నౌకారవాణా మంత్రిత్వ శాఖ
మే, 2022 నుంచి ప్రారంభం కానున్న పాండు షిప్ రిపేర్ ఫెసిలిటీ నిర్మాణం, రెండేళ్ళలో పూర్తిః శ్రీ సర్బానంద్ సోనోవాల్
Posted On:
29 DEC 2021 2:40PM by PIB Hyderabad
గువాహతిలోని పాండు షిప్ రిపేర్ ఫెసిలిటీ (నౌకా మరమ్మత్తుల సదుపాయం) పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర రేవులు, షిప్పింగ్ & జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ సోవారం (27.12.21) ఇన్‌ల్యండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ), కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, ఐఐటి మద్రాస్‌కు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సదుపాయ నిర్మాణ కార్యకలాపాలు మే, 2022 నుంచి ప్రారంభించవలసి ఉన్నందున దానికి సంబంధించిన సాంకేతిక పని పూర్తి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టును రెండేళ్ళలోపు, అంటే 2024కి పూర్తి చేయాలన్నది లక్ష్యం.
నూతన నౌకా మరమ్మత్తుల సదుపాయానికి సంబంధించిన ప్రకటన 26 ఆగస్టు, 2021న వెలువడింది. ఈ సదుపాయం ప్రాంత ఆర్థిక పునరుద్ధరణకు ప్రధానంగా దోహదం చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా, అమలును ఐడబ్ల్యుఎఏఐ, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంయుక్తంగా చేపడుతున్నాయి. దీనికి సాంకేతిక మద్దతును ఐఐటి, మద్రాస్ అందిస్తోంది. స్లిప్‌వేగా పేర్కొనే ఈ సదుపాయాన్ని అస్సాం ప్రభుత్వం అందించిన 3.67 ఎకరాల భూమిలో అభివృద్ధి చేయనున్నారు.
ఈశాన్య ప్రాంత భవిష్యత్ ప్రగతి జలమార్గాల అభివృద్ధిలోనే ఉందని మంత్రి వివరించారు.జాతీయ జలమార్గం-2- బ్రహ్మపుత్ర తో పాటుగా జాతీయ జలమార్గం 6 - బార్క్‌లో పని ప్రారంభమైందని, ఇవి సరుకు రవాణా, ప్రయాణీకుల రవాణాతో పాటుగా పర్యాటకుల పడవలతో సౌలభ్యంతో ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధికై తోడ్పడతాయని ఆయన వివరించారు. మోటారు సామర్ధ్యం గల జలమార్గాలను సాధించేందుకు, రెండు నదుల పూడికలను కీలక సమయాల్లో తీయవలసి ఉంటుందని, తద్వారా సరకు రవాణా ఓడల రాకపోకలకు తగినంత లోతును సాధించవచ్చు, అని ఆయన అన్నారు.
సరుకు, ప్రయాణీకులను సాఫీగా, వేగవంతంగా తరలించేందుకు నదులను జలమార్గాలుగా అభివృద్ధి చేయడం ద్వారా మన గొప్ప ఆర్థిక చరిత్రను పునరుద్ధరించవచ్చని శ్రీ సోనోవాల్ పేర్కొన్నారు. మొత్తం ఈశాన్య ప్రాంత ఎగుమతులను ప్రోత్సహించడమే కాక, ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనా అవకాశాలను ప్రధానంగా ద్విగుణీకృతం చేస్తుందని ఆయన చెప్పారు. జలమార్గాల అభివృద్ధికి అన్ని ఈశాన్య ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలూ మద్దతునందించాయన్నారు. ప్రజలు ఫలాలను పొంది, అభివృద్ధి చెందేందుకు రాష్ట్రప్రభుత్వాలతో కలిసి మేం- అనగా కేంద్రం ఎటువంటి ఆటంకాలూ లేకుండా కలసి పని చేస్తామని ఆయన తెలిపారు.
***
(Release ID: 1786176)
Visitor Counter : 170