ఆర్థిక మంత్రిత్వ శాఖ
DIPAM మార్గదర్శకాలకు అనుగుణంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వానికి రూ. 240.41 కోట్ల డివిడెండ్ చెల్లిస్తున్న SPMCIL
Posted On:
03 JAN 2022 5:46PM by PIB Hyderabad
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) భారత ప్రభుత్వానికి రూ.240.41 కోట్లు ఈ సంవత్సర డివిడెండ్ గా చెల్లిస్తుంది. DIPAM మార్గదర్శకాలకు అనుగుణంగా 2020-21 మార్చి 31, 2021 ఆర్ధిక సంవత్సరంతానికి కంపెనీ నికర విలువ 5% పన్ను తర్వాత లాభం (PAT)లో 57% గా లెక్కించారు.
కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ SPMCIL నుంచి డివిడెండ్ చెక్కును అందుకున్నారు. ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి. ఆర్థిక సలహాదారు శ్రీమతి మీరా స్వరూప్ సమక్షంలో CMD త్రిప్తి P. ఘోష్ మరియు డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ అజయ్ అగర్వాల్ అందజేశారు.
SPMCIL 2020-21 సంవత్సరంలో బ్యాంక్ నోట్లు, నాణేలు, సెక్యూరిటీ పేపర్, పాస్‌పోర్ట్‌లు, సెక్యూరిటీ ఇంక్, ఇతర భద్రతా ఉత్పత్తుల ఉత్పత్తి లో సంస్థ లక్ష్యాలను సాధించింది. SPMCIL 2020-21లో 8,288 మిలియన్ల బ్యాంక్ నోట్స్, 2,757 మిలియన్ నాణేలు, 6,870 మెట్రిక్ టన్ను (MT) సెక్యూరిటీ పేపర్, 600.42 మెట్రిక్ టన్నుల సెక్యూరిటీ ఇంక్‌లను ఉత్పత్తి చేసింది.
2020-21 సంవత్సరంలో, కంపెనీ లావాదేవీల వల్ల వచ్చే ఆదాయం రూ. 4,712.57 కోట్లు, పన్నుకు ముందు లాభం రూ. 789.74 కోట్లు.
SPMCIL గురించి
SPMCIL అనేది షెడ్యూల్-‘A’ మినీరత్న కేటగిరీ-I ప్రభుత్వ సంస్థ, ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA). పాలనా నియంత్రణలో, భారత ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.
***
(Release ID: 1787415)
Visitor Counter : 185