ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత శాఖలలో ఎలక్టోరల్ బాండ్ల విక్రయం

Posted On: 30 DEC 2021 5:45PM by PIB Hyderabad

 

'ఎలక్టోరల్ బాండ్  ప‌థ‌కం-2018'ను భారత ప్రభుత్వం 2018 జనవరి 02వ తేదీ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 20 ద్వారా నోటిఫై చేసింది. పథకం యొక్క నిబంధనల ప్రకారం ఎలక్టోరల్ బాండ్‌లను భారతదేశ పౌరుడు లేదా  భారత దేశంలో విలీనం చేయబడిన లేదా వ్య‌వ‌స్థీకృత‌మైన వారు (గెజిట్ నోటిఫికేషన్‌లోని ఐటెమ్ నంబర్ 2 (డి)లో నిర్వచించినట్లు)  ఎవ‌రైన కొనుగోలు చేయవచ్చు. ఎలక్టోరల్ బాండ్లను  వ్యక్తిగతంగాను లేదా ఇతర వ్యక్తులతో కలిసి కొనుగోలు చేయవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 (43 ఆఫ్ 1951) లోని సెక్షన్ 29ఏ కింద నమోదైన ఆయా రాజకీయ పార్టీలు.  గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌స‌భ‌ లేదా శాసనసభకు పోలైన ఓట్లలో కనీసం ఒక్క శాతం కంటే త‌క్కువ కాకుండా ఓట్లను సాధించిన పార్టీలు ఈ ప‌థ‌కం కింద ఎలక్టోరల్ బాండ్లను స్వీకరించడానికి అర్హులు. ఎలక్టోరల్ బాండ్‌లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంక్‌లోని బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే ఎన్‌క్యాష్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)  XIX దశ విక్రయంలో దాని 29 అధీకృత శాఖల ద్వారా (అనుబంధంలో జతచేయబడిన జాబితా ప్రకారం) ఎలక్టోరల్ బాండ్‌లను జారీ చేయడానికి, ఎన్‌క్యాష్ చేయడానికి 01.01.2022 నుండి 10.01.2022 వరకు.అధికారం క‌లిగిఉంది.  ఎలక్టోరల్ బాండ్‌లు జారీ చేసిన తేదీ నుండి ప‌క్షం (పదిహేను క్యాలెండర్ రోజుల) వరకు చెల్లుబాటులో ఉంటాయి. చెల్లుబాటు వ్యవధి ముగిసిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ డిపాజిట్ చేయబడితే,  స‌ద‌రు పార్టీకి చెల్లింపులు చేయబడవు. అర్హత కలిగిన రాజకీయ పార్టీ తన ఖాతాలో జమ చేసిన ఎలక్టోరల్ బాండ్ల మొత్తం అదే రోజున జమ చేయబడుతాయి.

***


(Release ID: 1786440) Visitor Counter : 220