ఆయుష్
ఆయుష్ మంత్రిత్వ శాఖ క్యాంటీన్‌లో అందుబాటులో ‘ఆయుష్ ఆహార్’
Posted On:
03 JAN 2022 4:11PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ తన క్యాంటీన్‌లో ‘ఆయుష్ ఆహార్’ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పౌష్టికాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ కాంటీన్ లో ఆయుష్ ఆహారాన్ని సోమవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి తన లక్ష్య సాధనలో మరో అడుగు ముందుకు వేసింది.
పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ‘ఆయుష్ ఆహార్’లో వెజిటబుల్ పోహా, జావ పిండితో చేసిన వడ, క్యారెట్ హల్వా మరియు కోకుం డ్రింక్ ఉన్నాయి. అన్ని వంటకాలు ప్రజలకు నచ్చుతాయని వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయుష్ సెక్రటరీ వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ క్యాంటీన్‌లో అందుబాటులో ఉంచిన ఆయుష్ ఆహార్ పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయని ఆరోగ్యానికి మంచివని అన్నారు. 2021లో మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నదని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ కింద మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను అమలు చేసిందని శ్రీ కోటేచా అన్నారు. “ఈ సంవత్సరం విద్య, పరిశోధన, తయారీ, ప్రజారోగ్యం, పరిపాలన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తాం. సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ’’ అని చెప్పారు.
2022లో ఆయుష్ జీవనశైలిని ప్రోత్సహించేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణ కారక్రమాన్ని అధికారులు సమావేశంలో చర్చించారు. ఆయుష్ ఆహార్ కొనుగోలు చేస్తున్న వారి నుంచి సూచనలు తీసుకుని అమలు చేస్తామని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ప్రమోద్ కుమార్ పాథక్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన మేరకు మరికొన్ని ఆహార పదార్ధాలను అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు.
కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శులు కవిత గార్గ్, డి. సెంథిల్ పాండియన్ కూడా పాల్గొన్నారు.
(Release ID: 1787171)
Visitor Counter : 203