 2022 2:43PM by PIB Hyderabad

ఎన్ఇఆర్‌సిఒఆర్ఎంపి ప్రాజెక్టు కింద 2018లో అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్, బోర్డుమ్సాలో జాస్మిన్ స్వయం సహాయక బృందాల (ఎస్‌హెచ్‌జి) సమాఖ్యను ఏర్పాటు చేయడం జరిగింది. జాస్మిన్ స్వయం సహాయక సమాఖ్యలో మొత్తం 16 ఎస్‌హెచ్‌జిలు ఉన్నాయి. సమాఖ్య, 2019లో ప్రాజెక్టు నుంచి రూ. 193,939ని రివాల్వింగ్ ఫండ్‌గా అందుకుంది. ఈ మొత్తంతో, ఆదాయకల్పనా కార్యకలాపంగా (ఐజిఎ) తమ ప్రాంతంలోనర్సరీలు లేకపోవడంతో పూలమొక్కల పెంపకాన్ని (ఫ్లోరీకల్చర్) ప్రారంభించారు.

పూలమొక్కల పెంపకంతో పాటుగా, పోకచెక్కల నర్సరీ కూడా ఐజిఎలో భాగంగా ఉంది. తమ చిన్న తరహా వ్యాపారాన్ని మెరుగుపరచుకునేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రతి ఎస్‌హెచ్‌జి సభ్యురాలూ తమ వంతు సహాకారాన్ని అందిస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే, స్థానిక కార్యక్రమాలలో తమ నర్సరీని ప్రదర్శిస్తుండడంతో, ఆ ప్రాంతం వారికి బాగా నచ్చిన నర్సరీ అయింది. మొక్కల పెంపకానికి అవసరమైన వస్తువులను, మొక్కలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వివిధ ప్రాంతాల నుంచి రావడం ప్రారంభించారు.

స్వయంసహాయక బృందాల సమాఖ్యకు మార్కెట్‌కు లంకెగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవం, గ్రామీణ హాట్, ఎగ్జిబిషన్లు తదితర కార్యక్రమాలలో పాల్గొనేందుకు, తమ నర్సరీ వస్తువులను ప్రదర్శించేందుకు అవకాశం లభించింది.ప్రస్తుతం ఆదాయ ఉత్పత్తి కార్యకలాపంగా (ఐజిఎ) చేపట్టిన తమ చొరవ (నర్సరీ) పట్ల స్వయం సహాయక బృందాల సమాఖ్య సభ్యులు ఎంతో సంతృప్తితో ఉన్నారు. తమ కొద్దిపాటి పెట్టుబడిపై వచ్చిన లాభంతో వారు మరిన్ని జాతుల మొక్కలను జోడించడం ద్వారా తమ కార్యకలాపాన్ని మెరుగుపరచడం ప్రారంభించారు. ఈ చొరవ ఎస్‌హెచ్‌జిలకు సహజ ఆనందాన్ని కలిగించే లాభదాయకమైన జీవనోపాధి ఎంపికగా నిలుస్తోంది.

***
(Release ID: 1787422)
Visitor Counter : 216