ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆదాయపు పన్ను శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 4.67 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపులు దాఖలయ్యాయి.

Posted On: 28 DEC 2021 8:12PM by PIB Hyderabad
డిసెంబర్ 27, 2021 నాటికి ఆదాయపు పన్ను శాఖ  కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో 4.67 కోట్ల ఆదాయపు పన్ను చెల్లింపులు (ఆదాయపన్ను చెల్లింపులు) దాఖలు అయ్యాయి. 27.12.2021 నాటికి 15.49 లక్షలకు పైగా ఆదాయపన్ను చెల్లింపులు దాఖలు చేశారు 31 డిసెంబర్, 2021 గడువు తేదీ సమీపించేనాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
ముందస్తు అంచనా సం.  2021-22 (ఎసెస్మెంట్ ఇయర్) కోసం దాఖలు చేసిన 4.67 కోట్ల ఆదాయపన్ను చెల్లింపులలో, 53.6% ఆదాయపన్ను చెల్లింపులు-1 (2.5 కోట్లు) గానూ , 8.9% ఆదాయపన్ను చెల్లింపులు-2 (41.7 లక్షలు), 10.75% ఆదాయపన్ను చెల్లింపులు-3 (50.25 లక్షలు), 25% ఆదాయపన్ను చెల్లింపులు-4 (1.17 కోట్లు), ఆదాయపన్ను చెల్లింపులు-5 (5.18 లక్షలు), ఆదాయపన్ను చెల్లింపులు-6 (2.15 లక్షలు)  ఆదాయపన్ను చెల్లింపులు-7 (0.43 లక్షలు) గానూ గుర్తించారు. ఈ ఆదాయపన్ను చెల్లింపులు లలో 48.19% శాఖ అధికార పోర్టల్‌లోని ఆన్‌లైన్ ఆదాయపన్ను చెల్లింపు సంబంధిత  పట్టికను ఉపయోగించి నమోదు  అయ్యాయి. ఆఫ్‌లైన్ సాఫ్ట్‌వేర్ యుటిలిటీల నుండి సృష్టించబడిన ఆదాయపన్ను మార్గాలనుపయోగించి మిగిలిన చెల్లింపులు  నమోదు అయ్యాయి 
3.91 కోట్లకు పైగా చెల్లింపులు  ధృవీకరించారు, వీటిలో 3.35 కోట్లకు పైగా ఆధార్ ఆధారిత OTP ద్వారా అయ్యాయి. గత 3 రోజుల్లోనే, కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో వచ్చినవి  27.7 లక్షల ఆధార్ OTP అభ్యర్థనలు  . పన్ను చెల్లింపుదారులు బకాయిలు  ఉన్న కేసులలో వీలైనంత త్వరగా ఇ-ధృవీకరణను పూర్తి చేయాలని సూచించారు.
ఇ- ధృవీకరణ ధృవీకరణను అయిన  ఆదాయపన్ను చెల్లింపులలో 2.88 కోట్ల కంటే ఎక్కువ ఆదాయపన్ను చెల్లింపులు  ప్రాసెస్ చేశారు అంచనా సం. 2021-22 కోసం 1.07 కోట్లకు పైగా రీఫండ్‌లు జారీ చేశారు 
పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకూడదని తదుపరి ఆలస్యం లేకుండా వారిని ఆదాయపు పన్ను చెల్లింపులు చేయమని  సదరు ఆదాయపన్ను శాఖ  ఇమెయిల్‌ల ద్వారా, సంక్షిప్త సమాచార సేవ, మీడియా ప్రచారాల ద్వారా పన్ను చెల్లింపుదారులకు గుర్తు  చేస్తోంది. AY 2021-22కి సంబంధించి తమ ఆదాయపు పన్ను చెల్లింపులను ఇంకా ఫైల్ చేయని పన్ను చెల్లింపుదారులందరూ   ఆలస్య రుసుమును కట్టే అవసరం లేకుండా  వీలైనంత త్వరగాచెల్లించాలని శాఖ  అభ్యర్దిస్తుంది.

***

 


(Release ID: 1785959) Visitor Counter : 175