ఆర్థిక మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా మొబైల్ తయారీ కంపెనీల మీద ఐటీ దాడులు

Posted On: 31 DEC 2021 6:06PM by PIB Hyderabad

విదేశీ నియంత్రణలో ఉన్న కొన్ని మొబైల్ హాండ్ సెట్ తయారీ సంస్థలమీద, వాటి అనుబంధ  సంస్థలమీద  ఆదాయ  పన్నుశాఖ అధికారులు  దేశవ్యాప్తంగా డిసెంబర్  21 న సోదాలు, స్వాధీనాలు చేపట్టారు. కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.   

రెండు ప్రధాన కంపెనీలు విదేశాలలో ఉన్న తన గ్రూప్ కంపెనీల తరఫున రాయల్టీ రూపంలో దాదాపు రూ.5,500 కోట్లకు పైగా చెల్లింపులు జరిపినట్టు ఈ సోదాలలో బైటపడింది. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాల ప్రకారం అలాంటి ఖర్చుల రూపంలో చెల్లింపులు జరపటం తగిన పద్ధతి కాదని తేలింది.   

మొబైల్ హాండ్ సెట్స్ తయారీకోసం  విడిపరికరాలను కొనుగోలు చేయటానికి పాటించిన విధానాన్ని ఈ సోదాలు బైటపెట్టాయి. ఈ రెండు కంపెనీలు ఆదాయ పన్ను చట్టం, 1961 లోని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదని వెల్లడైంది. అనుబంధ సంస్థలతో నడిపిన లావాదేవీల సమాచారాన్ని వెల్లడించలేదు. అలాంటి తప్పిదం వల్ల ఆదాయ పన్ను చట్టం కింద జరిమానా సహా చర్యలకు బాధ్యులవుతారు. ఆ జరిమానా సుమారు రూ. 1000 కోట్లకు పైగా ఉండవచ్చు.

సోదా వలన మరో తరహా మోసం కూడా బైటపడింది. విదేశీ నిధులను భారతీయ ఖాతా పుస్తకాలలో చూపిస్తూ ఉన్నప్పటికీ వాటి మూలాలను సక్రమంగా వెల్లడించకపోవటం అనుమానాస్పద లావాదేవీలుగా మిగిలిపోతున్నాయి. దీనివలన ఇచ్చిన వ్యక్తి పరపతి స్థాయి ప్రశ్నార్థకంగా మారింది. ఆలా తీసుకున్న రుణం దాదాపు రూ. 5,000 కోట్లు. దానిమీద వడ్డీ కూడా క్లెయిమ్  చేశారు. ఖర్చుల పెంపు, అనుబంధ సంస్థల తరఫున చెల్లింపులు తదితర అంశాలకు సంబంధించిన సాక్ష్యాలు కూడా గమనించారు. దీనిద్వారా పన్ను విధింపుకు గురయ్యే  లాభాలను ఈ మొబైల్ తయారీ కంపెనీలు తగ్గించుకున్నాయి. ఆ మొత్తం సుమారుగా ఆరు,1000 కోట్లకు పైనే ఉండవచ్చు.  

ఈ కంపెనీలలో ఒకటి  భారతదేశంలోని ఒక సంస్థ సేవలను వాడుకున్నప్పటికీ 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన మూలంలో పన్ను తగ్గింపు నిబంధనను పాటించలేదు. ఆ విధంగా ఈ సంస్థ బాధ్యత మూలంలో పన్ను తగ్గింపు పరంగా  దాదాపు రూ. 300 కోట్లు ఉంటుంది.

సోదా జరిగిన మరో కంపెనీ విషయానికొస్తే దాని వ్యవహారాల నీయంత్రణను పొరుగున ఉన్న మరో దేశం నుంచి జరిపినట్టు తేలింది. ఆ కంపెనీ భారతీయ డైరెక్టర్లు నిజానికి దాని నిర్వహణలో తమ పాత్ర ఏదీ లేదని ఒప్పుకున్నారు. కేవలం తమ పేర్లను వాడుకోవటానికి మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు. సంబంధిత పన్నులు చెల్లించకుండానే దాదాపు రూ.42 కోట్లు ఉన్న  కంపెనీ రిజర్వు నిధులన్నీటినీ భారతదేశం నుంచి వెలుపలికి తరలించేందుకు ప్రయత్నించారనటానికి ఆధారాలు కూడా సేకరించారు.

కొన్ని ఫిన్ టెక్, సాఫ్ట్ వేర్ కంపెనీల మీద జరిపిన సర్వే చర్యల ద్వారా తేలిందేమంటే, ఖర్చులను పెంచి చూపటం కోసం అనేక కంపెనీలను సృష్టించారని, ఆ విధంగా నిధులను తరలిస్తున్నారని. ఇందుకోసం కంపెనీలు సంబంధంలేని వ్యాపార అవసరాలకు చెల్లింపులు జరిపాయి. ఉనికిలో లేని ఒక తమిళనాడు కంపెనీ జారీ చేసిన బిల్లులను కూడా ఇందుకోసం వాడుకున్నారు.  ఆలా తరలించిన  మొత్తం దాదాపు రూ.50 కోట్లు ఉంటుంది.

తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

 

****



(Release ID: 1786705) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Hindi