సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
“జాతీయ విద్యా విధానం -2020 లో భాగంగా మానవ వనరుల అభివృద్ధి పరివర్తన ” పై 2 రోజుల జాతీయ సదస్సు
Posted On:
27 DEC 2021 4:29PM by PIB Hyderabad
దివ్యాంగుల పునరావాస రంగంలో ప్రత్యేక విద్య, శిక్షణా కార్యక్రమాలు ప్రామాణీకరణ, నియంత్రణ, పర్యవేక్షణ వంటి లక్ష్యాలతో పార్లమెంట్ రూపొందించిన జాతీయ పునరావాస మండలి చట్టం, 1992 ద్వారా జాతీయ పునరావాస మండలి (RCI) ఏర్పాటు చేశారు. మండలికి కేటాయించబడిన 16 వర్గాల నిపుణులు / సిబ్బంది కనీస విద్య, శిక్షణ నిర్దేశించడం, కేంద్రీయ పునరావాస జాబితా (CRR) నిర్వహణ దివ్యాంగుల సహాయార్థం పరిశోధనలను ప్రోత్సహించడం మండలి ప్రధాన విధులు.
దివ్యాంగుల హక్కుల చట్టం (RPwD), 2016 ని ప్రభుత్వం అమలు చేసిన తర్వాత. భారతదేశ జాతీయ విద్యా విధానం NEP-2020 నిబంధనల ప్రకారం, ప్రత్యేక విద్య ద్వారా దివ్యాంగుల పునరావాస రంగంలో మానవ వనరుల అభివృద్ధి పరివర్తన చెందించడానికి మండలి దిశానిర్దేశం చేయడం చాలా అవసరం.
పైవాటిని దృష్టిలో ఉంచుకుని, మండలి 28-29 డిసెంబర్, 2021న గౌహతి, అస్సాం లోని ఈశాన్య ప్రాంత ఆర్ధికాభివృద్ధి కార్పొరేషన్ (NEDFI) సమావేశంలో ప్రకటించిన విధంగా “జాతీయ విద్యా విధానం -2020 మానవ వనరుల అభివృద్ధిని పరివర్తన ”పై జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. పైన పేర్కొన్న జాతీయ సింపోజియమ్‌కు భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి కుమారి ప్రతిమా భౌమిక్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ప్రత్యేక అతిథిగా శ్రీ జిష్ణు బారువా IAS, అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DEPwD చైర్‌పర్సన్, శ్రీమతి అంజలి భావరా, సెక్రటరీ, RCI, డా. ప్రబోధ్ సేథ్, జాయింట్ సెక్రటరీ, DEPwD, డా. సుబోధ్ కుమార్, మెంబర్ సెక్రటరీ, RCI ఇతర గౌరవ అతిథులు. జాతీయ సింపోజియం లో రాష్ట్ర ఓపెన్, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్(లు), పీడబ్ల్యూడీ రాష్ట్ర కమిషనర్లు, చీఫ్ కోఆర్డినేటర్లు, జోనల్ కోఆర్డినేషన్ కమిటీలు, ఆర్‌సీఐ, ఇతర ప్రముఖ నిపుణులు సహా దేశం నలుమూలల నుంచి 120 మంది పాల్గొంటారు.
జాతీయ సింపోజియం సందర్భంగా ప్రత్యేక విద్య, సమగ్ర విద్య, మాట- వినికిడి, క్లినికల్ & రిహాబిలిటేషన్ సైకాలజీ వంటి 6 గుర్తించబడిన ఇతివృత్తాలపై, పునరావాస నిపుణులు చర్చించి, ఆర్‌పిడబ్ల్యుడి చట్టం, 2016 ఎన్‌ఇపి, 2020లో రూపొందించిన వివిధ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక విద్య, వైకల్య పునరావాస రంగంలో మానవ వనరుల పరివర్తనకు RCI కార్యక్రమాలు సమలేఖనం చేయడానికి అవసరమైన సిఫార్సులు చేస్తారు.
***
(Release ID: 1785667)
Visitor Counter : 171