వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వంటనూనెలో భారతదేశాన్ని ‘అత్మనిర్భర్’ గా మార్చాలన్నది లక్ష్యం: శ్రీ తోమర్


హైదరాబాద్ లో వంటనూనెలు-ఆయిల్ పామ్ జాతీయ మిషన్ పై బిజినెస్ సమ్మిట్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

ఆయిల్ పామ్ ఉత్పత్తిలో పురోగామి రాష్ట్రం గా తెలంగాణ : కేంద్ర వ్యవసాయ మంత్రి

ప్రాసెసర్ల ద్వారా సరళమైన మరియు పారదర్శక ఫార్ములా ప్రకారం రైతులు ఉత్పత్తి తాజా పండ్ల గుత్తుల సేకరణ: శ్రీ తోమర్

Posted On: 28 DEC 2021 4:15PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల కోసం వంటనూనె- ఆయిల్ పామ్ జాతీయ మిషన్ వ్యాపార సదస్సు ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ రోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. వంటనూనెలపై కొత్తగా ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకంపై విస్తృత సమాచారాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో, ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యాపార శిఖరాగ్ర సదస్సులను నిర్వహిస్తోంది. ఇది  జాతీయ మిషన్ రెండవ సదస్సు. మొదటిది ఏడాది అక్టోబర్ ప్రారంభంలో ఈశాన్య రాష్ట్రాల కోసం గువాహతి  లో జరిగింది.

 

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఒక ఆయిల్ పామ్ మొక్కకు నీరు పెట్టడం ద్వారా సదస్సు ను ప్రారంభించారు. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌదరి, తెలంగాణ, కేరళ వ్యవసాయ మంత్రులు కూడా పాల్గొన్నారు.

వంటనూనె - ఆయిల్ పామ్ పై జాతీయ మిషన్ ను విజయవంతంగా అమలు చేయడానికి వనరుల కొరత ఉండదని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ సదస్సు లో ప్రసంగిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ నాయకత్వంలో పామాయిల్ రంగంలో భారత దేశం స్వావలంబన

సాధించాలన్నది ప్రభుత్వం ఉద్దేశమని శ్రీ తోమర్ తెలిపారుప్రస్తుతం సుమారు 3 లక్షల హెక్టార్ల భూమి పామాయిల్ సాగులో ఉండగా, దేశంలో సుమారు 28 లక్షల హెక్టార్ల భూమి ఆయిల్ పామ్ సాగుకు అనువుగా ఉన్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి.వంట నూనె లో భారతదేశాన్ని అత్మనిర్భర్ గా మార్చడానికి 28 లక్షల హెక్టార్ల భూమిని ఆయిల్ పామ్ సాగులోకి తీసుకురావడం మా లక్ష్యం" అని శ్రీ తోమర్ అన్నారు.

 

పామాయిల్ ఉత్పత్తిని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ప్రశంసించిన శ్రీ తోమర్, పామాయిల్ ఉత్పత్తిలో తెలంగాణ ను సారథ్య స్థాయి లో ఉన్న రాష్ట్రంగా  తాను చూస్తున్నానని చెప్పారు.రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అవకాశాల గురించి మాట్లాడుతూ, ఉత్పత్తికి ఆటంకం కలిగించకుండా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సహజ వ్యవసాయాన్ని స్వీకరించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన పిలుపునిచ్చారు.

తొలి బిజినెస్ సమ్మిట్ నుంచి ఆయిల్ పామ్ - వంట నూనెల జాతీయ మిషన్ కింద సాధించిన పురోగతి పట్ల శ్రీ తోమర్ సంతోషం వ్యక్తం చేశారు. వయబిలిటీ గ్యాప్ పేమెంట్ కోసం తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం ఎమ్ఒయుపై సంతకాలు చేసింది, మిషన్ కొత్త నిబంధనలను చేర్చి 11 రాష్ట్రాల సవరించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేసింది.పంట వైవిధ్యకార్యక్రమం ఉప ఇతివృత్తంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఆయిల్ పామ్ పై జాతీయ వర్క్ షాప్ ను నిర్వహించింది. రూ.106.90 కోట్ల విలువైన పదకొండు రాష్ట్రాల ఎఎపిలు 6563 హెక్టార్ల లో ఏరియా విస్తరణకు ఆమోదం పొందాయి, 3058 హెక్టార్ల లో రీ ప్లాంటింగ్, ప్రస్తుత 25197 హెక్టార్ లలో నిర్వహణ , అంతర పంట,  1569 హెక్టార్ల లో కొత్త ఆయిల్ పామ్ తోటలు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పించారు. మిషన్ నుంచి సబ్సిడీతో ఈశాన్య రాష్ట్రాలలో నాలుగు ప్రాసెసింగ్ మిల్స్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, విత్తన మొలకలు ,నారు లభ్యతను పెంచడానికి 3 విత్తన తోటలు ,39 నర్సరీలను ఏర్పాటు చేస్తారు. నాణ్యమైన సేంద్రియ ఎరువు ఉత్పత్తి కోసం వెర్మికంపోస్ట్ షెడ్లు (360) ,తోట పనిముట్లను అద్దెకు తీసుకోవడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్లు (18) కూడా ప్రస్తుత సంవత్సరంలో అందుబాటు లోకి వస్తాయి. ఇంకా, ప్రధాన ఆయిల్ పామ్ . మొలకల ఎగుమతి దేశాల భారతీయ రాయబారులతో పెద్ద మొత్తంలో నాణ్యమైన విత్తు పదార్థాలను అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి ఒక సమావేశం కూడా జరిగింది.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌదరి మాట్లాడుతూ, "ప్రస్తుతం మనం వంటనూనె దిగుమతి చేయాల్సి ఉంది. నేటి వ్యాపార సదస్సు సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ప్రాముఖ్యత కలిగి ఉంది ‘’ అని అన్నారు. మిషన్ పట్ల తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, శాస్త్రవేత్తల పరిశోధన, రైతుల కృషి ,ప్రభుత్వ మద్దతు సహాయంతో, మిషన్ తన లక్ష్యాన్ని సాధిస్తుందని ,భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో గణనీయమైన సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. వంట నూనెల ఉత్పత్తిని పెంచడానికి, ప్రోత్సాహక ధర అందించడానికి , నూనె గింజల పంటల సేకరణకు ప్రభుత్వం హామీ ఇస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ,ఆయిల్ పామ్ ఎఫ్ ఎఫ్ బిలకు (తాజా పండ్ల గుత్తులు) రైతులకు అధిక ధర ను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని రాష్ట్ర వ్యవసాయ , అనుబంధ రంగాల మంత్రి శ్రీ ఎస్. నిరంజన్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ విస్తరణ కోసం ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించిందని కూడా తెలిపారు.

కేరళ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పి.ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆయిల్ పామ్ ను ప్రోత్సహించడానికి కేరళ ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు.

 

సందర్భంగా రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్ పిఒలు) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల పంపిణీ కూడా జరిగింది.

 

అంతకుముందు, వ్యవసాయ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ ప్రభుత్వ దార్శనికతను వివరించడం ద్వారా సదస్సుకు శ్రీకారం చుట్టారు. రైతులు, ప్రాసెసర్లు ,రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించేలా  మిషన్ కు కట్టుదిట్టమైన రూపకల్పన చేశారు. పంట వేసే మెటీరియల్ సరఫరా, ప్రాసెసర్ల ద్వారా సకాలంలో సేకరణ రైతులకు ఎఫ్ ఎఫ్ బిలు (ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ లు) కోసం గిట్టుబాటు ధరను ఏర్పాటు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారుభూమి , వాతావరణ పరిస్థితుల ఆధారంగా గుర్తించిన ప్రాంతాలు అన్నీ పర్యావరణ ప్రతికూల ప్రభావం లేకుండా ఆయిల్ పామ్ అధిక దిగుబడిని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన వివరించారు. ఆయిల్ పామ్ తో ఇతర పంటలను అంతర పంటలు గా వేయడం వల్ల నేల ,నీటిని మరింత సంరక్షిస్తుంది . ఇంకా వాతావరణ మార్పులను తగ్గించడానికి మరింత కార్బన్ ను వేరు చేస్తుంది.

 

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ మాట్లాడుతూ,  3-4 సంవత్సరాలలో తెలంగాణ దేశంలోనే  అతిపెద్ద ఆయిల్ పామ్ ఉత్పత్తి ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విషయంలో రాష్ట్రం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు, ఆయిల్ పామ్. సాగు కోసం తెలంగాణ 26 జిల్లాల ను నోటిఫై చేసిందని, రాష్ట్రంలో 11 ఆయిల్ ప్రాసెసర్లు పనిచేస్తున్నాయని చెప్పారు. 2022-23 సంవత్సరానికి అయిదు లక్షల హెక్టార్ల లో తోటల పెంపకాన్ని లక్ష్యం గా

నిర్దేశించినట్టు తెలిపారు. 324 లక్షల విత్తన మొలకలకు ఇండెంట్ ఇచ్చారు. విత్తన నర్సరీ కోసం 1045 హెక్టార్ల భూమిని సేకరించారు. 23 నర్సరీలను ఏర్పాటు చేశారు.

 

వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సుభద్రా ఠాకూర్పలు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ,నీతి ఆయోగ్, ఐసిఎఆర్ సంస్థలు, ఎంఈఏ అధికారులువైస్ ఛాన్సలర్లు, ఎస్ బిఐ, నాబార్డ్, నాఫెడ్, సాల్వెంట్ ఎక్స్ ట్రాక్షన్ అసోసియేషన్ (సీ), ayilbపామ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ ప్రాసెసర్లు, ప్రగతిశీల రైతులు , వ్యవసాయ వ్యాపార వాణిజ్యానికి చెందిన సానుకూల పెట్టుబడిదారులు సదస్సులో పాల్గొన్నారు.

 

***


(Release ID: 1785846) Visitor Counter : 187


Read this release in: English , Urdu , Hindi , Tamil