నీతి ఆయోగ్
వెదురు అభివృద్ధిపై నీతి ఆయోగ్ నిర్వహించనున్న జాతీయ వర్క్ షాప్
Posted On:
29 DEC 2021 5:16PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ రేపు డిసెంబర్ 30న వెదురు అభివృద్ధిపై జాతీయ స్థాయి గోష్టి నిర్వహిస్తోంది.
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, శాస్త్ర సాంకేతికత, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర కుమార్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ , ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్ ఈ గోష్టి ప్రారంభిస్తారు.
వెదురు అభివృద్ధిలో అవకాశాలు సవాళ్లను అర్థం చేసుకోవడానికి, వెదురు రంగంలోని మొత్తం విలువ-గొలుసులో అనుసంధానాలను అన్వేషించడానికి తదనుగుణంగా ఈ రంగానికి వ్యూహాలు దిశానిర్దేశం చేయడానికి భారతదేశం విదేశాల నుంచి అనేక మంది భాగస్వాములు ఈ గోష్టికి హాజరవుతారు.
వర్క్ షాప్‌లో నాలుగు సాంకేతిక సమావేశాలు ఉంటాయి. మొదట ‘వెదురు ఉత్పత్తి, విలువ జోడింపు, అంతర్జాతీయ అనుభవం’, రెండవది ‘వివిధ రంగాల్లో ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, అవకాశాలు’, మూడవది ‘వెదురులో సర్క్యులర్ ఎకానమీ’, చివరి సెషన్ ‘జాతీయ ,అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు’.
వెదురు వినియోగం వాణిజ్యీకరణను పెంచడానికి, నీతి ఆయోగ్ భారతీయ వెదురు పరిశ్రమ యొక్క సమగ్ర అభివృద్ధికి ఆచరణాత్మక విధానాలు/సాంకేతికతలను రూపొందించే ప్రక్రియలో ఉంది. దీని ప్రకారం ‘వెదురు డెవలప్‌మెంట్ మిషన్ డాక్యుమెంట్’ అనే టెక్నో-కమర్షియల్ నివేదికను సిద్ధం చేస్తోంది. భారతదేశంలో సాగు, ఉత్పత్తి, ప్రక్రియ నుండి ప్రామాణీకరణ వినియోగం వరకు పూర్తి వెదురు విలువ-గొలుసును విశ్లేషించాలని నివేదిక యోచిస్తోంది.
వెదురు రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి దేశీయ పరివర్తన సంస్థ NITI-ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మరింత ఉపాధిని సృష్టించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, విలువ జోడింపు మెరుగుపరచడం, ఎగుమతులకు పూరకంగా వెదురు ఉత్పత్తులను వైవిధ్య పరచడం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించాయి.
వర్క్ షాప్ డిసెంబరు 30, 10 గంటల నుంచి కింది లింక్ ద్వారా ప్రసారమవుతుంది.
https://youtu.be/K_MdYr_RcDs
***
(Release ID: 1786225)
Visitor Counter : 177