రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వదేశీ విమాన వాహక నౌక ఐఏసీ (పి-71)/ విక్రాంత్‌ను సందర్శించిన ఉప‌రాష్ట్రప‌తి

నాడు పోస్టు చేయడమైనది: 02 JAN 2022 5:32PM by PIB Hyderabad

గౌరవ భార‌త ఉపరాష్ట్రపతి  శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఈ రోజు (02 జనవరి 2022న),  కొచ్చి న‌గ‌రంలో గ‌ల‌ 'కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నిర్మాణ‌పు అధునాతన దశలో ఉన్న స్వదేశీ విమాన వాహక నౌక (ఐఏసీ) ‘విక్రాంత్’ను సందర్శించారు.  పర్యటనలో భాగంగా గౌరవభారత ఉపరాష్ట్రపతికి ప్రాజెక్ట్ యొక్క విశిష్టత, నిర్మాణ పురోగతి గురించి అధికారులు వివరించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జ్ఞాపకార్థం 2022 ఆగస్టుకు ముందే ఈ ఓడ డెలివరీ, కమీషన్ కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ఉప‌రాష్ట్రప‌తికి వివరించారు. ఒక విమాన వాహక నౌకను రూపొందించడంలో మరియు నిర్మించడంలో దేశం యొక్క సామర్థ్యాన్ని గౌరవనీయమైన ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.  'ఆత్మ నిర్భర్త' లేదా స్వావలంబన భారతదేశం నిమిత్తం మా అన్వేషణలో ఇది ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని ఉప‌రాష్ట్రప‌తి అన్నారు.  
ఒక బలమైన ఉత్ప్రేరకంగా..
భార‌తదేశ‌ నావికా ద‌ళానికి హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక బలీయమైన నివాస సముద్ర శక్తి; ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ దాని కార్యకలాపాల భావనకు కేంద్రంగా ఉంది. విక్రాంత్ నౌక భారత నౌకాదళానికి అవసరమైన సౌలభ్యం, చలన శీలత, రీచ్ (అందుబాటు)తో జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా త‌గిన పోరాట శక్తిని అందిస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వానికి ఒక బలమైన ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కూడా వ్యూహాత్మక మరియు సాంకేతిక ఔన్నత్యాన్ని కలిగి ఉంది. ఇది యుద్ధ నౌకల‌ రూపకల్పనతో పాటునిర్మాణ రంగంలో పరాకాష్టగా పరిగణించబడుతుంది. స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణంతో, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ రూపకల్పన మరియు నిర్మాణానికి సముచిత స్వదేశీ సామర్థ్యం ఉన్న దేశాల ఎంపిక స‌ర‌స‌న భారతదేశం చేరనుంది. ఈ విమాన వాహ‌క నౌకలో భారత‌ పారిశ్రామిక సంస్థలు, సుమారు వంద ఎంఎస్ఎంఈల‌తో తయారు చేయబడిన ఇత‌ర పరికరాలు, ప‌లు సిస్ట‌మ్స్‌తో పాటు ఉక్కు వంటి స్వదేశీ పదార్థాలు పెద్ద సంఖ్యలో విక్రాంత్ నిర్మాణంలో వినియోగించ‌డ‌మైంది. ఈ యుద్ధ‌వాహ‌క నౌక  స్వదేశీ నిర్మాణం షిప్‌యార్డ్‌లోనే కాకుండా బాహ్యంగా ప్రాజెక్ట్‌కు మద్దతునిచ్చే అనేక ఇతర పరిశ్రమలకు కూడా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థపై "ప్లాగ్ బ్యాక్" ప్రభావం చూపింది. ఈ ఐఏసీ నిర్మాణంలో సంవత్సరానికి దాదాపు 2000 షిప్‌యార్డ్,  13000 మంది నాన్-యార్డ్ సిబ్బంది నియ‌మించ‌డ‌మైంది.  ఈ పర్యటనలో, గౌరవనీయులైన ఉపరాష్ట్రపతితో పాటు గౌరవనీయులైన కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ సదరన్ నావల్ కమాండ్ రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్, ఎన్ఎం, వీఎస్ఎం, సీఎండీ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) శ్రీ మధు ఎస్ నాయర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. వీరితో పాటుగా నౌకాద‌ళం, సీఎస్ఎల్‌ ఇతర సీనియర్ అధికారులు.కూడా పాల్గొన్నారు.
కోవిడ్ ప్ర‌తిబంధ‌కాలు ఎదురైనా..
ప‌నుల ప‌రిశీల‌న‌ సంద‌ర్బంగా వాహక నౌక చుట్టూ తిరిగే సమయంలో స్వదేశీ సాంకేతికతలు, సామర్థ్యాల సహకారం గురించి గౌర‌వ ఉప‌రాష్ట్రప‌తికి అధికారులు తెలియ‌జేశారు. దీనిపై ఉప‌రాష్ట్రప‌తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మనదేశ‌ స్వదేశీ యుద్ధనౌక నిర్మాణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి భారత నావికాదళం, కొచ్చిన్ షిప్‌యార్డ్ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య నాయువు అభినందించారు. కోవిడ్ సంబంధిత ప్ర‌తిబంధ‌కాలు ఎదురైన‌ప్ప‌టికీ.. ఇప్పటివరకు నౌక నిర్మాణంలో జరిగిన త‌గిన ప‌నుల పురోగ‌తి  పట్ల గౌరవ ఉపరాష్ట్రపతి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంత‌ర‌ గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నేవల్ ఫిజికల్ & ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీని సందర్శించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్‌న్ కూడా ఆవిష్కరించారు. అతను టోవ్డ్ అర్రే ఇంటిగ్రేషన్ ఫెసిలిటీకి కూడా శంకుస్థాపన చేశారు. నేవీకి ఆటోమేటెడ్ సోనార్ ట్రైనర్‌ను అందజేశారు. గౌరవ ఉపరాష్ట్రపతి కేరళలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. లక్షద్వీప్ పర్యటన తర్వాత ఆదివారం ఉదయం కొచ్చి నౌకాదళ విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకు ముందు రోజు ఉపరాష్ట్రపతి గౌరవార్థం ఐఎన్ఎస్‌ గరుడ వద్ద ఉత్సవంగా 100 మంది గార్డులు ప‌రేడ్‌ను నిర్వహించారు. 

 

***

 


(రిలీజ్ ఐడి: 1787016) సందర్శకుల సూచీ సంఖ్య : : 261
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil